రక్షణ మంత్రిత్వ శాఖ
బహుళ దేశాల సైనిక విన్యాసాలు "షాంతిర్ ఒగ్రోషేన-2021" ప్రారంభం
Posted On:
05 APR 2021 10:21AM by PIB Hyderabad
బహుళ దేశాల సైనిక విన్యాసాలు "షాంతిర్ ఒగ్రోషేన-2021", ఈ నెల 4వ తేదీన బంగ్లాదేశ్‌లో ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతితోపాటు, ఆ దేశ 50వ స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా వీటిని చేపట్టారు. భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సైన్యంతోపాటు 30 మందితో కూడిన భారత సైనిక బృందం కూడా వేడుకల్లో పాల్గొంటోంది. ఈనెల 12 వరకు విన్యాసాలు సాగుతాయి. అమెరికా, బ్రిటన్, టర్కీ, సౌదీ అరేబియా, కువైట్, సింగపూర్ సైనిక పర్యవేక్షకులు విన్యాసాలకు హాజరవుతారు.
ఉపఖండంలో శాంతిని పరిరక్షించే కార్యక్రమాలను నిర్ధారించేందుకు, పొరుగు దేశాల మధ్య విధానాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంచడం ఈ విన్యాసాల లక్ష్యం. విన్యాసాల్లో పాల్గొనే సైన్యాలన్నీ వాటి విలువైన అనుభవాలను పరస్పరం పంచుకోవడంతోపాటు, శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో విధానాలను మెరుగుపరుచుకుంటాయి.
***
(Release ID: 1709610)
Visitor Counter : 297