ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీకా ఉత్సవ్ తొలిరోజునే దాదాపు 30 లక్షల టీకాలు ఇప్పటిదాకా మొత్తం టీకా డోసులు 10.45 కోట్లు
రోజుకు 40 లక్షలకు పైగా సగటు టీకాలు- ప్రపంచంలోనే అత్యధికం
రోజువారీ కొత్త కేసుల్లో 81% పైగా 10 రాష్ట్రాల్లోనే
చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల్లో 70.16% ఐదు రాష్ట్రాల్లోనే
Posted On:
12 APR 2021 11:39AM by PIB Hyderabad
టీకా ఉత్సవ్ నేడు రెండో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 10.45 కోట్లకు చేరింది. మొత్తం15,56,361 శిబిరాలద్వారా ఈ ఉదయం 7 గంటలవరకు 10,45,28,565 కోవిడ్ టీకాలు ఇచ్చినట్టు సమాచారం అందింది. ఇందులో 90,13,289 డోసులు ఆరోగ్య సిబ్బంది అందుకున్న మొదటి డోసులు, 55,24,344 రెండో డోసులు, , 99,96,879 కోవిడ్ యోధులు అందుకున్న మొదటి డోసులు, 47,95,756 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు అందుకున్న 4,05,30,321 మొదటి డోసులు, 19,42,705 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్యవారు అందుకున్న 3,20,46,911 మొదటి డోసులు, 6,78,360 రెండో డోసులు కలిసి ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్య వారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
90,13,289
|
55,24,344
|
99,96,879
|
47,95,756
|
3,20,46,911
|
6,78,360
|
4,05,30,321
|
19,42,705
|
10,45,28,565
|
ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకాలలో 60.13% వాటా 8 రాష్ట్రాలదే కావటం గమనార్హం.
టీకా ఉత్సవ్ కార్యక్రమం చేపట్టిన మొదటిరోజైన నిన్న ఆదివారం నాడు దాదాపు 30 లక్షలకు పైగా టీకాలిచ్చారు. ఎప్పటికంటే అధికంగా 18,800 కేంద్రాలు పెరగటంతో 63,800 టీకా కేంద్రాలు టీకా ఉత్సవ్ మొదటి రోజున ముఖ్యంగా ప్రైవేట్ పనిప్రదేశాలలో పనిచేయగా ఆదివారం అయినప్పటికీ 30 లక్షలమందికి పైగా తీకాలు తీసుకున్నారు. టీకాల కార్యక్రమం మొదలైన 86వ రోజైన ఏప్రిల్11న 29,33,418 టీకా డోసులివ్వగా అందులో 27,01,439 మంది లబ్ధిదారులు 38,398శిబిరాల ద్వారా మొదటి డోస్, 2,31,979 మంది లబ్ధిదారులు రెండో డోస్ అందుకున్నారు.
తేదీ: ఏప్రిల్ 11, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్య వారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
9,226
|
16,055
|
43,264
|
36,547
|
17,70,258
|
36,878
|
8,78,691
|
1,42,499
|
27,01,439
|
2,31,979
|
ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్న రోజువారీ టీకాల సంఖ్యా పరంగా చూసినప్పుడు భారత్ రోజుకు సగటున 40,55,055 డొసులతో అగ్రస్థానం కొనసాగిస్తూ వస్తోంది. నిన్న ఈ సంఖ్య 38,34,574 గా నమోదైంది.
దేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో కొత్తగా 1,68,912 కరోనా కేసులు నమోదయ్యాయి. పది రాష్టాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ కొత్త కేసుల్లో 83.02% నమోదు చేసుకున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా ఒక్క రోజులో 63,294 కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 15,276, ఢిల్లీలో 10,774 కేసులు వచ్చాయి.
ఈ క్రింద చూపిన విధంగా పదహారు రాష్టాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.
భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య నేటికి 12,01,009 కు చేరుకోగా ఇది మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 8.88% వాటా. గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్న కోవిడ్ కెసుల సంఖ్య పెరుగుదల 92,922 గా నమోదైంది. ఈ కెసులలో 70.16% వాటా మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్టాలదే కావటం గమనార్హం. ఒక్క మహారాష్టలోనే అత్యధికంగా 47.22% కేసులు చికిత్సలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529 కాగా కోలుకున్నవారి శాతం 89.86%.
గత 24 గంటలలో 75,086 మమ్ది కోవిడ్ బారినుంచి బైటపడ్డారు. .
రోజువారీ కొవిడ్ మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 904 మంది కోవిడ్ తో చనిపొయారు.
తాజా మరణాలలో 89.16% వాటా పది రాష్ట్రాలది కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 349 మంది, చత్తీస్ గఢ్ లో 122 మంది, చనిపోయారు.
.
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అవి: ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, సిక్కిం, లక్షదీవులు, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1711134)
Visitor Counter : 258
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam