ప్రధాన మంత్రి కార్యాలయం
‘‘పరీక్షా పే చర్చ 2021’’ తాలూకు వర్చువల్ సంచిక లో విద్యార్థుల తో, ఉపాధ్యాయుల తో, తల్లితండ్రుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
Posted On:
07 APR 2021 9:45PM by PIB Hyderabad
‘పరీక్షా పే చర్చా’ తాలూకు 4వ సంచిక కార్యక్రమం లో భాగం గా విద్యార్థినీవిద్యార్థుల తోను, ఉపాధ్యాయుల తోను, తల్లితండ్రుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ రోజు న మాట్లాడారు. 90 నిముషాల కు పైగా సాగిన ఈ కార్యక్రమం లో అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాల పై ప్రధాన మంత్రి మార్గదర్శనాన్ని స్వీకరించారు. విదేశాల లో ఉంటున్న భారతీయ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
ఈ సంవత్సరపు ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం తొలిసారి గా వర్చువల్ పద్ధతి లో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమం అని ప్రధాన మంత్రి చెప్తూ, కరోనా నేపథ్యం లో అనేక రకాలైన వ్యవస్థ లు మార్పుల కు లోనయ్యాయని, విద్యార్థుల తో ముఖాముఖి మాట్లాడలేక పోతున్నందుకు తనకు విచారం గా ఉందన్నారు. అయినప్పటికీ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం లో అవాంతరం ఎదురవకూడదని ఆయన అన్నారు. ‘పరీక్షా పే చర్చా’ ఒక్క పరీక్షల గురించిన చర్చ కే పరిమితం కాదని, కుటుంబ సభ్యుల తో, మిత్రుల తో ఆహ్లాదకరమైన వాతావరణం లో కలిసిపోయి మాట్లాడుకొని సరికొత్త విశ్వాసాన్ని కూడగట్టుకొనేటటువంటి సందర్భం అని ప్రధాన మంత్రి అన్నారు.
పరీక్ష ల తాలూకు భయాన్ని తగ్గించుకోవడం ఎలా? అంటూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎం. పల్లవి, కువాలాలంపుర్ కు చెందిన అర్పణ్ పాండే లు ప్రధాన మంత్రి ని అడిగారు. ఇది కేవలం పరీక్ష తాలూకు భయం కాదని, ఇది చుట్టుపక్కల ఏర్పడ్డ వాతావరణం తాలూకు భయం అని, ఈ కారణం గానే మీకు ఇదే అంతా, ఇదే జీవితం అని అనిపిస్తుంది; ఈ వాతావరణం వల్లే మీరు అవసరం కంటే ఎక్కువ జాగరూకత ను అలవర్చుకొంటారు అని శ్రీ మోదీ వివరించారు. జీవనం సుదీర్ఘమైనటువంటిది, మరి ఈ పరీక్ష లు జీవనం లో కేవలం దశ లు అని ప్రధాన మంత్రి అన్నారు. విద్యార్థుల పై ఒత్తిడి ని పెంచవద్దని తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు, సాధారణ ప్రజానీకానికి ఆయన సూచన చేశారు. పరీక్షల ను ఎవరినైనా మదింపు చేయడానికి ఒక అవకాశం గా మాత్రమే చూడాలి తప్ప వాటిని జీవన్మరణ అంశం గా మార్చకూడదు అని ఆయన చెప్పారు. ఏ తల్లితండ్రులు అయితే వారి పిల్లల తో కలసి పిల్లల అధ్యయన ప్రయాస లో నిమగ్నం అవుతుంటారో, వారికి వారి పిల్లల లోటుపాటులను గురించి, వారి సుగుణాల ను గురించి తెలిసివుండాలి అని ఆయన అన్నారు.
కఠిన అధ్యాయాల గురించి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ అన్ని విషయాల ను సమాన శక్తి తో, భావన తో చూడాలని సలహా ఇచ్చారు. తమ లోని శక్తి ని అన్నిటికీ సమానం గా పంచాలని సూచించారు. పరీక్షల లో తేలిక గా ఉండే ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలన్న అంశం పై తన అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు. అధ్యయనం సందర్భం లో తన ఆలోచనలను ఆయన వివరిస్తూ, ఏదైనా ఒక విషయం తాలూకు కఠినమైనటువంటి అంశాన్ని చూడనట్లు ఉండకూడదు, అంతకంటే వాటికి సమాధానాలను ఎప్పుడు నిర్ణయించాలి అంటే ఎప్పుడైతే మన మనస్సు తాజా గా ఉంటుందో అని తెలిపారు. ప్రధాన మంత్రి పదవి లో తాను ఉన్నప్పుడు, అంతకంటే క్రితం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు స్వయం గా జటిలమైన అంశాలకు రోజు లోని ఒకటో భాగం లో అంటే పొద్దు పొద్దున వేళ లోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తూ వచ్చానని, ఆ వేళ లో మనస్సు పూర్తి స్థాయి లో శక్తిమంతంగా ఉండి ఆరోగ్యమైన అవస్థ లో ఉంటుందని శ్రీ మోదీ చెప్పారు. ప్రతి ఒక్క సబ్జెక్టు లో నిష్ణాతులు కావడం ప్రధానం కాదని, ఏదో ఒక సబ్జెక్టు పై గట్టి పట్టు ను సాధించిన వారు కూడా అద్భుత విజయాలను సాధించారు అని ఆయన అన్నారు. లతా మంగేశ్ కర్ ను ఉదాహరణ గా చెప్తూ, ఆమె తన పూర్తి జీవనాన్ని కేవలం సంగీతానికే సమర్పించేశారన్నారు. ఏదైనా ఒక విషయం మీకు జటిలం గా ఎలా మారిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఆ సబ్జెక్టు తాలూకు పరిమితుల లో బంధింపబడిపోయి ఉండిపోకూడదు, ఆ కఠినమైన సబ్జెక్టు కు దూరం గా పారిపోనూ కూడదు అని ప్రధాన మంత్రి అన్నారు.
తీరిక సమయం తాలూకు మహత్వాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి విస్తారం గా ప్రస్తావించారు. ఖాళీ సమయానికి తగినంత విలువ ను ఇవ్వాలని, ఎందుకంటే అది లేకపోతే జీవనం ఒక మరమనిషి వంటిది గా అయిపోతుందన్నారు. ఖాళీ సమయాన్ని గౌరవించిన వారు మాత్రమే ఆ క్షణాల నుంచి కూడా ఎంతో కొంత సంపాదించుకొంటారు అని ఆయన చెప్పారు. అలాగే ఖాళీ సమయం లో అంశాలను చూడనట్లుగా ఉండిపోకూడదు, ఎందుకంటే అనేక పర్యాయాలు ఈ ప్రవృత్తి నష్టాన్ని కూడా కలగజేస్తుంది అని ఆయన అన్నారు. ఇటువంటి స్థితి మిమ్మల్ని తాజాగా ఉంచే కన్నా మీరు గందరగోళం లో పడిపోవడానికి కారణం కావచ్చు అని ప్రధాన మంత్రి చెప్పారు. తీరిక దొరికిన క్షణాలు కొత్త నైపుణ్యాల ను నేర్చుకొనేందుకు చక్కని అవకాశాలను ప్రసాదిస్తాయి అని ఆయన అన్నారు. ఖాళీ వేళల లో వ్యక్తి విశిష్టత కు పదును పెట్టుకొనేటటువంటి, వ్యక్తి ఉన్నతం గా ఎదిగేటటువంటి కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
పిల్లలు చాలా చంచలం గా ఉంటారని ఉపాధ్యాయులతోను, తల్లితండ్రుల తోను ప్రధాన మంత్రి అన్నారు. పెద్దలు పలికే మాటల కంటే పెద్దల కార్యశైలి ని, వారి నడత ను పిల్లలు అనుసరిస్తారు అని ఆయన చెప్పారు. ఈ కారణంగానే మనం ఉపదేశాల ను ఇచ్చే వారు గా కాకుండా మన ప్రవర్తన తో పిల్లల లో మంచి ఆచరణ కు బీజం వేయాలి అని ఆయన అన్నారు. పెద్దలు వారి ఆదర్శాల ను వారి జీవనం లో అమలుపరచి పిల్లలకు ప్రేరణ ను అందించాలని శ్రీ మోదీ అన్నారు.
పిల్లల ను భయభీతులను చేసే ప్రతికూల వైఖరి కంటే సానుకూలమైన వ్యవహార శైలి ని అలవరచుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. పెద్దల సక్రియాత్మక ప్రయాస ద్వారా పిల్లల లో సకారాత్మకమైనటువంటి మార్పు లు వస్తాయి, మరి వారు చక్కని అనుభవాన్ని అలవర్చకోవడం మొదలుపెడతారు, ఎందుకంటే వారు తమ పెద్దల నడత ను అనుకరిస్తూ ఉంటారు అని ఆయన వివరించారు. ‘‘సకారాత్మకమైన ప్రేరణ తో యువత లో మెరుగైన అభివృద్ధి చోటు చేసుకొంటుంది" అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రేరణ ను అందించడం లో ఒకటో భాగం శిక్షణ ను ఇవ్వడం అని, చక్కని శిక్షణ ను అందుకొన్న మేధస్సు స్వతహాగానే ప్రేరణాత్మకం అవుతుందని ఆయన అన్నారు.
విద్యార్థులు వారి కలల ను పండించుకోవాలనే సంకల్పాన్ని చెప్పుకోవాలని వారికి శ్రీ మోదీ సలహా ను ఇచ్చారు. సెలిబ్రిటీ సంస్కృతి తాలూకు మిరుమిట్ల ను చూసి వారు నిరాశ కు లోనవకూడదని ఆయన అన్నారు. వేగం గా మారే ప్రపంచం లో అనేక అవకాశాలు కూడా ముందుకు వచ్చి నిలచాయి, మరి ఇలాంటి అవకాశాలను చేజిక్కించుకోవడానికి జిజ్ఞాస భరిత ప్రవృత్తి ని మరింత గా పెంచుకోవలసిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. 10వ, 12వ తరగతుల విద్యార్థులు ఉద్యోగాల స్వభావాన్ని, కొత్త గా చోటు చేసుకొంటున్న మార్పుల ను గమనించడం కోసం వారి చుట్టపక్కల జీవన శైలి ని అతి సూక్ష్మ స్థాయి లో పరిశీలిస్తూ ఉండాలని, వాటికి అనుగుణంగా వారికి వారు గా శిక్షణ ను తీసుకోవడాన్ని, వారికి వారు గా నైపుణ్యాల ను ఆర్జించడాన్ని మొదలుపెట్టేయాలని శ్రీ మోదీ చెప్పారు. ఒక విద్యార్థి లేదా ఒక విద్యార్థిని వారి జీవనం లో ఏదయినా ఒక కీలక సంకల్పాన్ని చెప్పుకోవలసిన అవసరం ఉందని, ఒకసారి అది జరిగిందీ అంటే ఇక ప్రయాణించవలసిన మార్గం ఏదన్నది స్పష్టం అయిపోతుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
ఆరోగ్యవర్ధకమైన ఆహార పానీయాల అవసరాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి సుదీర్ఘం గా మాట్లాడారు. వారు వారి సాంప్రదాయిక ఆహార పానీయాల తాలూకు రుచి ని, వాటి లాభాల కు పెద్ద పీట వేయాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.
అంశాలను గుర్తుంచుకోవడం లో సమస్య ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ‘‘ఏ అంశం లో అయినా మమేకం అయి, దాని లోతుల్లోకి వెళ్లి, దానికి మరింత అనుసంధానమై, దానిలోని నిగూఢత్వాన్ని దర్శించడమనేది ఆలోచన శక్తి కి పదును పెట్టుకోగల మార్గం’’ అన్నారు. ఏ అంశం తో అయినా అనుసంధానమై, అందులో భాగం అయినప్పుడు దానిని ఎప్పటికీ మరచిపోజాలరు అని ఆయన స్పష్టంచేశారు. ఏదైనా అంశాన్ని గుర్తు పెట్టుకోవడానికి బదులు దానితో లీనం కావడం మరింత మంచిది అని చెప్పారు.
ఎలాంటి ఒత్తిడులు లేని సహజమైన భావన తో పరీక్షల కు హాజరు కండి అంటూ విద్యార్థినీ విద్యార్థుల ను ప్రధాన మంత్రి కోరారు. ‘‘మీరు పరీక్ష కు కూర్చోవడం కోసం ఎప్పుడయితే ఎగ్జామినేశన్ హాలు కు చేరుకొంటారో అప్పుడు మీ లోపలి అన్ని ఉద్విగ్నతల ను హాలు కు బయటే వదలివెళ్లాలి. మీ ధ్యాస అంతా కూడాను ప్రశ్నల కు అన్నిటికంటే ఉత్తమంగా, సకారాత్మకమైన పద్దతి లో జవాబులు రాయడంపైనే ఉండాలి, అంతే తప్ప ఏ మేరకు సన్నద్ధులు అయ్యారనే విషయంపైనో, లేదా ఇతరత్రా ఆలోచనల పైనో మీ ధ్యాస ను కేంద్రీకరించకండి’’ అని ఆయన అన్నారు.
మహమ్మారి అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్ సామాజిక దూరం పాటించేటట్టు నిర్బంధాన్ని విధించింది, అయితే అది కుటుంబాల లో భావోద్వేగపూరిత బంధాన్ని బలోపేతం కూడా చేసింది’’ అన్నారు. ఈ మహమ్మారి కాలం లో మనం ఎంతో పోగొట్టుకున్నాం, మనం జీవనం లో బంధాలను, ఇతర అంశాల విలువ ను గుర్తించడం ద్వారా మరెంతో పొందాం కూడా అని ఆయన చెప్పారు. కరోనా కాలం మనకు కుటుంబం తాలూకు ప్రాముఖ్యాన్ని, పిల్లల జీవితాల ను తీర్చి దిద్దడం లో దీని పాత్ర తాలూకు మహత్యాన్ని చాటిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పిల్లలు, వారి తరం గురించి పెద్దలు ఆసక్తి ని పెంచుకున్నట్టయితే తరాల అంతరం దానికదే సమాప్తం అయిపోతుందని ప్రధాన మంత్రి అన్నారు. పిల్లలు, పెద్దలు ఒకరి ని మరొకరు ఉత్తమమైన పద్ధతి లో అర్థం చేసుకోవాలంటే వారి మధ్య అరమరికలు ఉండకపోవడం అవసరం అని ఆయన అన్నారు. మనం పిల్లల లో తెరచిన మనస్సు తో జత పడి వారితో కలగలసిపోవాలనే విషయం లో మన స్వభావాన్ని మార్చుకొనేందుకు తయారు గా ఉండాలని పెద్దలకు ఆయన సూచించారు.
మీరు ఏమి చదువుతారనేది మీ జీవనం లో సాఫల్యానికి గాని, లేదా వైఫల్యానికి గాని ఒకే ఒక కొలమానం కాజాలదు. మీరు మీ జీవనం లో ఏం చేస్తారు అనే దానిని బట్టి మీ సఫలత, లేదా అసఫలత ఖరారు అవుతుంది. అందువల్ల సమాజం, అమ్మ-నాన్న, ప్రజల ఒత్తిడి నుంచి పిల్లలు బయటపడాలి అని అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘వోకల్ ఫార్ లోకల్’’ (స్థానిక ఉత్పత్తుల కు ప్రాధాన్యం) ప్రచార ఉద్యమం లో మీ వంతు తోడ్పాటు ను అందించండి అంటూ విద్యార్థినీ విద్యార్థులను ప్రధాన మంత్రి కోరారు. ఈ పరీక్ష లో విద్యార్థులు వంద శాతం మార్కుల తో ఉత్తీర్ణులు అవ్వాలని, భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో జతపడాలని ఆయన కోరుతూ, వారు స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఘటనల తాలూకు సమాచారాన్ని సేకరించి, వాటి ని గురించి రాయాలని ఆయన అన్నారు.
ఈ కింద పేర్కొన్న విద్యార్థినీ విద్యార్థుల, ఉపాధ్యాయుల, తల్లితండ్రుల ప్రశ్నల కు ప్రధాన మంత్రి సమాధానాలిచ్చారు:
ఎమ్. పల్లవి- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పొదిలి, ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్; అర్పణ పాండే- గ్లోబల్ ఇండియా ఇంటర్ నేశనల్ స్కూల్, మలేశియా; పుణ్యో సూన్య్- వివేకానంద కేంద్ర విద్యాలయ్, పాపుమ్ పారే, అరుణాచల్ ప్రదేశ్; వినీతా గార్గ్ గారు (ఉపాధ్యాయిని)- ఎస్ఆర్ డిఎవి పబ్లిక్ స్కూల్, దయానంద్ విహార్, దిల్లీ; నీల్ అనంత్, కె.ఎమ్. - శ్రీ అబ్రాహమ్ లింగ్ దమ్, వివేకానంద కేంద్ర విద్యాలయ్ మెట్రిక్, కన్యాకుమారి, తమిళ నాడు; అక్షయ్ కేకాత్ పురే (తండ్రి)- బెంగళూరు, కర్నాటక; ప్రవీణ్ కుమార్, పట్ నా, బిహార్; ప్రతిభా గుప్తా (తల్లి), లుధియానా, పంజాబ్; తనయ్, విదేశీ విద్యార్థి, సామియా ఇండియన్ మాడల్ స్కూల్, కువైత్; అశ్ రఫ్ ఖాన్ - మసూరీ, ఉత్తరాఖండ్; అమృతా జైన్, మురాదాబాద్, ఉత్తర్ ప్రదేశ్; సునీతా పాల్ (తల్లి), రాయ‌్ పుర్, ఛత్తీస్ గఢ్; దివ్యంకా, పుష్కర్, రాజస్థాన్; సుహాన్ సహగల్, అహల్ కోన్ ఇంటర్ నేశనల్, మయూర్ విహార్, దిల్లీ; ధారవీ బోపట్- గ్లోబల్ మిశన్ ఇంటర్ నేశనల్ స్కూల్, అహమదాబాద్; క్రిస్టీ సైకియా, కేంద్రీయ విద్యాలయ, ఐఐటి, గువాహాటీ; శ్రేయాన్ రాయ్, సెంట్రల్ మాడల్ స్కూల్, బారక్ పుర్, కోల్ కాతా.
***
(Release ID: 1710353)
Visitor Counter : 218
Read this release in:
Hindi
,
Tamil
,
Assamese
,
Marathi
,
Kannada
,
English
,
Urdu
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam