మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇగ్నో 34వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - కేంద్ర విద్యాశాఖ మంత్రి
34వ స్నాతకోత్సవంలో 2,37,844 మందికి డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేసిన - ఇగ్నో
Posted On:
15 APR 2021 3:15PM by PIB Hyderabad
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 34వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ రోజు 34వ స్నాతకోత్సవం సందర్భంగా, విశ్వవిద్యాలయం 2,37,844 మందికి డిగ్రీలు, డిప్లొమాలు, వివిధ కార్యక్రమాల సర్టిఫికేట్లను, విజేతలైన విద్యార్థులకు ప్రదానం చేసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా ఇగ్నో ప్రధాన కార్యాలయ నుండి ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించారు .
విజయవంతంగా విద్యాభ్యాసం పూర్తిచేసిన విద్యార్థులను, కేంద్ర విద్యామంత్రి అభినందిస్తూ, నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటు ధరల్లో, సార్వత్రిక మరియు దూర విద్య ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇగ్నో ప్రారంభించిన నాటి నుండి నిర్వహించిన పాత్రను ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ, స్వావలంబన దిశగా విద్యను అందించాల్సిన అవసరాన్ని, కేంద్ర మంత్రి, తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చే వృత్తి విద్యను అనుసంధానించే కొత్త విద్యా విధానం ముఖ్యంగా స్వావలంబన మీద దృష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు. 2035 నాటికి 50 శాతం జి.ఈ.ఆర్. (స్థూల నమోదు నిష్పత్తి) లక్ష్యాన్ని సాధించడానికి, విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.
2020, కొత్త విద్యా విధానం యొక్క ముఖ్య భాగమైన "ఎంపిక ఆధారంగా చదువుకునే విధానం" (సి.బి.సి.ఎస్) గురించి, కేంద్ర మంత్రి నొక్కి చెబుతూ, ఇది, అభ్యాసకులు, తమకిష్టమైన కోర్సులను ఎంచుకునే విధంగా, సౌలభ్యాన్ని కల్పిస్తుందనీ, మధ్యలో అంతరాయం వస్తే, ఆ తర్వాత కూడా దాన్ని పూర్తి చేయడానికి అతడిని / ఆమెను అనుమతించడం జరుగుతుందనీ, వివరించారు. కేవలం విద్యను మాత్రమే కాకుండా, జనాభా అవసరాలకు తగిన ఉపాధిని కూడా అందించే విధంగా, దేశ అవసరాలకు అనుగుణంగా, కొత్త కార్యక్రమాలపై పనిచేస్తూనే, ప్రస్తుతం ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలను పునరుద్ధరించాలని ఆయన విశ్వవిద్యాలయాన్ని కోరారు. ఎన్.ఏ.ఏ.సి.ఏ. చెందిన ఏ ++ గ్రేడ్ సాధించినందుకు, ఆయన ఈ సందర్భంగా, విశ్వవిద్యాలయాన్ని అభినందించారు. ప్రతిభావంతులైన విద్యార్థుల పనితీరును కూడా, మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో, ప్రతిభావంతులైన 29 మంది విద్యార్థులకు, దృశ్య మాధ్యమం ద్వారా పతకాలు ప్రదానం చేశారు. వివిధ విభాగాలలో 55 పీ.హెచ్.డీ; 13 ఎం.ఫిల్. డిగ్రీ సర్టిఫికెట్లను కూడా, విద్యార్థులకు, ఈ స్నాతకోత్సవంలో ప్రదానం చేశారు. ఈసారి మహిళా విద్యార్థులు బాగా రాణించారు. మొత్తం 29 ప్రతిభా పురస్కారాలలో 21 పతకాలు మహిళా విద్యార్థులకు లభించాయి. పి.హెచ్.డి. మరియు ఎం.ఫిల్. విద్యార్థులకు ప్రదానం చేసిన మొత్తం 68 డిగ్రీలలో 37 డిగ్రీలు మహిళా విద్యార్థులకు లభించాయి.
విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్వాగతోపన్యాసం చేస్తూ, కరోనా మహమ్మారి నెలకొన్న కష్ట కాలంలో కూడా తమ విశ్వవిద్యాలయం గత ఏడాది చేపట్టిన కార్యకలాపాలను వివరిస్తూ, మంత్రితో పాటు హాజరైన ఇతరులకు (దేశవ్యాప్తంగా దృశ్య మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నవారికీ) వార్షిక నివేదిక సమర్పించారు. విశ్వవిద్యాలయం తన 56 ప్రాంతీయ కేంద్రాలు మరియు 21 పాఠశాలల నెట్‌వర్క్ ద్వారా డిజిటల్ టెక్నాలజీ సదుపాయంతో అభ్యాసకులకు విరామం లేకుండా - విద్య బోధనకు అవసరమైన సహాయాన్ని అందజేసిందని, ఆయన తెలియజేశారు. మహమ్మారి సమయంలో ప్రాంతీయ కేంద్రాలు నిర్వహించిన ఆన్-లైన్ పాఠాలతో పాటు, ఇగ్నో అధ్యాపకులు విశ్వవిద్యాలయం యొక్క ఫేస్-బుక్ వేదికగా 300 కి పైగా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన హైలైట్ చేశారు. స్థూల నమోదు నిష్పత్తిని పెంచే విధంగా సమాజంలోని అన్ని వర్గాలకు, వారి నేపధ్యాలతో సంబంధం లేకుండా, సరసమైన, అందుబాటులో ఉండే, నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలన్న విశ్వవిద్యాలయం యొక్క దృష్టి మరియు లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని 'యూ-ట్యూబ్' ద్వారా, ఇగ్నో ఉన్నత విద్య కోసం నిర్వహించే "స్వయం ప్రభ" ఛానెళ్ల ద్వారా, విశ్వవిద్యాలయానికి చెందిన "జ్ఞాన్ దర్శన్" ద్వారా మరియు దేశ వ్యాప్తంగా ఉన్న 56 ప్రాంతీయ కేంద్రాలతో పాటు అభ్యాసకులు ప్రత్యక్షంగా ప్రసారం చేశారు.
*****
(Release ID: 1712117)
Visitor Counter : 165