రైల్వే మంత్రిత్వ శాఖ
విశాఖపట్టణం, బొకారోల నుండి మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎంఓ) తరలించేందుకు సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
- లక్నో-వారణాసి మధ్య గల 270 కిలో మీటర్ల దూరాన్ని సగటున 62.35 కిలోమీటర్ల వేగంతో 4 గంటల 20 నిమిషాల్లో చేరుకొనేలా గ్రీన్ కారిడార్ ఏర్పాటు
- ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు వేగంగా గమ్య స్థానాలకు చేరుకొనేందుకు గ్రీన్ కారిడార్లు దోహదం
Posted On:
22 APR 2021 4:10PM by PIB Hyderabad
కోవిడ్-19కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రతిస్పందనగా భారతీయ రైల్వే సంస్థ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ట్యాంకర్లతో కూడిన ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రాత్రి విశాఖపట్నం నుండి ముంబయి నగరానికి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. విశాఖపట్నం వద్ద ఎల్‌ఎంఓతో నిండిన ట్యాంకర్లను భారత రైల్వే రో-రో సర్వీస్ ద్వారా రవాణా చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మెడికల్ ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి లక్నో నుండి బోకారోకు వారణాసి మీదుగా మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఈ ఆక్సిజన్ రైలు కదలిక కోసం లక్నో నుండి వారణాసి మధ్య గ్రీన్ కారిడార్ సృష్టించబడింది.
లక్నో నుండి వారణాసి వరకు గల 270 కిలోమీటర్ల దూరాన్ని సగటున 62.35 కిలోమీటర్ల వేగంతో 4 గంటల 20 నిమిషాల్లో చేరుకొనేలా గ్రీన్ కారిడార్‌ను సృష్టించారు. రైళ్ల ద్వారా ప్రాణ వాయువు (ఆక్సిజన్) రవాణా రహదారి మార్గంలో రవాణా కంటే కూడా ఎక్కువ వేగంగా ఉంటుంది. రైళ్లు రోజులో 24 గంటలు నిరంతరాయంగా నడవగలవు.. కానీ ట్రక్ డ్రైవర్లు తమ రవాణాలో ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయి విశ్రాంతి తీసుకోవడం అవసరం. రైల్వేకు చెందిన ఫ్లాట్ వ్యాగన్లలో / నుండి ట్యాంకర్లను లోడ్ చేయడానికి / అన్‌లోడ్ చేయడానికి, ర్యాంప్ ఎంతో అవసరమనేది ఇక్కడ గమనార్హం. అలాగే, కొన్ని ప్రదేశాలలో రోడ్ ఓవర్ వంతెనలు (ఆర్ఓబీలు) మరియు ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (ఓహెచ్ఈ) యొక్క పరిమితుల కారణంగా, రోడ్ ట్యాంకర్ల యొక్క వివిధ స్పెసిఫికేషన్లలో, 3320 మి.మీ. ఎత్తుతో ఉండే రోడ్డు రవాణా ట్యాంకర్ టీ 1618 యొక్క మోడల్ అనువైనదిగా గుర్తించడమైంది. 1290 మి.మీ. ఎత్తుతో ఫ్లాట్ వ్యాగన్ల (డీబీకేఎం) పై దీనిని ఉంచనున్నారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో కూడా భారత రైల్వేలు అవసరమైన వస్తువులను రవాణా చేశాయి. లాక్‌డౌన్ సమయంలో కూడా సంస్థ సరఫరా గొలుసు ముందుకు సాగేలా సేవలను కొనసాగించింది. అత్యవసర వేళల్లో దేశానికి సేవలను కొనసాగిస్తు వస్తోంది.
*****
(Release ID: 1713404)
Visitor Counter : 283