ప్రధాన మంత్రి కార్యాలయం

దేశవ్యాప్తం గా గల టీకా మందు తయారీదారుల తో సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 20 APR 2021 7:42PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లోని టీకా తయారీదారు సంస్థలన్నిటితో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడారు.  టీకా ల తయారీ లో వారు సాధించిన విజయాలను, వారి వృత్తిపరమైన నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.  ‘‘సామర్థ్యం, వనరులు, సేవాభావా’’లే మన టీకాల పరిశ్రమకు బలాలని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.  ప్రపంచం లో వారిని అగ్రస్థానాన నిలుతున్నది ఇవేనని వివరించారు.  దేశం లోని టీకా తయారీ పరిశ్రమలపై విశ్వాసంతోనే మే 1వ తేదీ నుంచి దేశం లోని వయోజనులందరికీ టీకాలు ఇచ్చే కార్యక్రమానికి అనుమతి ని ఇచ్చినట్లు ప్రధాన మంత్రి తెలిపారు.  తదనుగుణం గా వీలైనంత తక్కువ సమయం లోనే దేశ ప్రజలందరికీ టీకా లు ఇవ్వగలిగేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని నిరంతరం పెంచాలని ఆయన వారిని కోరారు.  అలాగే కొత్త టీకా మందు ల రూపకల్పన లో మన శాస్త్రవేత్త ల కృషి ని, వారు నిర్వహిస్తున్న అధ్యయనాలను కొనియాడారు.

రికార్డు సమయం లో టీకా ల అభివృద్ధి-తయారీ ఘనత వారిదే అని ప్రధాన మంత్రి అభినందించారు.  మన దేశం లో తయారయ్యే టీకా లు చౌకైనవని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొంటూ- ప్రపంచం లోనే అతి పెద్ద టీకా ల కార్యక్రమాన్ని భారతదేశం లో నిర్వహించడం జరుగుతోంది అని వివరించారు.

టీకా మందు ల అభివృద్ధి- తయారీ ప్రక్రియ లో భాగం గా ‘మిశన్ కోవిడ్ సురక్ష’ కింద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం స్ఫూర్తి తో దేశం నిరంతరం కృషి చేస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  తదనుగుణం గా ఆరంభం నుంచి అంతం వరకు టీకా మందు ను అభివృద్ధిపరచడానికి ఒక ఇకోసిస్టమ్ ను రూపొందించడమైందని ప్రధాన మంత్రి అన్నారు.  టీకా మందు తయారీదారులందరికీ సాధ్యమైన మేర సహాయం, వనరుల మద్దతు లతో పాటు టీకా మందు కు ఆమోదం తెలిపే ప్రక్రియ కూడా వేగవంతం, శాస్త్రీయం గా  ఉండే విధం గా ప్రభుత్వం జాగ్రత్త తీసుకొందని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రయోగ దశలో గల కొత్త టీకాల కు సాధ్యమైనంత వరకూ అన్నివిధాలా మద్దతు సహా సజావు గా ఆమోదం లభించే ప్రక్రియ ను చేపడతామని ఆయన హామీ ని ఇచ్చారు.

కోవిడ్-19 కి వ్యతిరేకం గా దేశం సాగిస్తున్న పోరాటం లో మన ప్రైవేటు రంగం లోని ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల విభాగం పెద్ద పాత్ర ను పోషించిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  రాబోయే రోజుల లో టీకా ల కార్యక్రమం లో ప్రైవేటు రంగం మరింత చురుకైన పాత్ర ను పోషించగలదని పేర్కొన్నారు.  ఈ దిశ గా ఆస్పత్రులు-పరిశ్రమ మధ్య మెరుగైన సమన్వయం అవసరమని చెప్పారు.

దేశం లో 18 సంవత్సరాల వయస్సు పైబడిన అందరికీ టీకా మందు ను ఇప్పించేందుకు అనుమతి ని ఇవ్వాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి, అధిక ప్రోత్సాహానికి, మరింత సౌలభ్యం కల్పించే దిశ లో అనేక చర్యల ను తీసుకొంటున్నందుకు గాను ప్రధాన మంత్రి కి టీకా తయారీదారులు ధన్యవాదాలు తెలిపారు.  టీకా మందు ను అభివృద్ధిపరచడం, ఉత్పత్తి ప్రక్రియ ల దశల లో భారత ప్రభుత్వం నుంచి అందిన సమర్థన కు గాను ప్రధాన మంత్రి నాయకత్వాన్ని వారు కొనియాడారు.  ఉత్పత్తి, రాబోయే వ్యాక్సీన్ కేండిడేట్ లు, కొత్త వేరియంట్ లపై పరిశోధన చేయడం గురించిన తమ ప్రణాళికల ను కూడా వారు చర్చ సందర్భం లో ప్రస్తావించారు. 

***(Release ID: 1713111) Visitor Counter : 179