రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొవిడ్‌ కేసుల్లో పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఏఎఫ్‌ఎంఎస్‌కు అత్యవసర ఆర్థిక అధికారాలను అప్పగించడానికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం

Posted On: 23 APR 2021 7:34PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల్లో నమోదవుతున్న పెరుగుదలను ఎదుర్కొనేందుకు, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ "రక్షణ దళాల వైద్య సేవలు" (ఏఎఫ్‌ఎంఎస్‌)కు అత్యవసర ఆర్థిక అధికారాలను మంజూరు చేశారు. ఈ నెల 23వ తేదీన ఇచ్చిన ఈ ఆదేశాల ప్రకారం, లోయర్‌ "కంట్రోలర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌" (సీఎఫ్‌ఏలు) అయిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ (సైనిక/నౌకా/వైమానిక దళం), సైనిక/నౌకా/వైమానిక/అండమాన్ &నికోబార్ కమాండ్‌కు చెందిన  ప్రధాన కార్యాలయాల వైద్య శాఖల అధిపతులు, నౌకాదళ కమాండ్ వైద్యాధికారులు, వైమానిక దళ ముఖ్య వైద్యాధికారులు (మేజర్ జనరల్ లేదా సమాన హోదా/ బ్రిగేడియర్స్ లేదా సమాన హోదా) సహా సంయుక్త అధికారులకు అత్యవసర ఆర్థిక అధికారాలను దఖలు పడ్డాయి. "మెడికల్ షెడ్యూల్ ఆఫ్ పవర్స్" (ఎంఎస్‌పీ), షెడ్యూల్ 8లోని క్రమ సంఖ్య 8.1 ప్రకారం, రక్షణ దళాలకు ఆర్థిక అధికారాల అప్పగింత (డీఎఫ్‌పీడీఎస్‌)- 2016కు ఈ అత్యవసర ఆర్థిక అధికారాలను అప్పగించారు. ఆ అధికారాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
 
·      డీజీఎంఎస్‌ (సైనిక/నౌకా/వైమానిక దళం) - రూ.500 లక్షలు
·      మేజర్‌ జనరల్‌ &సమాన హోదా - రూ.300 లక్షలు 
·      బ్రిగేడియర్‌ &సమాన హోదా - రూ.200 లక్షలు 
 
    లోయర్‌ సీఎఫ్‌ఏలకు అప్పగించిన ఈ అత్యవసర అధికారాలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయి. వైద్య సామగ్రి/ నిత్యావసరాల సేకరణ కోసం, కొవిడ్‌ కేసుల చికిత్స/నిర్వహణ/పరిష్కారాల కోసం ఉపయోగించాలన్న నిబంధనతో ఈ అధికారాలను అప్పగించారు.

***



(Release ID: 1713650) Visitor Counter : 140