శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిఎస్ఐఆర్- సిఎంఇఆర్ఐ ఆక్సిజన్ సమృద్ధ యూనిట్- బహుముఖ ప్రాణరక్షక శక్తి కలిగినది
Posted On:
08 APR 2021 11:50AM by PIB Hyderabad
ఆక్సిజన్ సుసంపన్న యూనిట్, మనచుట్టూ ఉన్న గాలినుంచి ప్రత్యేకంగా నైట్రోజన్‌ను తొలగించి ఆక్సిజన్‌తో
సుసంపన్నమైన గాలిని సరఫరా చేయడంపై దృష్టిపెట్టిన వ్యవస్థ. ఇలా తయారైన ఆక్సిజన్‌ను ఉపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఆక్సిజన్ మాస్కు ద్వారా లేదా ముక్కు ద్వారా పేషెంట్‌కు అందిస్తారు. ఈ పరికరాన్ని మారుమూల ప్రాంతాలలో, ఇళ్లల్లో, ఆసప్రత్రులలో క్రానిక్ అబ్‌స్ట్రక్షన్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి), క్రానిక్ హైపోక్సేమియా, పల్మనరీ ఎడిమా ఉన్న వారికి అందుబాటులోకి తెస్తారు. అలాగే తీవ్రమైన గురక సమస్యతో బాధపడుతున్న వారికి పాజిటివ్ ఎయిర్‌వేస్ ప్రెషర్ యూనిట్‌తో కలిపి దీనిని అనుబంధ చికిత్సగా వాడుతుంటారు.
సిఎస్ ఐఆర్-సిఎంఇఆర్ై దేశీయంగా ఆక్సిజన్ సమృద్ధ యూనిట్‌ను అభివృద్ధి చేశాయి. ఇది ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ సూత్రంపై పనిచేస్తుంది. అలాగే కొంత ఒత్తిడి వద్ద గాలి నుంచి ప్రత్యేకించి నైట్రోజన్‌ను తొలగించి తద్వారా ఆక్సిజన్ గాఢతను పెంచుతుంది. ఆక్సిజన్ ఎన్‌రిచ్‌మెంట్ యూనిట్‌లో కంప్రెసర్, సొలెనాయిడ్ ఉపయోగించే 3 బై 2 వాల్వులు, ఫ్లోమీటర్, ప్రీ ఫిల్టర్ ఉంటాయి. కంప్రసర్ ఒత్తిడితోకూడిన గాలిని మాడ్యూల్‌లోకి పంపుతుంది. అక్కడ ఆక్సిజన్ ను సుసంపన్నం చేసి విడుదల చేస్తుంది. వదిలేసిన పార్టికల్స్, వైరస్‌లు, గాలిలోని బాక్టీరియాను హెచ్ ఇ పి ఎ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తుంది.
ఈ యూనిట్‌ను బెంగళూరు లోని టియువి రీన్ లాండ్ వదంద ఐఇసి 60601-1 3.1 ఎడిషన్ : 2012 ప్రమాణాల ప్రకారం విద్యుత్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్ ఎన్‌రిచ్‌మెంట్ పర్సంటేజ్, అలాగే ఔట్ ఫ్లోను సిఎస్ ఐ ఆర్-సిఎంఇఆర్ ఐ అంతర్గత ఫెసిలిటీలోనే పరీక్షించి చూడడం జరిగింది.సిఎస్ఐఆర్- సిఎంఇఆర్ై అభివృద్ధి చేసిన ఆక్సిజన్ ఎన్‌రిచ్‌మెంట్ యూనిట్ 30 ఎల్‌పిఎం ఆక్సిజన్ కలిగిన గాలిని ఉత్పత్తి చేయగలదు. ఇంత మొత్తంలో ఆక్సిజన్ ఇతర వాణిజ్యపరమైన యూనిట్లలో లేదు.ఈ యంత్రం0.5 ఐపిఎం కచ్చితత్వంతో గాలి సరఫరాను రెగ్యులేట్ చేయగలదు.
ఈ ఫెసిలిటీ ఎక్కువ ఆక్సిజన్ అవసరమైన చికిత్సకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ -19 పేషెంట్లకు ఇది ఉపయోగపడుతుంది.
వాణిజ్యపరంగా అందుబాటులో ఉండే ఆక్సిజన్ ఎన్‌రిచ్‌మెంట్ యూనిట్‌లు సాధారణంగా సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తువరకు పనిచేస్తాయి. ఆప్షనల్ ప్లగ్ ఇన్ మాడ్యూల్ తో ది 14000 అడుగుల ఎత్తు వరకు పనిచేస్తుంది. అందువల్ల ఎత్తయిన ప్రాంతాలలో అత్యవసర సమయాలలో బాగా ఉపయోగపడుతుంది.
దేశంలోని ఇతర పరిశోధనా సంస్థలు ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేసినప్పటికీ సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ఇ వ్యవస్థ అభివృద్ధి చేసిన దానిలో 93 శాతం ఆక్సిజన్ విడుదల స్థాయి కలిగిఉంది. అలాగే 5 ఎల్‌పిఎం అనేది 27-35 శాతం ఔట్‌ఫ్లో కలిగి ఉంది. ఈ యూనిట్ పనితీరు ప్రముఖ ఎం.ఎన్.సిల పనితీరుకు అనుగుణంగా ఉంది.
సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ డైరక్టర్ , ప్రొఫెసర్ డాక్టర్ హరీష్ హిరాణి, ఈ యూనిట్ పనితీరు గురించి మాట్లాడుతూ, సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ అభివృద్ధి చేసిన ఆక్సిజన్ తయారీ యూనిట్ ఇళ్లకు ఆస్పత్రులకు, రక్షణదళాలకు ప్రత్యేకించి ఎక్కువ ఎత్తులో ఉండే ప్రదేశాలలో ఆక్సిజన్ సరఫరాకు , మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కోవిడ్ -10 పేషెంట్లకు చికిత్స అందించడానికి ఉపకరిస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లకు డిమాండ్ తగ్గేలా చేస్తుంది. వాయుకాలుష్యం పెరిగిన పరిస్థితులలో దీనికి డిమాండ్ బాగా పెరుగనుంది. మంచి ఆరోగ్యకరమైన వాతావరణానికి తగిన ఆక్సిజన్ స్థాయిని కల్పించేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
ఈ యూనిట్ వ్యయం సుమారు 35,000 రూపాయలు కానుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్నితెలంగాణాలోని రంగారెడ్డిజిల్లా మెసర్స్ జెన్ మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించారు.
****
(Release ID: 1710454)
Visitor Counter : 250