ఆర్థిక మంత్రిత్వ శాఖ
జిఎస్‌టి రెవిన్యూ వసూళ్లు 2021 ఏప్రిల్‌లో కొత్త రికార్డును సాధించాయి
రూ 1,41,384 కోట్ల రూపాయలకు చేరిన జిఎస్‌టి రెవిన్యూ స్థూల రాబడి
Posted On:
01 MAY 2021 2:47PM by PIB Hyderabad
2021 ఏప్రిల్ నెలలో జిఎస్‌టి స్థూల రెవిన్యూ వసూళ్లు రికార్డు స్థాయిలో 1,41,384 కోట్ల రూపాయలకు చేరాయి. ఇందులో సిజిఎస్‌టి 27,837 కోట్ల రూపాయలు కాగా, ఎస్‌జిఎస్‌టి 35,621 కోట్ల రూపాయలు, ఐజిఎస్‌టి 68,481 కోట్ల రూపాయలు ( ఇందులో 29,599 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న సరకులపై వసూలు చేసినది ఉంది) సెస్8,445 కోట్ల రూపాయలు 9 ఇందులో 981 కోట్లు సరకుల దిగుమతిపై వసూలు చేసినది) ఉంది. కోవిడ్ -19 రెండో వేవ్ దేశంలోని వివిధ ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ భారతీయ వ్యాపార సంస్థలు మరోసారి చెప్పుకోదగిన పనితీరు కనబరిచాయి. ఇవి రిటర్న్‌లు దాఖలు చేయడంలో, జిఎస్‌టి బకాయిలు సకాలంలో చెల్లించడంలో వేగంగా నిలదొక్కుకోగలిగాయి.
జిఎస్‌టి రాబడి ఏప్రిల్ 2021లో , జిఎస్‌టి ప్రారంభించిన తర్వాత వచ్చిన గరిష్ఠ మొత్తంగా చెప్పుకోవచ్చు. మార్చి 2021లో వచ్చిన మొత్తాన్ని కూడా ఇది అధిగమించింది. గత ఆరు నెలలుగా జిఎస్‌టి రాబడి పెరుగుతూ వస్తున్న ధోరణికి అనుగుణంగా 2021 ఏప్రిల్ నెలకు 2021 మార్చితో పోలిస్తే 14 శాతం ఎక్కువ జిఎస్టి రాబడి వచ్చింది. ఏప్రిల్ నెలలో దేశీయ లావాదేవీల నుంచి (దిగుమతుల సేవల తోపాటు) గత నెలలో సాధించిన రాబడి కంటే 21 శాతం ఎక్కువ రాబడి వచ్చింది.
జిఎస్‌టి రెవిన్యూ గత ఏడు నెలల్లో విజయవంతంగా లక్ష కోట్ల రూపాయల మార్కును దాటడమే కాకుండా, క్రమంగా వృద్ధిని సూచిస్తున్నది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న దానికి ఇది స్పష్టమైన సంకేతం. నకిలీ బిల్లులను జాగ్రత్తగా గమనించడం, వివిధ మార్గాలలో లోతుగా గణాంకాల విశ్లేషణ, జిఎస్‌టి, ఆదాయపన్ను, కస్టమ్స్, ఐటి వ్యవస్థలనుంచి సమాచారాన్ని తెప్పించి విశ్లేషించడం, సమర్ధమైన పన్ను ల పాలన వంటివి ఇందుకు దోహదం చేశాయి.త్రైమాసిక రిటర్నులు, నెలవారి చెల్లింపు పథకం సమర్ధంగా అమలు జరుగుతుండడంతో చిన్న పన్ను చెల్లింపు దారులకు ఉపశమనం కలిగిస్తోంది. వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒకే ఒక రిటర్ను దాఖలు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ముందస్తు గా పూర్తి చేసిన జిఎస్‌టిఆర్ 2 ఎ , 3బి రిటర్నులు అందించడం ద్వారా వారికి ఐటి మద్దతు ఇవ్వడం, సిస్టమ్ కెపాసిటీ పెంపు వంటివి రిటర్న్ దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేశాయి.
ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం సిజిఎస్‌టి కి 29,185 కోట్ల రూపాయలు అలాగే ఎస్‌జిఎస్‌టికి 22, 756 కోట్ల రూపాయలు ఐజిఎస్‌టి నుంచి రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా నిర్ధారించింది. 2021 ఏప్రిల్‌లో రెగ్యులర్, అడ్‌హాక్ సెటిల్‌మెంట్‌ల అనంతరం మొత్తం కేంద్రం, రాష్ట్రాల రాబడి సిజిఎస్‌టికి 57,022 కోట్ల రూపాయలు, ఎస్‌జిఎస్‌టి కి 58,337 కోట్ల రూపాయలు.
ఈ కింది చార్టు, నెలవారీ స్థూల జిఎస్‌టి రెవిన్యూలను 2020 అక్టోబర్ నుంచి 2020 మార్రి వరకు , 2021 ఏప్రిల్ కాలానికి సూచిస్తుంది.
***
(Release ID: 1715397)
Visitor Counter : 269