పర్యటక మంత్రిత్వ శాఖ
ఆతిథ్యం మరియు పర్యాటక పరిశ్రమను బలోపేతం చేయడానికి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలతో పర్యాటక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది
Posted On:
16 APR 2021 1:14PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి సంక్షోభ కాలంలో ఆతిథ్య మరియు పర్యాటక పరిశ్రమను బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ 2021 ఏప్రిల్ 15న క్లియర్‌ట్రిప్ మరియు ఈజ్ మై ట్రిప్‌తో అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంది.
ఈ అవగాహన ఒప్పందం యొక్క ప్రాధమిక లక్ష్యం ఓటీఏ రంగంలో సాతి (సిస్టమ్ ఫర్ అసెస్‌మెంట్, అవేర్‌నెస్ & ట్రైనింగ్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పై స్వీయ ధృవీకరణ పొందిన వసతి యూనిట్లకు విస్తృతమైన దృశ్యరూపం అందించడం. తద్వారా సాతిపై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూనిట్లను ప్రోత్సహించడం అలాగే కోవిడ్ -19వ్యాప్తిని అరికట్టడానికి తగిన రక్షణలతో స్థానిక పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించడం వంటి కారణాలతో ఈ ఎంఓయు ఇరు వర్గాలకు ప్రయోజనం కలిగిస్తుంది.
స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు వసతి యూనిట్లపై మరింత సమాచారాన్ని సేకరించడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యం. తద్వారా సరక్షితమైన సేవలను అందించడానికి అవకాశం లభిస్తుంది.
కార్యక్రమం శ్రీ రాకేశ్ కుమార్ వర్మ, జెఎస్, ఎంవోటీ; శ్రీ బి.బి. దాస్, డైరెక్టర్ (హెచ్ అండ్ ఆర్), ఎంవోటీ; క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) నుండి డాక్టర్ ఎ రాజ్ & శ్రీ మోహిత్ సింగ్; ఈజీ మై ట్రిప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ విపిన్ షా మరియు క్లియర్‌ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ శ్రీ శ్రీరామ్ వి పాల్గొన్నారు.
పర్యాటక మంత్రిత్వ శాఖ & ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు అవగాహన ఒప్పందం ద్వారా ఆయా ప్రాంతాలలో పర్యాటక రంగంలో వ్యూహాత్మక మరియు సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడం మరియు అందుకు అవసరమైన చర్యలను తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆతిథ్య మరియు పర్యాటక పరిశ్రమను బలోపేతం చేయడానికి భవిష్యత్తులో ఇలాంటి అవగాహన ఒప్పందాలు మరిన్ని జరుగుతాయని భావిస్తున్నారు.
***
(Release ID: 1712231)
Visitor Counter : 214