ఆయుష్
కోవిడ్ -19 తాజా మార్గదర్శకాలను విడుదల చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ
స్వీయ సంరక్షణ, హోం ఐసొలేషన్ కు ప్రాధాన్యత
ఆయుర్వేద, యునాని మార్గదర్శకాలు జారీ
త్వరలో మిగిలిన మార్గదర్శకాలు
Posted On:
26 APR 2021 8:25PM by PIB Hyderabad
దేశంలో రెండవ దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న ఆయుర్వేద, యునాని వైద్య డాక్టర్లు అనుసరించవలసిన మార్గదర్శకాలను సవరిస్తూ ఆయుష్ మంత్రిత్వశాఖ ఈరోజు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. హోమ్ ఐసొలేషన్, కోవిడ్-19 నివారణకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆసుపత్రులలో చేరకుండా అనేక కుటుంబాలు కోవిడ్-19 ని ఎదుర్కోవలసి వస్తున్న నేపథ్యంలో నూతన మార్గదర్శకాల్లో స్వీయ సంరక్షణ, ఇళ్లలో అనుసరించవలసిన విధానాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
పురాతన ఆయుర్వేద, యునాని వైద్య విధానాలు, పరిశోధనల ఆధారంగా చేసుకొని వివిధ రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా వున్న కమిటీ సమర్పించిన నివేదికలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మంత్రిత్వశాఖ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19ని మరింత సమర్ధంగా ఎదుర్కోవడానికి ఈ మార్గదర్శకాలు దోహద పడతాయి.
వివిధ రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఆయుష్ మంత్రిత్వశాఖ నెలకొల్పిన ఉన్నత స్థాయి కమిటీ విస్తృతంగా చర్చలు జరిపి నూతన మార్గదర్శకాలు, సలహాలకు రూపకల్పన చేసింది. వీటిని కోవిడ్ -19 అధ్యయనాల కోసం ఏర్పాటైన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ , ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మరియు నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ సిద్ధం చేశాయి.
వ్యాధి వివిధ దశల్లో వున్న వారికి వైద్యం అందించే అంశంలో ఈ మార్గదర్శకాలు ఆయుర్వేదం, యునాని వైద్యం అందిస్తున్న డాక్టర్లకు స్వీయ సంరక్షణ, హోం ఐసొలేషన్ అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగిస్తాయి. దీనివల్ల దేశంలోని అన్ని ప్రాంతాలల్లో ఒకేవిధమైన చికిత్సా విధానం అమలులోకి వస్తుంది. క్షేత్ర స్థాయిలో కోవిడ్-19 కట్టడికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న విధానాల్లో ఈ సిఫార్సులను కూడా అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. కోవిడ్-19 కట్టడి, నివారణకు ఆయుష్ వైద్య విధానాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ మార్గదర్శకాలు, సలహాలు దోహదపడతాయి.
ఇళ్లలో ఉంటూనే కోవిడ్-19 బారి నుంచి బయట పడే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆయుష్ విధానాలను అనుసరిస్తూ రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపకరిస్తాయి. వ్యాధి లక్షణాలు లేనివారికి, వ్యాధి సోకకుండా చూడడానికి, కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారికి వైద్యం అందించే అంశంలో డాక్టర్లకు ఈ మార్గదర్శకాలు ఉపకరిస్తాయి.
స్వీయ రక్షణ, ఆరోగ్య రక్షణ అంశాలపై ఆయుష్ మంత్రిత్వశాఖ 29-01-2020న సలహాలను విడుదల చేసింది. భారతదేశంలోనూ, ఇతర దేశాలలోను అందరికి తెలిసిన నాలుగు మూలికలను ఉపయోగిస్తూ సిద్ధం చేసే 'ఆయుష్క్వాత్' (ఆయుర్వేదం) ఉపయోగించి రోగనిరోధకశక్తిని ఎక్కువ చేసుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలను పొందాలని మంత్రిత్వశాఖ సూచించింది. దీనిని తయారు చేయడానికి వస, తిప్పతీగె, అతిమధురం మూలికలను ఉపయోగించి ఈ పొడిని తయారు చేస్తారు.
కోవిడ్-19 రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న సమయంలో హోం ఐసొలేషన్ లో వున్న రోగులకు చికిత్స అందించే అంశంలో ఆయుర్వేదం, యునాని చికిత్సా విధానాలకు ప్రచారం కల్పించ వలసిన అవసరం ఉంది. స్వల్ప లక్షణాలు, లక్షణాలతో హోం ఐసొలేషన్ లో ఉన్నవారికి ఆయుష్-64, అశ్వగంధ లాంటి మాత్రలను ఇవ్వవచ్చునని నూతన మార్గదర్శకాల్లో సూచించారు.
ఆయుష్ వెబ్ సైట్ లో మార్గదర్శకాలను పొందుపరిచారు. ఇతర ఆయుష్ వైద్య విధానాలకు సంబంధించి త్వరలో విడుదల చేయడం జరుగుతుంది.
హోం ఐసొలేషన్, స్వీయ రక్షణ మాయార్గదర్శకాలను
https://main.ayush.gov.in/event/unani-medicine-based-preventive-measures-self-care-during-covid-19-pandemic లింకుల ద్వారా పొందవచ్చును
***
(Release ID: 1714271)
Visitor Counter : 294