ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మే 1 నుంచి సమర్థంగా టీకాల వ్యూహం అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలు


ఆస్పత్రుల మౌలిక సదుపాయల విస్తరణ వేగవంతానికి

సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

Posted On: 24 APR 2021 3:30PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, కోవిడ్-19 మీద పోరాడటానికి ఏర్పాటైన సాధికార బృందం చైర్మన్ డాక్టర్ ఆర్ ఎస్ శర్మ అధ్యక్ష్యతన ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త టీకాల కార్యక్రమ వ్యూహం మీద రాష్ట్రాలకు, కేంద్రాలకు ఈ సమావేశం మార్గదర్శకాలు ఇచ్చారు.  అదే సమయంలో ఆస్పత్రులు కోవిడ్ బాధితులకు చికిత్సలోను, మౌలిక సదుపాయాలను విస్తరించుకోవటంలోను అనుసరించాల్సిన   అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా చర్చించారు.   

కోవిన్ వేదిక ఇప్పుడు చిన్న చిన్న అవరోధాలను సైతం అధిగమించి సమర్థంగా స్థిరత్వం సంపాదించుకున్నదని డాక్త ఆర్ ఎస్ శర్మ ఈ సందర్భంగా చెప్పారు. మే 1 న మొదలయ్యే కొత్త దశ టీకాల కార్యక్రమం కోసం ఇప్పుడు అన్ని రకాల సంక్లిష్టతలను అధిగమించిందన్నారు. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సరైన సమాచారాన్ని ఎక్కించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. అలా చేసే మొత్తం వ్యవస్థసమగ్రత దెబ్బతింటుందని హెచ్చరించారు.

మే 1న ప్రారంభమవుతున్న మూడో దశ టీకాల కార్యక్రమానికి సంబంధించి రాష్టాలు నిర్దిష్టంగా పాటించాల్సిన మార్గదర్శకాలివి:

అదనపు ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన రిజిస్టర్ చేసుకోవాలి.  ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రులను, పారిశ్రామిక సంస్థల ఆస్పత్రులను, పారిశ్రామిక సంఘాల ఆస్పత్రులను అందులో భాగం చేయాలి. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవటం, దరఖాస్తు విధానాన్ని, వాటి ఆమోద విధానాన్ని రిజిస్ట్రేషన్లలో పెండింగ్ దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసుకోవాలి.   

టీకా మందు సేక్జరించుకున్న ఆస్పత్రుల జాబితాల సంఖ్యను, అవిఒ ప్రకటించిన తీకాల స్టాక్ నుమ్ ధరలను కోవిన్ వేదిక మీద ప్రకటించేట్టు చూడాలి. 

అర్హత ఉన్న జనాభాకు తెగినట్టుగా అందరికీ టీకాలందేలా ఎప్పటికప్పుడు ఏ రోజు ఎంత సమయం ఖాళీ ఉన్నదో కోవిన్ వేదిక మీద తెలియజేస్తూ ఉండాలి.

రాష్టాలు, కేంద్ర ప్రభుత్వాలు నేరుగా టీకా మందు సేకరించుకోవటానికి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పెట్టాలి. 18-45 ఏళ్ళ మధ్య ఉన్నవారు కేవలం ఆన్ లైన్ రిజిస్త్రేషన్ ద్వారా మాత్రమే టీకాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ సౌకర్యం గురించి ప్రచారం చెయ్యాలి  

కోవిడ్ టీకాలిచ్చే కేంద్రంలోని సిబ్బందికి టీకాల కార్యక్రమం నిర్వహణ మీద. టీకా అనంతరం ప్రభావానికి లోనయ్యే వారి సమాచారాన్ని నివేదించటం, అవసరమైన చికిత్స అందించటం, కోవిన్ వేదిక వాడకం మీద, ఎప్పటికప్పుడు టీకామందు వాడకం, కొత్త మందు రాక, నిల్వలను సమన్వయం చేసుకోవటం  మీద తగినంత శిక్షణ ఇవ్వాలి.

కోవిడ్ టీకా కేంద్రాల వద్ద జనం రద్దీని తట్టుకునేలా శాంతిభద్రతల పరిరక్షల అధికారులతో సమన్వయం చేసుకోవటం

కోవిడ్ తో బాధపడుతూ ఆస్పత్రులలో చేరిన వారికి మౌలిక సదుపాయాల పెంపు ద్వారా సమర్థమైన కోవిడ్ చికిత్స అందించటానికి వ్ఈలుగా రోజువారీ వస్తున్న కొత్త కేసుల సంఖ్యను, మరణాలను, ఇంకా ఎంత మందిని ఆస్పత్రిలొ చేర్చుకోవాల్సి వస్తుందో బేరీజు వేసుకుంటూ రాష్ట్రాలు ఇప్పుడున్న సదుపాయాలను సమీక్షించుకోవాలని కూడా రాష్ట్రాలకు సూచించారు.

మౌలికసదుపాయాల విస్తరణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకొని అమలు చేయటానికి రాష్ట్రాలకు చేసిన సూచనలు ఇవి:

ప్రత్యేకంగా కోవిడ్-19 చికిత్సకోసం కేటాయించే ఆస్పత్రులను గుర్తించి డి ఆర్ డి  వో , సి ఎస్ ఐ ఆర్ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని అలాంటివే మరేవైనా ఏజెన్సీల ద్వారా  సౌకర్యాలు కల్పించాలి.  

ఆక్సిజెన్ తో కూడిన పడకలు, ఐసియు పడకలు, ఆక్సిజెన్ తగినంత అందుబాటులో ఉండేట్టు చూసుకోవాలి. కేంద్రీకృత కాల్ సెంటర్ సాయంతో పడకల కేటాయింపు జరగాలి

తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సుల వంటి మానవ వనరులను నియమించుకోవాలి. బాధితులకు అవసరమైన సేవలందించటానికి, అంబులెన్స్ సేవలకు ఏర్పాటు చేయాలి.

జిల్లా కేంద్రాలలోని పెద్దాస్పత్రులకు పంపటానికి తగిన విధంగా మౌలిక సదుపాయాలు కల్పించటం, అంబులెన్సులతో కూడిన అనుసంధాన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. కేంద్రీకృత కాల్ సెంటర్ సాయంలో పడకలు కేటాయించాలి.   

రాష్ట్రాలకు ఇలా సూచించారు: 

పడకల అందుబాటుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజెప్పేలా రికార్డులు ఉండాలి. సామాన్య ప్రజలందరూ ఆ రికార్డులు చూడగలిగేట్టు కూడా ఉండాలి.  

మార్గదర్శకాలు రూపొందించి రాష్టాలు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలను తమ పరిధిలోకి తీసుకొని కోవిడ్ చికిత్స అందించేట్టు చూడాలి

కోవిడ్-19 అధీకృత ఆస్పత్రులను విస్తరించి లక్షణాలు స్వల్పంగా ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచటానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ఆ విధంగా స్వయంగా ఇంట్లో ఐసొలేషన్ లో ఉండటం సాధ్యం కాని వారికి, సంస్థాగత పర్యవేక్షణ కోరుకునేవారికి  అవసరమైన సౌకర్యం, రక్షణ అందుబాటులో ఉండేట్టు చూడాలి

ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నవారికి టెలీ-మెడిసిన్ సౌకర్యం కల్పించాలి

తగినంత ఆక్సిజెన్, అవసరమైనన్ని వెంటిలేటర్లు, సుశిక్షుతులైన దాక్టర్ల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్  అందుబాటులో ఉండేట్టు చూసుకోవాలి. అదే వుధంగా చికిత్సకు అవసరమైన స్టెరాయిడ్స్, ఇతర మందులు కూడా తగినన్ని ఉండాలి.

పెద్ద ఆస్పత్రులలో స్వయంగా ఆక్సిజెన్ తయారు చేసుకోవటానికి ఆక్సిజెన్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేసుకోవాలి.

కోవిడ్-19 చికిత్స అనుసంధాన కార్యకలాపాలలో పాల్గొనే ఆశా కార్యకర్తలకు, ఇతర కోవిడ్ యోధులకు సముచితమైన పారితోషికాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆస్పత్రుల మౌలిక సదుపాయాలను విస్తరించటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోని ఆస్పత్రులలో ప్రత్యేక బ్లాక్ లు ఏర్పాటుచేయటం ద్వారా విస్తరించవలసిందిగా కేంద్రం ఆదేశించటాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. అదే విధంగా డిఆర్ డి వో, సిఎస్ ఐ ఆర్ – సి బి ఆర్ ఐ ల సమన్వయంతో ఐసియు పడకలతో సహా తాత్కాలిక కోవిడ్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు గురించి చెప్పటాన్ని కూదా ఈ సందర్భంగా గుర్తుచేశారు.   రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి సి ఎస్ ఆర్ నిధుల సాయంతో ఆస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపరచుకోవాలని, తాత్కాలిక కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ( ఎన్ సి డి సి)  ఆధ్వర్యంలో 18 ప్రాంతీయ కార్యాలయం సహకారంతో కోవిడ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. స్వల్ప లక్షణాలున్న వారి చికిత్సకోసం రైల్వే కోచ్ లను వాడుకోవాలని సూచిస్తూ ఇప్పటికే 16 జోన్లలో  3816 కోచ్ లు అందుబాటులొ ఉన్న విషయాన్ని రాష్ట్రాలకు తెలియజేశామన్నారు. 

                                        

****



(Release ID: 1713856) Visitor Counter : 190