వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశంలోకి ఎఫ్‌డిఐ ప్రవాహాల పెరుగుదలకు ప్రభుత్వ చర్యలు;
ఏప్రిల్,2020 నుంచి జనవరి 2021వరకు మొత్తం 72.12 యుఎస్ బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలను ఆకర్షించిన భారత్
మొత్తం ఎఫ్‌డిఐ పెట్టుబడి ప్రవాహాలలో 45.81%తో అగ్ర రంగంగా అవతరించిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్
జనవరి, 2021లో మొత్తం 29.09% ఎఫ్‌డిఐ ప్రవాహంతో పెట్టుబడిదారు దేశాలలో ముందు స్థానంలో నిలిచిన జపాన్
Posted On:
05 APR 2021 3:32PM by PIB Hyderabad
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) విధాన సంస్కరణలు, పెట్టుబడి సౌలభ్యం, వాణిజ్యం చేయడం సులభతరం చేయడం వంటి ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశంలోకి పెద్ద ఎత్తున ఎఫ్‌డిఐ వచ్చాయి. ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి జనవరి వరకు 72.12 అమెరికన్ బిలియన్ డాలర్ల మొత్తం ఎఫ్‌డిఐలను భారత దేశం ఆకర్షించగలిగింది. ఒక ఆర్థిక సంవత్సరంలోని తొలి పది నెలల్లో ఇది అత్యంత అధికం, 2019-20 సంవత్సరం తొలి పదినెలలతో (62.72 అమెరికన్ డాలర్లు) పోలిస్తే 15% ఎక్కువ.
ఆర్థిక సంవత్సరం 2020-21లోని తొలి పదినెలల్లో ఎఫ్‌డిఐ ఈక్విటీ (54.18 బిలియన్ అమెరికన్ డాలర్లు) అంతకు ముందు ఏడాది అదే కాలంతో పోలిస్తే 28% పెరిగినట్టు సరళులు చెప్తున్నాయి. కాగా, ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి పదినెలల్లో 30.28% మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహం పెంపుతో సింగపూర్ తొలి స్థానంలో ఉండగా, యు.ఎస్.ఎ. (24.28%), యుఎఇ (7.31%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
భారతదేశంలోమొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహాలను పరిశీలిస్తే జనవరి,2021లో పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారుగా 29.09%తో జపాన్ ముందు ఉండగా, సింగ్‌పూర్ (25.46%), యు.ఎస్.ఎ (12.06%) అనుసరించాయి.
ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి పది నెలల్లో మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహంలో 45.81% కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్ వేర్ తొలి స్థానంలో ఉండగా, నిర్మాణ (మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలలో (13.37%), సేవా రంగం (7.80%) వరుసగా ఉన్నాయి.
జనవరి 2021లో కనిపించిన సరళుల ప్రకారం, మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహాలలో కన్సల్టెన్సీ సేవల రంగం 21.80%తో ముందు స్థానంలో ఉండగా, తదనంతర స్థానాలలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్ (15.96%) సేవారంగం (13.64%) ఉన్నాయి.
భారతదేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళులు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత దేశం ఇష్టపడే పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆమోదయోగ్యమైందని సూచిస్తున్నాయి.
***
(Release ID: 1709689)
Visitor Counter : 264