భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
కోవిడ్-19 నేపథ్యంలో ఇంటి సంరక్షణ చిట్కాలను విడుదల చేసిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం
Posted On:
30 APR 2021 3:00PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వైరస్ సోకి తేలిక పాటి లక్షణాలు కలిగిన వారు ఇంట్లోనే ఉంటూ తీసుకోవాల్సిన చికత్స చర్యల సమాహారంతో భారత ప్రభుత్వ ప్రధాన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం "కోవిడ్-19 నిర్వహించడానికి ఇంటి సంరక్షణ చిట్కాలు" అనే పేరుతో ఒక సాధారణ దృశ్య సూచకను తీసుకు వచ్చింది. కోవిడ్-19 సంక్రమణ సంబంధించి ఏవైనా లక్షణాలు కనిపిస్తే ప్రజలు భయపడవద్దని సూచించింది. ఎక్కువ మంది ప్రజలు తమ వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను స్వయం సంరక్షణ చర్యలను అనుసరించడం ద్వారా ఇంట్లోనే చికిత్సపొందోచ్చు అని పేర్కొంది. లక్షణాలకు సంబంధించి మొదటి సంకేతం అందగానే, ప్రజలు ఇంట్లో ఒంటరిగా ఉండి, స్వీయ-రక్షణ చర్యలను అనుసరించడం మొదలు పెట్టాలని సిఫారసు చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఈ అడ్వైజరీ సూచించింది. ఇది వ్యాధి సంక్రమణతో పోరాడటానికి శరీర స్వభావం రోగనిరోధక ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుందని తెలిపింది. ఐసోలేట్ కావడం చాలా ప్రధానం. తగిన విశ్రాంతి తీసుకోవడం హైడ్రేట్ చేసుకోవడంతో పాటుగా
క్రమం తప్పకుండా రోగి యొక్క రక్త ఆక్సిజన్ స్థాయిలు మరియు ఉష్ణోగ్రతలను
కనిపెట్టుకుంటూ ఉండాలి. జ్వరం కొనసాగితే లేదా ఆక్సిజన్ స్థాయిలు ఎస్‌పీO2 92% కంటే తక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఎస్‌పీ O2 స్థాయిలు 94% కంటే తక్కువగా ఉంటే ఊపిరితిత్తుల ఆక్సిజనేషన్‌ను తగినట్టుగా మెరుగు పరచడంలో సహాయపడటానికి అనుసరించాల్సిన విధానాలను కూడా ఈ అడ్వైజరీలో తెలియజేయడమైంది. రోగి ఉంటున్న గదిని తగినట్టు వెంటిలేషన్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతను కూడా గైడ్ హైలైట్ చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి తగు టీకా వేసుకోవాల్సిన ప్రాముఖ్యతను గైడ్ వివరించింది. టీకాలు వేసుకున్న తరువాత కూడా, కోవిడ్‌కు సంబంధించిన ప్రవర్తన నియమావళిని పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది అని ఈ అడ్వైజరీ ప్రజలకు గుర్తు చేసింది.
పీఎస్ఏ హోమ్‌కేర్ టిప్స్_ఫైనల్ హిందీని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
పీఎస్ఏ హోమ్‌కేర్ టిప్స్_కోవిడ్-19_ఫైనల్ ఇంగ్లీష్‌ను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
******
(Release ID: 1715175)
Visitor Counter : 228