రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (క్లావ్స్‌) ఆర్మీ ఆఫీసర్ల కోసం పిహెచ్‌డి కార్యక్రమాన్ని ప్రారంభించింది

Posted On: 19 APR 2021 6:01PM by PIB Hyderabad

భారత సైన్యం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (క్లావ్స్‌), మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎంఏహెచ్‌ఈ) మంగళూరు మణిపాల్ యూనివర్సిటీతో  కలిసి ఉమ్మడిగా ఆర్మీ అధికారుల కోసం పిహెచ్‌డి కార్యక్రమాన్ని  ఏర్పాటు చేసింది.

అధికారుల ప్రొఫెషనల్ మిలిటరీ ఎడ్యుకేషన్ (పిఎంఇ) ను మరింత పెంపొందించడానికి  క్లావ్స్ ఈ చొరవ తీసుకుంది. తద్వారా ఆయా రంగాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్న మెరుగైన సన్నద్ధమైన సైనిక అధికారులతో దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.

ఈ కార్యక్రమంలో క్లావ్స్‌  ఎంఏహెచ్‌ఈ ఉప కేంద్రంగా గుర్తించబడింది. ఇందులు ఐదుగురు క్లావ్స్‌ అధ్యాపకులు సహ పర్యవేక్షకులుగా పనిచేస్తారు. యూజీసీ మరియు ఎంఏహెచ్‌ఈ  మంగళూరు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం క్లావ్స్‌ ఎంపిక ప్రక్రియతో పాటు తప్పనిసరి పరిశోధన తరగతులను నిర్వహిస్తుంది.

దరఖాస్తు పత్రాలతో పాటు కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు క్లావ్స్‌ వెబ్‌సైట్‌లో (https://www.claws.in/) “UNIVERSITY CELL” శీర్షిక క్రింద అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ నింపిన దరఖాస్తు ఫారాలను 30 జూన్ 2021 లోపు పంపాలని సూచించారు.

***(Release ID: 1712730) Visitor Counter : 33