రైల్వే మంత్రిత్వ శాఖ
రాష్ట్ర ప్రభుత్వాలకు తోడ్పడేందుకు యుపి, ఎంపి, మహారాష్ట్ర, ఢిల్లీలలో కోవిడ్ సంరక్షణ కోచీలను మోహరించిన రైల్వేలు
వివిధ రైల్వే స్టేషన్లలో మొత్తం 64000 పడకలతో దాదాపు 4000 కోవిడ్ కేర్ కోచీలు త్వరిత మోహరింపుకు అందుబాటులో ఉన్నాయి
పంజాబ్‌లో కూడా మోహరించేందుకు సిద్ధమవుతున్న కోచీలు
ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్ఒపి) & విధానాలపై, అందుబాటులో ఉన్న కోవిడ్ కేర్ కోచ్‌ల సౌలభ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా, సూచనలు
Posted On:
25 APR 2021 5:57PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ విపత్తుకు వ్యతిరేకంగా దేశం పోరాడుతున్న క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ కోవిడ్ కేర్ ఐసొలేషన్ కోచ్‌ల చొరవను తిరిగి పునఃసమీకరించడంలో ఎటువంటి షరతులు లేని విధానాన్ని అనుసరిస్తోంది. ఈ చొరవను కోవిడ్ 19 తొలి దశ సమయంలో కొన్ని సౌకర్యాలను జోడించి అమలు చేసింది. తక్కువ లక్షణాలు కలిగిన కోవిడ్ రోగుల ఐసొలేషన్ కోసం అదనపు ఆరోగ్య సంరక్షణ సౌకర్యంగా సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామనే సంకేతం ఇవ్వడానికి కోవిడ్ కేర్ కోచీలను ఇప్పటికే సిద్ధం చేసింది. ప్రస్తుత వేడి పరిస్థితులను తట్టుకునేందుకు ఈ కోచీలకు అదనంగా కూలర్లు, జనపనార తెరలు వంటి సౌకర్యాలను జత చేయడం జరిగింది.
ఈ విషయంలో ఏర్పాటు చేసిన ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్ఒపి) & విధానాలపై, అందుబాటులో ఉన్న కోవిడ్ కేర్ కోచ్‌ల సౌలభ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో మొత్తం 64000 పడకలతో దాదాపు 4000 కోవిడ్ కేర్ కోచీలను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని కోవిడ్ మొదటి వేవ్ లో రోగుల ఐసొలేషన్ అవసరాలను తీర్చాయి. కోవిడ్ మహమ్మారి విజృంభించిన జోన్లలో ఐసొలేషన్ కోచీల వివరాలను దిగువన ఇవ్వడం జరిగింది.
ఢిల్లీలో 50 కోచీలు (800 పడకలు)ను షకుర్ బస్తీ స్టేషన్‌లో మోహరించారు (ప్రస్తుతం 4 రోగులను ఇందులో చేర్చారు), దాదాపు 25 కోచీలు (400 పడకలు)ను ఆనంద్ విహార్ టర్మినల్‌లో నిలిపారు. ప్రస్తుతం నందుర్బార్ (మహారాష్ట్ర)లో 21 కోచీలు (378 పడకలు)ను ఉంచగా, ప్రస్తుతం 55 రోగులను ఇందులో చేర్చారు. భోపాల్ స్టేషన్‌లో 20 కోచీలు నిలిపి ఉంచారు. పంజాబ్‌లో మోహరించేందుకు 50 కోచీలను సిద్ధం చేయగా, 20 కోచీలను జబల్పూర్‌లో నిలిపి ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు, ఈ ఐసొలేషన్ కేంద్రాలు తక్కువ నుంచి ఒక మాదిరి లక్షణాలు (రాష్ట్ర ఆరోగ్య అధికారులు ఈ సౌకర్యాలకు నిర్దేశించినట్టు) కలిగిన రోగుల అవసరాలను తీరుస్తాయి. ఈ రోగులకు కేటరింగ్ ఏర్పాట్లను చేయడం, కోచీలలో పారిశుభ్రతను పాటించడం కోసం రైల్వేలు కృషి చేస్తున్నాయి. ఈ ఐసొలేషన్ కోచీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించడంపై వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు.
***
(Release ID: 1714104)
Visitor Counter : 219