సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పీఐబీ అధికారి శ్రీ సంజయ్ కుమార్ కన్నుమూత
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2021 3:26PM by PIB Hyderabad
'ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్' సీనియర్ అధికారి శ్రీ సంజయ్ కుమార్ కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో మంగళవారం ఉదయం మరణించారు. సోమవారం ఆయన్ను దిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.
పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ (మీడియా అండ్ కమ్యూనికేషన్స్)గా, కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రచార అవసరాలను ఆయన పర్యవేక్షించారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రచార అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. తన 34 ఏళ్ల ఉద్యోగ జీవితంలో, కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలోని పీఐబీలో వివిధ ప్రచార విభాగాల్లో సేవలు అందించారు. ఓ కేంద్ర మంత్రి వ్యక్తిగత సిబ్బంది హోదాలో, ఎన్‌సీఈఆర్‌టీ పీఆర్‌వోగానూ పని చేశారు. శ్రీ సంజయ్ కుమార్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
శ్రీ సంజయ్ కుమార్ మరణం పట్ల కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
వృత్తిలో కనబరిచిన నైపుణ్యం, ప్రజాసేవలో చూపిన అంకితభావంతో శ్రీ సంజయ్ కుమార్ చిరస్మరణీయులు.
***
(రిలీజ్ ఐడి: 1714469)
సందర్శకుల సూచీ సంఖ్య : : 208