రైల్వే మంత్రిత్వ శాఖ

హర్యానా, ఎం.పి, తెలంగాణ, యు.పి. రాష్ట్రాలకు వెళ్ళే మార్గంలో ఉన్న - మరిన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు


మొత్తం 664 మెట్రిక్ టన్నుల ద్రవరూప వైద్య ఆక్సిజన్ (ఎల్.ఎమ్.ఓ) ను, భారతీయ రైల్వే, రవాణా చేసింది. కాగా, మరో 126 మెట్రిక్ టన్నులు మార్గ మధ్యలో ఉన్నాయి

ఉత్తరప్రదేశ్ (7 వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్), మధ్యప్రదేశ్ (2 వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్), హర్యానా (1 వ మరియు 2 వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్) రాష్ట్రాలకు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు మార్గ మధ్యలో ఉన్నాయి

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ నిర్వహణ ద్వారా రాష్ట్రాలకు ఉపశమనం కొనసాగిస్తున్న - భారతీయ రైల్వే

Posted On: 30 APR 2021 4:00PM by PIB Hyderabad

భారతీయ రైల్వే తన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఇంకా అనేక మంది ప్రాణాలను కాపాడుతోంది.  రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనల ఆధారంగా మరిన్ని ఎక్కువ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను నడపడానికి రైల్వే పూర్తి సన్నద్ధతలో ఉంది.

 

 

 

మధ్య ప్రదేశ్ తన రెండవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ను అందుకోనుంది. ఈ రైలు, బోకారో లో బయలు దేరి, సాగర్, జబల్‌పూర్‌ లకు నాలుగు ట్యాంకర్లలో, 47.37 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎమ్‌.ఓ. ను రవాణా చేస్తోంది.  2021 ఏప్రిల్, 29వ తేదీన, బొకారో లో బయలుదేరిన ఈ రైలు,  ఎక్కడా ఆగకుండా, ఈ సాయంత్రానికి గమ్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. 

 

 

 

హర్యానా తొలి, రెండవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను, త్వరలో అందుకోనుంది. ఒక రైలు రూర్కెలా నుండి 3 ట్యాంకర్ల లో 47.11 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ. ను హర్యానా కు రవాణా చేస్తుండగా,  మరొకటి, అంగుల్ నుండి  2 ట్యాంకర్ల లో 32 మెట్రిక్ టన్నుల ఎల్.ఎమ్.ఓ. ను హర్యానా కు రవాణా చేస్తోంది.  కాగా, ఈ రెండు రైళ్ళూ గమ్యస్థానానికి చేరుకోడానికి మార్గ మధ్యలో ఉన్నాయి. ఈ రైళ్లు హర్యానా నివాసితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా ను సురక్షితంగా, సకాలంలో అందించనున్నాయి. 

 

 

 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళ ద్వారా ఉత్తరప్రదేశ్ కు, ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.   మూడు ట్యాంకర్ల ద్రవ రూప వైద్య ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) తో బోకారో నుండి ఉత్తరప్రదేశ్ కు 7వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ త్వరలో బయలుదేరనుంది. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచడానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ద్రవ రూప ఆక్సిజన్‌ తో నింపిన 10 అడుగుల ఐ.ఎస్‌.ఓ. కంటైనర్లను జంషెడ్‌పూర్ నుంచి లక్నోకు రవాణా చేయాలని కోరింది.  ఐ.ఎస్.ఓ. కంటైనర్లను రవాణా చేయడానికి అదనపు ప్రణాళిక అవసరం కాగా, రైల్వే అధికారులు ప్రస్తుతం ఐ.ఎస్.ఓ. కంటైనర్లను సురక్షితంగా, భద్రంగా తరలించడానికి సాధ్యమైనంత ఉత్తమ విధానాల ఎంపికపై కృషి చేస్తున్నారు.  ద్రవ రూప వైద్య  ఆక్సిజన్ తో నిండిన ఐ.ఎస్.ఓ. కంటైనర్లు 2021 మే , 20వ తేదీన  జంషెడ్పూర్ దగ్గర లోడ్ అవుతాయని భావిస్తున్నారు.

 

 

 

ఇప్పటివరకు, భారత రైల్వే, మహారాష్ట్ర కు 174 మెట్రిక్ టన్నులు; ఉత్తర ప్రదేశ్ కు 356.47 మెట్రిక్ టన్నులు;  మధ్యప్రదేశ్ కు 64 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ కి 70 మెట్రిక్ టన్నుల చొప్పున, మొత్తం 664 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను రవాణా చేసింది.  హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు త్వరలో, తమ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను స్వీకరించడం ప్రారంభించనున్నాయి.  

 

 

*****


(Release ID: 1715144) Visitor Counter : 217