రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రస్తుతం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 169 కోవిడ్ కేర్ కోచ్‌లు వాడుకలో ఉన్నాయి
దాదాపు 64,000 పడకలు రాష్ట్రాల వినియోగానికి రైల్వే సిద్ధంగా ఉంచింది
రాష్ట్రాల డిమాండ్ ప్రకారం నాగ్‌పూర్, భోపాల్, అజ్ని ఐసిడి, తిహి (ఇండోర్ సమీపంలో) కోసం కోవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే సమీకరిస్తుంది.
11 కోవిడ్ కేర్ కోచ్‌ల కోసం డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు నాగ్‌పూర్ మరియు నాగ్‌పూర్ కమిషనర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Posted On:
27 APR 2021 4:36PM by PIB Hyderabad
కోవిడ్ వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య పోరాటంలో రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 64000 పడకలు కలిగిన సుమారు 4000 కోవిడ్ కేర్ కోచ్‌లను రాష్ట్రాల ఉపయోగం కోసం సిద్ధం చేసింది.
కోవిడ్ సంరక్షణ కోసం ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించారు.
నాగ్‌పూర్ జిల్లా నుండి కోవిడ్ కోచ్‌లకు కొత్త డిమాండ్ వచ్చింది. ఈ దిశలో నాగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారంప్రతి కోచ్ 16 మంది రోగులకు వసతి కల్పించడానికి తయారు చేయబడిన స్లీపర్లను 11 బోగీలతో కోవిడ్ కేర్ రేక్‌ను రైల్వే మోహరిస్తుంది. ఎంఓయుకు అనుగుణంగా కోచ్‌లకు అవసరమైన వైద్య మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందికి స్థలం మరియు యుటిలిటీని విభజించడంతో పాటు పారిశుధ్యం మరియు క్యాటరింగ్ ఏర్పాట్లపై శ్రద్ధ వహించాలి.
రాష్ట్ర డిమాండ్ మేరకు మహారాష్ట్రలోని అజ్ని ఐసిడి ప్రాంతంలో ఐసోలేషన్ కోచ్లను రైల్వే సమీకరిస్తోంది.
మహారాష్ట్రలోని ఈ కొత్త ప్రాంతాలతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని ఇతర తొమ్మిది ప్రధాన స్టేషన్లలో కోచ్‌లు ఉంచబడ్డాయి-
నంద్రుబార్ (మహారాష్ట్ర) వద్ద ప్రస్తుతం 57 మంది రోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. వారిలో 1 రోగిని తరలించారు. 322 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రప్రభుత్వ డిమాండ్ మేరకు ఢిల్లీలో 1200 పడకల సామర్థ్యం కలిగిన 75 కోవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే అందించింది. వాటిలో 50 కోచ్‌లు శకుర్‌బస్తి వద్ద, 25 కోచ్‌లు ఆనంద్ విహార్ స్టేషన్లలో అందుబాటులో ఉంచారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన 5 కోచ్‌లకు గాను 2 కోచ్‌లు, పశ్చిమ రైల్వేలోని రత్లం డివిజన్ ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్‌లో 320 పడకల సామర్థ్యంతో 20 కోచ్‌లను అందుబాటులో ఉంచారు.
పైన పేర్కొన్న రాష్ట్రాల్లో ఈ సదుపాయాల వినియోగం తాజా రికార్డుల ప్రకారం అందించబడింది. తదుపరి 98 ప్రవేశాలు నమోదయ్యాయి. తాజా నివేదికల ప్రకారం, రైల్వే 17 ప్రవేశాలు మరియు 6 డిశ్చార్జ్లను నమోదు చేసింది. ప్రస్తుతం 70 మంది కోవిడ్ రోగులు ఐసోలేషన్ కోచ్‌లను ఉపయోగించుకుంటున్నారు.
రాష్ట్రప్రభుత్వం ఇంకా కోచ్‌లు అడగకపోయినా యుపిలో ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి & నజీబాబాద్‌లో ప్రతిచోటా 10 కోచ్‌లు 800 పడకల (50 బోగీలు) సామర్థ్యం కలిగి ఉన్నవి అందుబాటులో ఉంచారు.
***
(Release ID: 1714473)
Visitor Counter : 250