మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పేలుళ్లను మైక్రోసెన్సర్ తో గుర్తించే ట్రేస్ డిటెక్టర్ నానోస్నిఫర్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా మైక్రోసెన్సర్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేసే ట్రేస్ డిటెక్టర్ నానోస్నిఫర్ - కేంద్ర విద్యా మంత్రి
పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి పరంగా నానోస్నిఫర్ 100 % మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
పేలుళ్లను గుర్తించే పరికరాల దిగుమతిని నానోస్నిఫర్ తగ్గిస్తుంది-శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
10 సెకండ్లలో నానోస్నిఫర్ పేలుళ్లను గుర్తిస్తుంది
Posted On:
09 APR 2021 3:03PM by PIB Hyderabad
ఐఐటి బొంబాయి ఇంక్యుబేటెడ్ అంకుర సంస్థ నానో స్నిఫ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన మైక్రోసెన్సర్ ఆధారిత పేలుడు ట్రేస్ డిటెక్టర్ (ఇటిడి) నానోస్నిఫర్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో తొలిసారిగా మైక్రోసెన్సర్ తో పనిచేసే ఇటిడిగా రూపొందిన నానోస్నిఫర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. నానోస్నిఫర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రితో పాటు ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ శ్రీ వి.రాంగోపాల్ రావు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కృతికల్ సొల్యూషన్స్ అంకుర సంస్థ అయిన వెహంట్ టెక్నాలజీస్ మార్కెట్లోకి నానోస్నిఫర్ ను ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ పోఖ్రియాల్ భారత దేశం అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాంక్షలకు అనుగుణంగా నానోస్నిఫర్ ను నానోస్నిఫ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిందని అన్నారు. పరిశోధన, అభివృద్ధి,ఉత్పత్తి పరంగా నానోస్నిఫర్ 100 శాతం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అని మంత్రి అన్నారు. నానోస్నిఫర్ యొక్క ప్రధాన సాంకేతికత అమెరికా మరియు యూరోప్ దేశాల్లో పేటెంట్లను కలిగి ఉందని అన్నారు. ఈ పరికరం అందుబాటులోకి రావడంతో పేలుళ్లను గుర్తించే పరికరాల కోసం దిగుమతులపై ఇకపై ఎక్కువగా ఆధారపడవలసి ఉండదని మంత్రి అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని అంకుర సంస్థలు, మధ్యతరహా పరిశ్రమలు స్వదేశంలో ఉత్పత్తులను ప్రారంభించడానికి పరిశోధనలపై దృష్టి సారిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ప్రయోగశాల నుంచి మార్కెట్ కు అన్న విధానానికి నానోస్నిఫర్ నిదర్శనంగా ఉంటుందని ఆయన అన్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధమైన నానోస్నిఫర్ కేవలం పది సెకండ్లలో పేలుళ్లను గుర్తించడమే కాకుండా వాటిని వివిధ తరగతుల్లో విశ్లేషించే సామర్ధ్యం కలిగి ఉందని మంరి తెలిపారు. సైనిక, సాంప్రదాయ పేలుళ్లతో పాటు ఇళ్లలో జరిగే పేలుళ్లను నానోస్నిఫర్ గుర్తిస్తుంది. స్పష్టంగా కనిపించే వినిపించే హెచ్చరికలను నానోస్నిఫర్ జారీ చేస్తుందని అన్నారు.
దేశ భద్రత అంశంలో కీలక పాత్ర పోషించే పరికరాలను ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ లు తమ అంకుర సంస్థల్లో ఉత్పత్తి కాడానికి సహకరిస్తూ స్వదేశీ పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు. విద్యావంతులు, పరిశ్రమ వర్గాలు కలసి పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చునని మంరి వ్యాఖ్యానించారు. ఇటువంటి ఉత్పత్తులు ఇతర సంస్థలకు స్ఫూర్తి కలిగిస్తాయని అన్నారు. దేశంలో ప్రతిభావంతులకు, కస్టపడి పనిచేసే పారిశ్రామికవేత్తలకు, ప్రతిభకు కొరత లేదని అన్న మంత్రి ఈ పరిస్థితుల్లో దిగుమతులపై ఆధారపడడం తగదని అన్నారు. నానోస్నిఫర్ లాంటి పరికరాల తయారీ దేశ సామర్ధ్యానికి గుర్తు అని ఆయన పేర్కొన్నారు.
భౌగోళిక-రాజకీయ కారణాల వల్ల మన దేశం నిరంతరం బెదిరింపులను ఎదుర్కొంటున్నదని మంత్రి అన్నారు. దీనితో విమానాశ్రయాలు, రైల్వేలు మరియు మెట్రో స్టేషన్లు, హోటళ్ళు, మాల్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాల వంటి అధిక భద్రతా ప్రదేశాలలో పేలుడు పదార్థాలు మరియునిషేధిత వస్తువులు బయటపడుతున్నాయని మంత్రి అన్నారు. వీటిని గుర్తించడానికి ఇటువంటి ప్రాంతాల్లో ఏర్పాటైన తనిఖీ కేంద్రాలు ప్రజలను, వారి సామానులను వేగంగా తనిఖీ చేయవలసి ఉంటుందని అన్నారు. దీనికోసం విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఎక్కువ ధరకు పరికరాలను దిగుమతి చేసుకోవలసి వస్తున్నదని మంత్రి అన్నారు. దీనికి నానోస్నిఫర్ ప్రత్యామ్నాయంగా ఉంటుందని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / మెషిన్ లెర్నింగ్ ఆధారిత భౌతిక భద్రత, నిఘా మరియు ట్రాఫిక్ మానిటరింగ్, జంక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సొల్యూషన్స్‌లో గుర్తింపు పొందిన వెహంట్ టెక్నాలజీస్‌తో నానోస్నిఫ్ టెక్నాలజీస్ కలసి పనిచేస్తోంది.
నానోస్నిఫర్ పేలుడు పదార్థాల సూక్ష్మ పరిమాణాన్ని గుర్తించి సెకన్లలో ఫలితాన్ని అందిస్తుంది. ఇది సైనిక, వాణిజ్య మరియు ఇంట్లో పేలుడు పదార్థాల బెదిరింపులను ఖచ్చితంగా గుర్తించగలదు. పేలుడు పదార్థాలను విశ్లేషించి వాటిని తరగతులుగా వర్గీకరించడానికి కూడా సహాయపడుతుంది. స్వదేశీ సాంకేతికతతో తయారైన నానోస్నిఫెర్ దిగుమతుల వ్యయాన్ని తగ్గిస్తుంది.
పూణే కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ పరిశోధన సంస్థ నిర్వహించిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ పరీక్షలో నానోస్నిఫర్ విజయవంసాధించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కూడా దీనిని పరీక్షించింది.
****
(Release ID: 1710756)
Visitor Counter : 260