గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
"ఆరోగ్య భద్రతతో కూడిన జీవనోపాధి" అంశంపై వీడీపీకే భాగస్వాములతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైఫెడ్ సమావేశం
Posted On:
28 APR 2021 1:11PM by PIB Hyderabad
"ఆరోగ్య భద్రతతో కూడిన జీవనోపాధి" అంశంపై, 26 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, 'వన్ ధన్ వికాస్ కేంద్రాల' క్లస్టర్ ప్రతినిధులతో ట్రైఫెడ్ సమావేశం నిర్వహించింది. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం సాగింది.
దాదాపు 600 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూనిసెఫ్ భారతదేశ విభాగాధిపతి సిద్ధార్థ్ శ్రేష్ట, ఆయన బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొని కొవిడ్ సంబంధిత పద్ధతులను వివరించింది.
రాష్ట్రాలవారీ పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షించి, అందరికీ ఆ సమాచారాన్ని అందించారు.
కొవిడ్ సంబంధిత ప్రామాణిక పద్థతులను పాటించాలని, ప్రోత్సహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 2,224 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన 33,340 వీడీవీకేల సంపూర్ణ ఫలితాన్ని సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని నిశ్చయించారు. ఆయా గ్రామాల్లో కొవిడ్ ప్రామాణిక పద్థతులను ప్రోత్సహించేందుకు వీటికి శిక్షణనిస్తారు.
నేర్చుకోవడానికి, ఇతరులకు నేర్పించడానికి దాదాపు 130 ఉత్తమ పద్ధతుల వివరాలను ఈ సమావేశంలో పాల్గొన్నవారికి అందించారు.
వీడీవీకేల ప్రగతిని తెలియజేయడానికి, సమీక్షించడానికి, ఫలితాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అన్ని రాష్ట్ర భాగస్వాములతో ట్రైఫెడ్ ద్వారా ప్రతి వారం సమావేశం కావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
***
(Release ID: 1714675)
Visitor Counter : 189