రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రకు రెమ్‌డెసివిర్ సరఫరాకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుంది: శ్రీ మన్సుఖ్ మాండవియా

Posted On: 17 APR 2021 5:05PM by PIB Hyderabad

రెమ్‌డెసివిర్ సరఫరాకు గాను భారత ప్రభుత్వం మహారాష్ట్రకు అన్ని విధాలా సహాయం చేస్తుంద‌ని కేంద్రం రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా ఈ రోజు అన్నారు. ఈ విష‌య‌మై మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన‌ అధికారులతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని ఆయ‌న అన్నారు.
రెమ్‌డెసివిర్ సరఫరాకు అన్ని విధాలుగా సహకరిస్తోందని మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా ఈ రోజు పేర్కొన్నారు. రెమ్‌డెసివిర్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి వరుస ట్వీట్లలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన వివిధ ప్రకటనలను ఆయన ఈ సంద‌ర్భంగా తీవ్రంగా ఖండించారు. దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని రెట్టింపు చేసే ప్రభుత్వం, తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి 12.4.2021 నుండి మరో 20 ప్లాంట్లకు త్వ‌రిత‌గ‌తిన‌ అనుమతి ఇచ్చిందని మంత్రి శ్రీ మాండవియా చెప్పారు.
మహారాష్ట్ర ప్రజలకు రెమ్‌డెసివిర్ తగినంత సరఫరా చేయ‌డానికి గాను కేంద్ర ప్రభుత్వం త‌గిన‌ ప్రాధాన్యతనిస్తోంద‌ని అన్నారు. ప్రభుత్వ రికార్డు ప్రకారంగా
ఈవోయూకు చెందిన‌ ఒక యూనిట్. సెజ్‌లో మ‌రోక‌టి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెమ్‌డెసివిర్ తయారీదారులందరితో ప్రభుత్వం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఈ సూది మందు సర‌ఫ‌రాకు సంబంధించి సంస్థ‌ల‌తో ఎలాంటి క‌న్‌సైన్‌మెంట్ కూడా వివాదంలో చిక్కుకోలేదు. స్టాక్ లభ్యత క‌లిగి ఉన్న‌ట్టుగా చెబు‌తున్న సంబంధిత అధికారులు సంబంధిత‌ 16 కంపెనీల జాబితాను, డబ్ల్యూహెచ్‌ఓ-జీఎంపీని తమతో పంచుకోవాలని మంత్రి సంబంధిత వ్యక్తులను కోరారు. ప్రజల్ని ఆదుకొనేందుకు గాను అవ‌స‌ర‌మైన ప్ర‌తీ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని మంత్రి వివ‌రించారు.
                           

*****


(Release ID: 1712522) Visitor Counter : 190