ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 12 కోట్లు దాటిన కోవిడ్ టీకాలు
గత 24 గంటల్లో 26 లక్షలకు పైగా టీకాల పంపిణీ
కేవలం 92 రోజుల్లో 12 కోట్లు దాటిన వేగవంతమైన దేశం భారత్
కోటి టీకాలు దాటిన రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్
79% కొత్త కరోనా కేసులు 10 రాష్ట్రాల్లోనే
Posted On:
18 APR 2021 11:32AM by PIB Hyderabad
ప్రపంచంలొనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా చెబుతున్న కోవిడ్ టీకా కార్యక్రమంలో భారత్ ఇప్పటివరకూ 12 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీచేసింది. ఈ రోజు ఉదయం అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం 18,15,325 శిబిరాల ద్వారా మొత్తం ఇప్పటిదాకా 12,26,22,590 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరీగ్య సిబ్బందికిచ్చిన 91,28,146 మొదటి డోసులు, 57,08,223 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,12,33,415 మొదటి డోసులు, 55,10,238 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడిన వారికిచ్చిన 4,55,94,522 మొదటి డోసులు, 38,91,294 రెండో డోసులు, 45-60 ఏళ్లమధ్య ఉన్నవారికిచ్చిన 4,04,74,993 మొదటి డోసులు, 10,81,759 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళమధ్యవారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
91,28,146
|
57,08,223
|
1,12,33,415
|
55,10,238
|
4,04,74,993
|
10,81,759
|
4,55,94,522
|
38,91,294
|
12,26,22,590
|
దేశమంతటా ఇచ్చిన టీకాలలో ఎనిమిది రాష్టాలలోనే 59.5% పంపిణీ జరిగింది. కోటికి పైగా టీకా డోసుల పంపిణీ జరిగిన నాలుగు రాష్ట్రాలలో గుజరాత్ (1,03,37,448), మహారాష్ట్ర (1,21,39,453), రాజస్థాన్ (1,06,98,771) ఉత్తరప్రదేశ్ (1,07,12,739) ఉన్నాయి. గుజరాత్ ఏప్రిల్ 16న కోటి డోసులు పూర్తి చేసుకోగా, మిగిలిన మూడు రాష్ట్రాలు ఏప్రిల్ 14న ఈ ఘనత సాధించాయి.
12 కోట్ల డోసుల టీకాలివ్వటానికి భారతదేశానికి 92 రోజులు మాత్రమే పట్టింది. ఆ విధంగా అత్యంత వేగంగా టీకాలిచ్చిన దేశంగా నిలవగా ఆ తరువాత స్థానాల్లో అమెరికా (97 రోజులు), చైనా (108 రోజులు) ఉన్నాయి.
గడిచిన 24 గంటలలో 26 లక్షల డొసులకు పైగా టీకాలిచ్చారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన 92వ రోజైన ఏప్రిల్ 17న 26,84,956 టీకా డోసులిచ్చారు. అందులో 20,22,599 మంది లబ్ధిదారులు 39,998 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 6,62,357 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: ఏప్రిల్ 17, 2021 ( 92వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళమధ్యవారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
22,717
|
37,405
|
89,353
|
1,01,666
|
12,51,018
|
1,20,249
|
6,59,511
|
4,03,037
|
20,22,599
|
6,62,357
|
భారత్ లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,61,500 కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ లలో 78.56% కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలొ అత్యధికంగా రోజువారీ కేసులు 67,123 రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 27,334 కేసులు, ఢిల్లీలో 24,375 కేసులు కొత్తగా వచ్చాయి.
ఈ క్రింద చూపిన విధంగా పదహారు రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.
రోజువారీ కోవిడ్ పరీక్షలను, దేశంలో పాజిటివ్ శాతాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతోంది. గడిచిన 12 రోజుల్లో రోజువారీ పాజిటివ్ శాతం 8.00% నుంచి 16.69% కు పెరిగింది..
జాతీయ స్థాయిలో వారపు పాజిటివ్ శాతం గత నెలరోజుల కాలంలో 3.05% నుంచి 13.54% కు పెరిగింది. చత్తీస్ గఢ్ లో అత్యధిక పాజిటివ్ పెరుగుదల 30.38% నమోదైంది.
భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ తో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 18,01,316 కి చేరుకోగా మొత్తం పాజిటివ్ కేసులలో ఇది 12.18%. గత 24 గంటలలో చికిత్సపొందుతున్నవారి సంఖ్య నికరంగా 1,21,576 కెసుల పెరుగుదల నమొదు చేసుకుంది. ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలిసి దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులలో 65.02% వాటా ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే 38.09% కేసులున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,28,09,643 కి చేరుకోగా కోలుకున్నవారి శాతం 86.62%. గత 24 గంటలలో 1,38,423 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో 1,501 మంది కోవిడ్ తో చనిపోయారు. ఈ మరణాలలో 82.94% వాటా పది రాష్ట్రాలదే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 419 మంది, ఆ తరువాత ఢిల్లీలో 167 మంది చనిపొయారు.
గత 24 గంటలలో తాజాగా సంభవించిన కొవిడ్ మరణాలలో ఒక్క మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
(Release ID: 1712539)
Visitor Counter : 203