రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు

Posted On: 13 APR 2021 5:28PM by PIB Hyderabad

డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 “భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నా తోటి భారతీయ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

డాక్టర్ అంబేడ్కర్ తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల మధ్యన కూడా విభిన్నమైన పంథాను ఎంచుకుని తన జీవితాన్ని తీర్చిద్దుకున్నారు. ఆసాధారణమైన, బహుముఖ విజయాలతో జీవితంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.

  మానవ హక్కులకు సంబంధించి ఆయన ఎంతో దక్షత గల న్యాయవాది. భారతదేశంలోని పేదలు, నిమ్న వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి, సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ‘బహిష్కృత హితకారిణి సభ’ పేరిట ఒక సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఈ సంస్థ లక్ష్యాల సాధనకోసం ఆయన జీవితాంతం పోరాటం సలిపారు. కులం, తదితర బేధభావాలతో తలెత్తే రాగద్వేషాలకు అతీతమైన అధునాతన భారతదేశాన్ని తయారు చేయాలని ఆయన భావించారు. శతాబ్దాలుగా వెనుకబాటుకు గురైన మహిళలు, నిమ్నవర్గాల ప్రజలు ఆర్థిక సమానత్వం, సామాజిక హక్కులు పొందగలిగేలా ఆధునిక భారతావని నిర్మించేందుకు ఆయన ఎంతో తపనపడ్డారు.

  అంబేడ్కర్ జీవితంనుంచి మనం పాఠాలు నేర్చుకుని, ఆయన ఆశయాలను మన జీవితంలో భాగంగా చేసుకుందాం.  అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇందుకోసం తీర్మానం చేద్దాం. బలమైన, సుసంపన్నమైన భారతావని నిర్మాణానికి మనవంతు సేవలందిద్దాం.” అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

రాష్ట్రపతి సందేశం కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

 

*******



(Release ID: 1711590) Visitor Counter : 214