ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ వాయు సేన ద్వారా సాగుతున్న కోవిడ్ సంబంధి కార్యకలాపాల ను సమీక్షించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 28 APR 2021 2:51PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ ఆర్.కె.ఎస్. భదౌరియా ఈ రోజు న సమావేశమయ్యారు.


కోవిడ్-19 నేపథ్యం లో భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) చేపడుతున్న ప్రయాసల ను గురించి ఆయన ప్రధాన మంత్రి కి వివరించారు.


దేశ వ్యాప్తంగాను, విదేశాల లోను కోవిడ్ కు సంబంధించిన పనుల ను అన్నిటిని శర వేగంగా పూర్తి చేయడం కోసం హబ్ ఎండ్ స్పోక్ మాడల్ లో పనిచేయడానికి వారం రోజుల లో ప్రతి రోజూ ప్రతి క్షణం సిద్ధం గా ఉండవలసిందంటూ ఐఎఎఫ్ లోని యావత్తు హెవీ లిఫ్ట్ ఫ్లీట్ తో పాటు మీడియమ్ లిఫ్ట్ ఫ్లీట్ లో చాలా వరకు యుద్ధవిమానాల సిబ్బంది కి ఆదేశాలను ఇవ్వడమైందని ప్రధాన మంత్రి దృష్టి కి ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ ఆర్.కె.ఎస్. భదౌరియా తీసుకు వచ్చారు.  కార్యకలాపాల నిర్వహణ రాత్రింబగళ్లు నిరంతరాయం గా కొనసాగేటట్టు చూడడానికి గాను అన్ని విమానాల సిబ్బంది ని పెంచడమైంది.

ఆక్సీజన్ టాంకర్ లను, ఇతర అత్యవసర సామగ్రి ని చేరవేసే కార్యకలాపాల లో వేగాన్ని, స్థాయి ని, భద్రత ను పెంచవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  కోవిడ్ సంబంధి కార్యాల లో తలమునకలైన ఐఎఎఫ్ సిబ్బంది సంక్రమణ బారిన పడకుండా తగిన జాగ్రత చర్యల ను పాటించాలని కూడా ప్రధాన మంత్రి సూచించారు.  అలాగే కోవిడ్ సంబంధి కార్యాలన్నిటి లో భద్రత కు పెద్ద పీట వేయాలి అని కూడా ఆయన అన్నారు.

అన్ని ప్రాంతాల ను చుట్టి రావడానికి ఐఎఎఫ్ పెద్ద, మధ్య తరహా యుద్ధ విమాన సముదాయాలను రంగం లోకి దింపుతున్నట్లు ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ ఆర్.కె.ఎస్. భదౌరియా తెలిపారు.  కోవిడ్ సంబంధి కార్యకలాపాల లో వివిధ మంత్రిత్వ శాఖలతోను, ఏజెన్సీల తోను శీఘ్రతర సమన్వయాన్ని ఏర్పరచుకోవడం కోసం ఐఎఎఫ్ ప్రత్యేకం గా ఒక కోవిడ్ ఎయర్ సపోర్ట్ సెల్ ను ఏర్పాటు చేసిందని కూడా ఆయన ప్రధాన మంత్రి తో చెప్పారు.

ఐఎఎఫ్ సిబ్బంది ఆరోగ్యం, ఐఎఎఫ్ సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎలా ఉందని ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొన్నారు.   ఐఎఎఫ్ లో దాదాపు గా అందరికీ టీకా మందు రక్షణ ను సమకూర్చడమైందని ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ ఆర్.కె.ఎస్. భదౌరియా చెప్పారు.

ఐఎఎఫ్ పరిధి లోని ఆసుపత్రులు కోవిడ్ సంబంధి సదుపాయాల ను పెంచుకొన్నాయని, అంతే కాకుండా అవి వీలయినన్ని చోట్ల పౌరుల కు కూడాను సేవల ను అందిస్తున్నాయని ఆయన ప్రధాన మంత్రి కి వివరించారు.  



 



 

 

***



(Release ID: 1714632) Visitor Counter : 206