ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం ఇప్పటివరకూ 16.16 కోట్ల వాక్సిన్ డోస్ లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందజేసింది
కోటి కి పైగా డోస్‌లు ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయి
రాగల మూడు రోజులలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 20 లక్షలకు పైగా డోస్‌లు అందుబాటులోకి రానున్నాయి
Posted On:
29 APR 2021 10:39AM by PIB Hyderabad
కోవిడ్ -19మహమ్మారిపై పోరాటంలో భారత ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. కోవిడ్ పరీక్షలు నిర్వహించడం, వ్యాధిని గుర్తించడం, దానికి చికిత్స అందిచండంతోపాటు కోవిడ్ కు సంబంధించి ప్రజలను తగిన విధంగా చైతన్యవంతులను చేయడం వంటి ఐదు అంశాల వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నది.
సరళీకృత, వేగవంతమైన కోవిడ్ -19 మూడో దశ వ్యూహాన్ని మే 1 ,2021 నుంచి అమలు చేయనున్నారు. కొత్తగా వాక్సిన్ కు అర్హులైన వారి పేర్ల నమోదు కార్యక్రమం ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమైంది. వాక్సిన్ వేయించుకోదలచిన లబ్ధిదారులు నేరుగా కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు .(cowin.gov.in) లేదా ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేయించుకోవచ్చు.
భారత ప్రభుత్వం ఇప్పటివరకూ సుమారు 16.16కోట్ల వాక్సిన్ డోస్‌లను (16,16,86,140) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేసింది. ఇందులో మొత్తం వాడకం , వేస్టేజ్ తో సహా 15,10,77,933 డోస్ లు.
కోటికి పైడా కోవిడ్ వాక్సిన్ డోస్‌లు (1,06,08,207) ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవద్ద ఉన్నాయి.
20 లక్షలకు పైడా వాక్సిన్ డోస్‌లు (20,48,890) రాగల మూడు రోజులలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందుకోనున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రప్రభుత్వ అధికారులు తమ రాష్ట్రంలో వాక్సిన్‌లు అయిపోయాయని అందువల్ల రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమంపై దాని ప్రభావం పడిందని అన్నట్టు ఇటీవల మీడియా కథనాలు వెలువడ్డాయి.
2021 ఏప్రిల్ 28 ఉదయం 8 గంటల నాటికి మహారాష్ట్ర అందుకున్న మొత్తం కోవిడ్ వాక్సిన్ డోస్‌లు 1,63,62,470. ఇందులో మొత్తం వాడినది , వేస్టేజ్ తో సహా (0.22 శాతం) అంటే 1,56,12,510 డోస్‌లు. మిగిలిన 7,49,960 వాక్సిన్ డోస్‌లు ఇంకా రాష్ట్రం వద్ద ప్రజలకు వేయడానికి అందుబాటులో ఉన్నాయి.
దీనికితోడు 20,48,890 కోవిడ్ వాక్సిన్ డోస్‌లు రాగల మూడు రోజులలో ఆ రాష్ట్రానికి చేరనున్నాయి.
****
(Release ID: 1714907)
Visitor Counter : 280