రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొవిడ్‌పై పోరాటానికి సాయుధ బలగాలకు ప్రత్యేక నిబంధనలు, అత్యవసర ఆర్థిక అధికారాలను కల్పించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

प्रविष्टि तिथि: 30 APR 2021 6:01PM by PIB Hyderabad

కొవిడ్‌పై పోరాటాన్ని వేగవంతం చేసేలా సాయుధ బలగాలకు బలాన్ని చేకూరుస్తూ; వారికి ప్రత్యేక నిబంధనలు, అత్యవసర ఆర్థిక అధికారాలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ కల్పించారు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మద్దతునిచ్చే సేవలు, కార్యక్రమాలను చేపట్టేలా ఫార్మేషన్‌ కమాండర్లకు ఈ అధికారాలు తోడ్పడడంతోపాటు, క్వారంటైన్‌ సౌకర్యాలు/ ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణ, పరికరాల సేకరణ/ మరమ్మతులు చేయించేందుకు సాయపడతాయి.

    ఈ అధికారాల కింద, సాయుధ బలగాల ఉప అధిపతులతోపాటు, సమీకృత భద్రత బలగాల అధిపతుల నుంచి స్టాఫ్‌ కమిటీల ఛైర్మన్‌ చీఫ్‌ల వరకు, జనరల్‌ చీఫ్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌, సమాన హోదా కలిగిన అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చారు. కార్ప్స్‌ కమాండర్లు/ ప్రాంతీయ కమాండర్లు, వీరితో సమాన హోదా కలిగిన అధికారులు ఒక్కో సందర్భానికి రూ.50 లక్షల వరకు, డివిజన్‌ కమాండర్లు/ ఉప ప్రాంతీయ కమాండర్లు, వీరితో సమాన హోదా కలిగిన అధికారులు రూ.20 లక్షల వరకు ఖర్చు పెట్టే అధికారం కల్పించారు. మే 1 నుంచి జులై 31 వరకు, మూడు నెలలపాటు ఈ ప్రత్యేక అధికారాన్ని అధికారులు ఉపయోగించుకునేలా ప్రాథమికంగా నిర్ణయించారు. గత వారం సైనిక బలగాల వైద్యాధికారులకు అప్పగించిన అత్యవసర అధికారాలకు ఇవి అదనం.

    కొవిడ్‌ మొదటిసారి విజృంభించినపుడు, గతేడాది కూడా సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు అప్పగించారు. కొవిడ్‌ పరిస్థితులను వేగంగా, సమర్థంగా నిర్వహించడానికి ఈ అధికారాలు సైనిక బలగాలకు తోడ్పడ్డాయి.

 

***


(रिलीज़ आईडी: 1715167) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil