శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నూతన ఎంఆర్ ఎన్ఎ ఆధారిత కోవిడ్ 19 వాక్సిన్ -హెచ్‌జిసిఒ19 కోసం జెన్నోవా బయోఫార్మస్యూటికల్స్ లిమిటెడ్‌కు మిషన్ కోవిడ్ సురక్ష కింద వాక్సిన్ అభ్యర్ధిని అందించిన బయోటెక్నాలజీ శాఖ
హెజిసిఒ19ః తొలి, రెండవ దశ మానవ క్లినికల్ ట్రయల్స్ కోసం నమోదు ప్రారంభం కానుంది
Posted On:
13 APR 2021 10:56AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ మద్దతుతో వాక్సీన్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా బిఐఆర్ సి (BIRAC) అమలు చేస్తున్న మిషన్ కోవిడ్ సురక్ష - భారత కోవిడ్-19 వాక్సీన్ అభివృద్ధి మిషన్ క్లినికల్ ట్రయల్స్‌లోకి అడుగుపెడుతోంది. పూణెకు చెందిన జెన్నోవా బయోఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన భారతదేశంలోనే తొలి తరం ఎంఆర్ ఎన్ఎ - ఆధారిత కోవిడ్ -19 వాక్సిన్ - హెచ్‌జిసిఒ19 (HGCO19) క్లినికల్ అధ్యయనానికి అదనపు నిధుల కేటాయింపుకు ఆమోదించినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు చెందిన బయోటెక్నాలజీ శాఖ ప్రకటించింది.
ఈ నిధులను డిబిటి ఆధ్వర్యంలో అంకిత భావంతో ఈ కార్యక్రమ అమలు చేసే యూనిట్ బయోటెక్నాలజీ ఇండిస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సల్ (BIRAC)కు మిషన్ కోవిడ్ సురక్ష - భారత కోవిడ్-19 వాక్సీన్ అభివృద్ధికింద ఈ నిధులను మంజూరు చేశారు. కాగా, మిషన్ కోవిడ్ సురక్ష - భారత కోవిడ్-19 వాక్సీన్ అభివృద్ధి అభ్యర్ధుల కింద ఎక్సప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ రిక్వెస్ట్ ఫర్ ఇంటరెస్ట్ (REOI)కు స్పందించి సమర్పించిన దరఖాస్తులను అనేక దఫాలుగా మూల్యాంకనం చేసిన తర్వాతే ఈ నిధులను మంజూరు చేయడం జరిగింది.
మొదటి నుంచి డిబిటి జెన్నోవాకు తోడ్పాటుగా ఉండటమే కాకుండా, జెన్నోవా తయారు చేసిన ఎంఆర్ఎన్ఎ- ఆధారిత తర్వాతి తరం వాక్సిన్ హెచ్‌జిసిఒ19 ఉత్పత్తికి అవసరమైన మూలధానాన్ని అందించడం ద్వారా వేదిక ఏర్పాటుకు సౌలభ్యాన్ని కల్పించింది. యుఎస్ఎకు చెందిన హెచ్‌డిటి బయోటెక్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో జెన్నోవా కోవిడ్ 19 ఎంఆర్ ఎన్ఎ వాక్సిన్ - హెచ్‌జిసిఒ19ను అభివృద్ధి చేసింది.
ఎలుకలు, మానవేతర ప్రైమేట్ నమూనాలలో హెచ్‌జిసిఒ19 ఇప్పటికే రక్షణను, ఇమ్యునోజెనిసిటీని, యాంటీ బాడీల కార్యకలాపాలను నిర్వీర్యం చేయగల సామర్ధ్యాన్ని ప్రదర్శించింది. ఎలుకలు, మానవేతర ప్రైమేట్లలో యాంటీబాడీల నిర్వీర్యం చేసినప్పుడు స్పందనను కోవిడ్-19 రోగులు కోలుకుంటున్న దశలో సెరాతో పోల్చవచ్చు. వాక్సిన్ తీసుకునే అభ్యర్ధి రక్షణ కోసం డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ (తొమ్మిదవ సవరణ) రూల్స్ -2019కు అనుగుణంగా జెన్నోవా ఇప్పటికే రెండు ప్రీక్లినికల్ టాక్సిటీ అధ్యయనాలను పూర్తి చేసింది. అంతేకాకుండా, జన్యు అభిసంధానం (జెనెటిక్ మానిప్యులేషన్ పై సమీక్షా కమిటీ (ఆర్‌సిజిఎం), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ), భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) నుంచి పరీక్షల కోసం రెండు అధ్యయనాలను పూర్తి చేసింది. మొదటి, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న, ఆరోగ్యంగా ఉన్నవాలంటీర్లను నమోదు చేసుకునే ప్రక్రియను జెన్నోవా శ్రీకారం చుట్టింది.
ఎంఆర్ఎన్ఎ అంటు వ్యాధుల నిరోధకంగా ఉండటమే కాక, ఏకీకృతం అయ్యే లక్షణం లేకుండా, ప్రామాణిక కణ సంబంధ విధానాల కారణంగా ఎంఆర్ ఎన్‌శ్రీ వాక్సిన్లను సురక్షితమైనవని పరిగణిస్తున్నారు. కణ సైటోప్లాజంలో ప్రోటీన్ వ్యవస్థగా మార్పు చెందగల అంతర్గత సామర్ధ్యం కారణంగా అవి అత్యంత ప్రయోజనకరమైనవి, సమర్ధవంతమైనవి. అదనంగా, ఎంఆర్ఎన్ఎ వాక్సిన్లు పూర్తిగా సంశ్లిష్టమైనవి, గుడ్లు లేక బాక్టీరియాను అభివృద్ధి చేసేందుకు వాటికి సమ్మేళనం అవసరం లేదు. కనుక, వాటిని సిజిఎంపి నిబంధనల కింద నికరంగా సామూహిక వాక్సినేషన్‌కు అవి అందుబాటులో లభించేలా చూడటం కోసం తక్కువ ధరలో త్వరితగతిన ఉత్పత్తి చేయవచ్చు.
ఇటువంటి సాంకేతిక వేదిక ఏర్పాటు కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ కు సాధికారతను ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో మహమ్మారిని ఎదుర్కొనే లేక తర్వాత స్థానిక దశకు (వైరస్‌లో మ్యుటేషన్, వాక్సిన్ వేయించుకోని తక్కువ రిస్కు ఉన్న జనాభా, శిశువులు) చేరుకున్నప్పుడు దాని వేగవంతమైన అభివృద్ధి మార్గాన్ని ఉపయోగించుకునేందుకు దానిని నిలువరించవచ్చు. కోవిడ్-19 వ్యాప్తి చెందిన సమయంలోనే ఈ సాంకేతికల వేదిక వేగం రుజువైంది. ఎందుకుంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ ప్రయోగాలలో తొలిగా ప్రవేశించింది ఎంఆర్ఎన్ఎ అభ్యర్ధే.
కోవిడ్-19 ప్రవేశించినప్పుడు, ఎంఆర్ ఎన్ ఎ ఆధారిత కోవిడ్-19 వాక్సిన్ సహా అనేక వాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాలకు డిబిటి మద్దతు ఇచ్చిందని, బిఐఆర్‌సి చైర్ పర్సన్, డిబిటి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ చెప్పారు. ఒక ఏడాది కిందట ఇది నూతన సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశంలో వాక్సిన్ల ఉత్పత్తికి ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే, ఈ సాంకేతికత సంభావ్యతపై విశ్వాసం ఉంచి, ఉత్పత్తి వేగాన్ని పెంచేందుకు అనువుగా ఉన్న ఈ సాంకేతికల వేదికకు డిబిటి మూలధనాన్ని అందించింది. భారతదేశంలో తయారు చేసిన ఎంఆర్ఎన్ఎ ఆధారిత కోవిడ్-19 వాక్సిన్ క్లినికల్స్‌కు వెడుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు.
భారతదేశంలో బయోటెక్నాలజీ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డిబిటి కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమం ద్వారా వాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకే కాక, క్లినికల్ అధ్యయనాలకు కూడా మద్దతునందిస్తున్నామన్నారు. ఈ సాంకేతికత వైరస్ ఉత్పరివర్తనం చెందిన రూపాలను కూడా నియంత్రించగలదు కనుక ఇందులో జెన్నోవా ఘన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను, అని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా జె్న్నోవా బయోఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ సిఇఒ డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, మానవ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించే ముందే హెచ్‌జిసిఒ19 భద్రతను, సమర్ధతను నిరూపించేందుకు నిబంధనలు, షరతులకు లోబడి అన్ని అవసరమైన భద్రత అంచనాలను నిర్వహించామని వివరించారు. సార్స్-సిఒవి2 వ్యాధి, దానికి సంబంధించి కొత్త రకాలు కనిపించడం ఈ వ్యాధిని శోచనీయమైన లక్ష్యంగా చేసిందన్నారు. సమర్ధవంతమైన పరిష్కారాలను రూపొందించడంలో ఎంఆర్ ఎన్ఎ ఆధారిత అత్యాధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు.
డిబిటి గురించి
సైన్స్& టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ శాఖ (డిబిటి) వ్యవసాయం, ఆరోగ్యసంరక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం, పరిశ్రమ రంగాలలో బయోటెక్నాలజీలను అభివృద్ధి చేసి అనువర్తింపచేయడంతో సహా, భారతదేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించి, వేగవంతం చేస్తుంది.
బిఐఆర్ఎసి గురించిః
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ ఏర్పాటు చేసిన లాభార్జన కోసం కాని సెక్షన్ 8, షెడ్యూల్ బి ప్రభుత్వరంగ సంస్థ. దేశానికి సహేతుకమైన ఉత్పత్తుల అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు వ్యూహాత్మక పరిశోధన, ఆవిష్కరణను చేపట్టేందుకు అభివృద్ధి చెందుతున్న బయోటెక్ సంస్థలను బలోపేతం చేసి, సాధికారం చేసేందుకు మధ్యవర్తి సంస్థగా వ్యవహరించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
జెన్నోవా గురించి
వివిధ సూచీలలో ప్రాణానికి హాని కలిగించే వ్యాధులను తగ్గించేందుకు జీవసంబంధ చికిత్సలపై పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, వాణిజ్యీకరణకు అంకితమైన బయోటెక్నాలజీ కంపెనీ జెన్నోవా బయోఫార్మస్యూటికల్స్ లిమిటెడ్. దీని కేంద్ర కార్యాలయం భారత దేశంలోని పూణెలో ఉంది. మరింత తెలుసుకోవడానికి https://gennova.bio అన్న లింక్‌ను క్లిక్ చేసి కంపెనీ వెబ్ సైట్‌ను సందర్శించండి.
మరింత సమాచారం కోసంః డిబిటి/ బిఐఆర్ఎసి కమ్యూనికేషన్ సెల్‌ను సంప్రదించండి. @DBTIndia @BIRAC_2012.అదనపు సమాచారం కోసం www.dbtindia.gov.in /www.birac.nic.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
***
(Release ID: 1711576)
Visitor Counter : 319