ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ లో కోవిడ్-19 కట్టడికి, నిర్వహణకు తీసుకున్న ఆరోగ్యపరమైన చర్యలు, కోవిడ్ తాజా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి


'పరీక్ష, జాడ తెలుసుకోవడం, చికిత్స అందించడం, కోవిడ్ అనుకూల వ్యవహారాన్ని అలవర్చడం, వాక్సినేషన్ '... ఈ 5 అంచెల వ్యూహాన్నే పునరుద్ఘాటించారు

Posted On: 16 APR 2021 4:14PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం నిరంతర సహాయం అందిస్తుందని రాష్ట్రాలకు హామీ 

ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ -19 స్థితిగతులను, కోవిడ్ -19 ని నియంత్రించడానికి మరియు నిర్వహించడానికి రాష్ట్ర ఆరోగ్య అధికారులు తీసుకున్న ప్రజారోగ్య చర్యలను సమీక్షించడానికి ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశాలకు కేంద్ర హోం కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లాతో పాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షత వహించారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్  ఐసిఎంఆర్ డీజీ డాక్టర్ బల్రామ్ భార్గవ, డిజిహెచ్ఎస్ డాక్టర్ (ప్రొఫెసర్) సునీల్ కుమార్, ముఖ్య కార్యదర్శులు, డిజి (పోలీసు), మరియు రెండు రాష్ట్రాల ఆరోగ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశంలోని లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్ మాత్రమే. ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్ రెండూ చాలా ఎక్కువ సంఖ్యలో రోజువారీ కొత్త కోవిడ్-19 కేసులను, కోవిడ్-19 వల్ల అధిక మరణాలను నివేదిస్తున్నాయి.ఛత్తీస్గఢ్ 7 రోజుల సగటు ఆధారంగా వారపు కొత్త కోవిడ్ కేసులలో దాదాపు 6.2% పెరుగుదల నివేదించింది. గత రెండు వారాల్లో, వారానికి కొత్త కేసులలో రాష్ట్రం దాదాపు 131% పెరిగింది.

రోజువారీ కొత్త కేసులలో ఉత్తర ప్రదేశ్ వృద్ధి రేటు 19.25% గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని 46 జిల్లాలు గత 30 రోజుల్లో అత్యధిక కేసులను నమోదు చేసింది; లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్ ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలు. 2021 మార్చి 17-23 తేదీల వారానికి భిన్నంగా, 2021 ఏప్రిల్ 7-13 తేదీల వారంలో, ఆర్టి-పీసీఆర్ పరీక్షలు 46% (48% నుండి) కు తగ్గాయి, యాంటిజెన్ పరీక్షలు 53% (51% నుండి) కు పెరిగాయి.

ఆస్పత్రుల మౌలిక సౌకర్యాలైన ఐసీయూ, ఆక్సిజన్,కలిగిన పథకాలు విషయంలో కొరత ఉన్నట్టు వచ్చిన నివేదికలను సమీక్షించారు. ఐసొలేషన్ పడకలు, వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, అంబులెన్సు సేవలు ఇంకా పెంచాల్సిందిగా రాష్ట్రాలకు సూచించారు. అనవసరమైన ప్రయాణాలు, జనసమ్మర్ధం లేకుండా చూడడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర అధికారులు సూచించారు. 

ఆక్సిజన్ సిలెండర్లు, అదనపు వెంటిలేటర్ల అవసరాలను త్వరలోనే తీరుస్తామని వారు హామీ ఇచ్చారు. 

మొబైల్ ల్యాబ్‌లతో సహా మరిన్ని టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని డిజి ఐసిఎంఆర్ సిఫార్సు చేశారు. 5% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు చూపించే జిల్లాల్లో నిరంతరాయంగా అప్రమత్తంగా ఉండాలని మరియు పరీక్షలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

'పరీక్షలు పెంచడం, వ్యాధి జాడ తెలుసుకోవడం, సత్వరమే చికిత్స అందించడం, కోవిడ్ అనుకూల వ్యవహారాన్ని విస్తృతంగా అలవర్చడం, అర్హులైన అందరికీ వాక్సినేషన్ వేసేలా చూడడం వంటి 5 అంచెల వ్యూహాన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమ్మేసు చేయాలనీ కేంద్ర సూచించింది.   

 

 

****


(Release ID: 1712336) Visitor Counter : 197