నీతి ఆయోగ్

పోషకాహార సమాచారం ఇవ్వడానికి నీతి ఆయోగ్ ‘పోషణ్‌ జ్ఞాన్’ వెబ్సైట్ ను ప్రారంభించింది

Posted On: 13 APR 2021 4:17PM by PIB Hyderabad
అశోకా విశ్వవిద్యాలయం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ , సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ ఈ రోజు ఆరోగ్యం , పోషణపై సమగ్ర వివరాలు అందించడానికి జాతీయ డిజిటల్  రిపాజిటరీ  (సమాచార నిధి) ‘పోషణ్‌ జ్ఞాన్‌’ వెబ్సైట్ను ప్రారంభించింది. ప్రారంభోత్సవంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్, కార్యదర్శి (డబ్ల్యూసీడీ) శ్రీరామ్ మోహన్ మిశ్రా, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్ ప్రసంగించారు. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం నీతిఅయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, పోషణ్‌ జ్ఞాన్ సృష్టి ఒక మైలురాయి అని అన్నారు. ‘‘క్షేత్రస్థాయిలో ప్రవర్తనలను మార్చడం ద్వారా మాత్రమే నిజమైన మార్పు తీసుకురావచ్చు. భారతదేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ పోషకాహారలోపం సమస్య కొనసాగుతూనే ఉంది.  ఈ పరిస్థితిని మార్చడంలో పోషణ్‌ జ్ఞాన్ చాలా ముఖ్యమైన కార్యక్రమం. ప్రధానమంత్రి ఆశించినట్టు పోషణ ఒక ఉద్యమంగా మారుతుంది” అని ఆయన అన్నారు. భారతదేశంలో పోషణ ప్రాముఖ్యత గురించి నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  అమితాబ్ కాంత్ మాట్లాడారు. ‘‘ప్రవర్తనలో మార్పులు ముఖ్యం. గర్భిణిలు, బాలింతలు , ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని పోషకాహారం అందించాలి.  తల్లి పాలివ్వడం, రోగనిరోధకత వంటి సమస్యల పరిష్కారానికి ఈ వ్యూహాన్ని అమలు చేయొచ్చు. మానవ ప్రవర్తనలో సానుకూల మార్పును సృష్టించడం ద్వారా పోషణ్‌ జ్ఞాన్ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతుంది” అని అన్నారాయన. పోషణ్ జ్ఞాన్ పోర్టల్ ఏర్పాటును ఎంవోడబ్ల్యూసీడీ కార్యదర్శి  రామ్ మోహన్ మిశ్రా ప్రశంసించారు, సమాజ అభివృద్దికి  జ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పోషణ్ సైట్లోని క్రౌడ్ సోర్సింగ్ ఫీచర్ ఎంతో ముఖ్యమని అన్నారు. ‘‘కొన్ని  ప్రాంతాల్లో సంప్రదాయ విధానాలు విజయం సాధించాయి.  దేశవ్యాప్తంగా వీటిని ఉపయోగించవచ్చు. తమిళనాడులో రక్తహీనతను ఎదుర్కోవడానికి ఇటీవల కనుగొన్న సాంప్రదాయ ద్రాక్ష-ఆధారిత సమ్మేళనం ఎంతో ఉపయోగపడింది” అని ఆయన వివరించారు. 
డాక్టర్ రాకేశ్‌సర్వాల్ మార్గదర్శకత్వంలో, పోషణ్‌ జ్ఞాన్  రిపాజిటరీని తయారు చేశారు. దీని ఒక  సమాచార వనరుగా తీర్చిదిద్దారు. విభిన్న భాషల్లో ఇందులో వివరాలు ఉంటాయి. 14 అంశాలపై కమ్యూనికేషన్ సామగ్రిని శోధించవచ్చు.  రిపాజిటరీకి కంటెంట్ను కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమం , మహిళలు , పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖల నుండి తీసుకున్నారు. ఈ వెబ్‌సైట్ సులువైన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. (మల్టీ-పారామెట్రిక్ సెర్చ్, ఒక సమయంలో మల్టిపుల్ డౌన్‌లోడ్‌లు, సోషల్ మీడియా ద్వారా పదార్థాలను విషయాలను సులువుగా పంచుకోవడం , ఏ రకమైన స్మార్ట్‌ఫోన్‌లోనైనా సులభంగా చూడటం వంటివి).  రిపాజిటరీ ఒక ప్రత్యేకమైన క్రౌడ్‌సోర్సింగ్ ఫీచర్ ఉంటుంది. దీనివల్ల ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు సామగ్రిని అందించవచ్చు. ఒక ప్రత్యేక కమిటీ ఈ కంటెంట్ను కమిటీ సమీక్షించాక, సైట్లో అప్లోడ్ చేస్తారు. “ఈ నెల ముఖ్యాంశం” (ముఖ్య విషయాలను ప్రోత్సహించడానికి ఎంవోహెచ్ఎఫ్‌డబ్ల్యూ, ఎంవోడబ్ల్యూసీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా) , “మోస్ట్ డౌన్‌లోడెడ్ మీడియా” (ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే విషయాల గురించి తెలుసుకోవడానికి ఒక మార్గంగా) వంటి వాటిని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఇది ఎంవోహెచ్ఎఫ్‌డబ్ల్యూ, ఎంవోడబ్ల్యూసీడీ, నీతి ఆయోగ్, ఎనిమియా ముక్త్ భారత్, ఈట్ రైట్ ఇండియా వంటి వెబ్‌పేజీల లింక్‌లను కూడా అందిస్తుంది. అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలు - ఎంవోడబ్ల్యూసీడీ, ఎంవోహెచ్ఎఫ్‌డబ్ల్యూ, తాగునీరు , పారిశుధ్యం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ- శాఖలు, యూనిసెఫ్ వంటి ఏజెన్సీలు , ఎఫ్ఎస్ఎస్ఏఐ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్, ఐసీఎంఆర్, ఎన్ఐఆర్డీపీఆర్, ఎన్ఐపిసిసిడి, ఎఫ్అండ్‌బి అధికారులు సైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సైట్ డెవెలప్మెంట్ పార్ట్నర్స్ బిఎమ్‌జిఎఫ్, బిబిసి మీడియా యాక్షన్, జీవికా, అలైవ్ అండ్ థ్రైవ్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
 
వెబ్‌సైట్‌ అడ్రస్: https://poshangyan.niti.gov.in/
 
***


(Release ID: 1711709) Visitor Counter : 200