హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన సూచనలో తెలియజేసిన విధంగా కంటైన్మెంట్ చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసిన - దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ


Posted On: 29 APR 2021 8:32PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ), ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన సూచనలో తెలియజేసిన విధంగా కంటైన్మెంట్ చర్యలను పరిగణనలోకి తీసుకోవాలనీ, అలాగే, పరిస్థితిని అంచనా వేయడం ద్వారా వెంటనే అమలు చేయాలని కోరుతూ, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు (యు.టి.లకు), ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ (డి.ఎం) చట్టం, 2005 లోని సంబంధిత నిబంధనల ప్రకారం, అవసరమైన నియంత్రణ చర్యలను అమలు చేయాలని, ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రాలు మరియు యు.టి. లను కోరడం జరిగింది.

25.4.2021 తేదీన ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. విడుదల చేసిన సూచనలో, గత వారంలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాలను, లేదా ఎక్కడ 60 శాతం కంటే ఎక్కువ పడకలు నిండి పోయాయో; గుర్తించాలని, రాష్ట్రాలు మరియు యుటిలను కోరడం జరిగింది. ఈ రెండు ప్రమాణాలలో, దేనిలోనైనా ఉన్న జిల్లాలను, ఇంటెన్సివ్ మరియు లోకల్ కంటైనేషన్ చర్యలు తీసుకోవటానికి పరిగణించాలని కూడా ఆ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది.

ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. సూచించిన ప్రకారం కమ్యూనిటీ కంటైన్మెంట్ / పెద్ద కంటైన్మెంట్ ప్రాంతాల్లో అమలు చేయవలసిన విధివిధానాలను కూడా, ఎమ్.హెచ్.ఏ. ఉత్తర్వుల తో పాటు జత చేయడం జరిగింది.

కోవిడ్-19 నిర్వహణ కోసం జారీ చేసిన జాతీయ ఆదేశాలు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు 31.5.2021 తేదీ వరకు అమలులో ఉంటాయి.

 

 

*****

 

 



(Release ID: 1714960) Visitor Counter : 205