ప్రధాన మంత్రి కార్యాలయం

దేశం లో కోవిడ్-19 మహమ్మారి స్థితిపైన, ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం పైన సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి

Posted On: 04 APR 2021 5:05PM by PIB Hyderabad

దేశం లో కోవిడ్-19 మహమ్మారి స్థితి ని, ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని సమీక్షించడం కోసం ఆదివారం నాడు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

దేశం లో కోవిడ్-19 స్థితి ని నిలకడైన రీతి లో సంబాళించడానికి గాను సముదాయం పరమైన జాగరూకత, సముదాయం భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనవి అని, కోవిడ్-19 మహమ్మారి ని అదుపు చేయడం కోసం ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజా ఉద్యమాన్ని కొనసాగించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మార్గనిర్దేశం చేశారు. ‘‘పరీక్షలు చేస్తూ ఉండటం (టెస్టింగ్), బాధితుల జాడ ను గుర్తించడం (ట్రేసింగ్), చికిత్స ను అందించడం (ట్రీట్ మెంట్), కోవిడ్ నేపథ్యం లో వ్యక్తులు తగిన జాగ్రత్త చర్యల ను తీసుకొంటూ ఉండడం, టీకాకరణల తో కూడిన ఐదు అంచెల సమరవ్యూహాన్ని చిత్తశుద్ధి తో, పకడ్బందీ గా అమలు చేశామంటే ఈ మహమ్మారి వ్యాప్తి ని అడ్డుకోవడం లో తోడ్పడగలదు అని ఆయన సూచించారు.

కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని వంద శాతం మాస్కు ఉపయోగానికి, వ్యక్తిగత పరిశుభ్రత కు, సార్వజనిక స్థానాలు/పని ప్రదేశాలలో పారిశుద్ధ్యానికి, మరీ ముఖ్యం గా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల విషయం లో మరింతగా శ్రద్ధ తీసుకోవడానికి పెద్ద పీట ను వేస్తూ, వ్యక్తులు గా జాగ్రత్త చర్యలను తీసుకోవడానికి  సంబంధించి 2021 ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు ఒక ప్రత్యేక ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది.  

రానున్న రోజుల లో కోవిడ్ అనుగుణ ప్రవర్తన అమలు తో పాటు పడకల లభ్యత, పరీక్ష సదుపాయాలు సహా సకాలం లో ఆసుపత్రుల కు తరలించడం తదితరాలపై అత్యంత శ్రద్ధ వహించాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ సంబంధి మౌలిక సదుపాయాల ను పెంచడం, ఆక్సీజన్, వెంటిలేటర్ లు, లాజిస్టిక్స్ పరమైన సౌకర్యాల కల్పన ద్వారా అన్ని పరిస్థితులలో మరణాలను వీలైనంతవరకు తగ్గించాలని ఆయన కోరారు. అంతేకాకుండా అన్ని ఆసుపత్రులలో చేరిన వారితో పాటు ఇంటి వద్దే ఏకాంత వాసం లో ఉన్న వారి కి సైతం వైద్యపరమైన నిర్వహణ విధివిధానాలను తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్ర లో యాక్టివ్ కేసులు మరణాలు బాగా ఎక్కువ గా ఉండడాన్ని గమనించి సార్వజనిక స్వాస్థ్య నిపుణులు, క్లీనీశియన్ లతో ఏర్పాటైన కేంద్రీయ బృందాల ను ఆ రాష్ట్రానికి పంపవలసిందని, అలాగే మరణాలు విషమానుపాతం లో నమోదు అవుతున్న పంజాబ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌ కు కూడా ఇటువంటి బృందాలనే పంపించాలని ప్రధాన మంత్రి ఆదేశించారు.

నియంత్రణ చర్యలు సమర్థంగా అమలయ్యే విధంగా చూడాలని ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ఆదేశించారు.  ఇందులో భాగంగా నియంత్రణ మండళ్లలో చురుకైన కేసుల అన్వేషణ, నిర్వహణ లో సామాజిక స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలని కోరారు.  అత్యధికం గా కేసుల నమోదు అవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి, వ్యాధి వ్యాప్తి ని అరికట్టే దిశ లో సమగ్ర ఆంక్షలు సహా అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకోవలసిందని అన్ని రాష్ట్రాలకూ ఆయన సూచించారు.

దేశం లో వివిధ రాష్ట్రాల లో కేసు ల పెరుగుదల ఆందోళనకర స్థాయి కి చేరినట్లుగా అధికారులు సవివరంగా నివేదించారు.  ఇప్పటిదాకా నిర్ధారిత కేసులు, మరణాలలో 91 శాతం కేవలం 10 రాష్ట్రాల లో నమోదైనట్లు వివరించారు.  ముఖ్యం గా మహారాష్ట్ర, పంజాబ్, ఛ‌త్తీస్‌ గ‌ఢ్‌ల‌ లో పరిస్థితి మరింత విషమం గా ఉందని సమావేశం గుర్తించింది.  దేశం లో గడచిన 14 రోజులు గా నమోదైన మొత్తం కేసుల లో 57 శాతం, మరణాల లో 47 శాతం ఒక్క మహారాష్ట్ర లోనే సంభవించాయని స్పష్టమైంది.  మహారాష్ట్ర లో రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 47,913 స్థాయి కి చేరిందని, తొలి దశ లో కేసులతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఇక దేశవ్యాప్తం గా గత 14 రోజుల లో నమోదైన కేసుల లో పంజాబ్‌ వాటా 4.5 శాతమే అయినప్పటికీ మొత్తం మరణాల లో 16.3 శాతం ఈ రాష్ట్రంలోనివే కావడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు.  అలాగే కేసుల సంఖ్య రీత్యా గత 14 రోజుల జాతీయ స్థాయి కేసుల లో ఛ‌త్తీస్‌ గ‌ఢ్‌ లో నమోదైనవి 4.3 శాతమే అయినప్పటికీ ఇదే వ్యవధిలో మరణాలు 7 శాతానికి పైగా నమోదవడం గమనార్హం.  మొత్తంమీద గడచిన 14 రోజుల లో దేశవ్యాప్తం గా నమోదైన కేసుల లో 91.4 శాతం, మరణాల లో 90.9 శాతం కేవలం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి.

కేసు ల సంఖ్య ఇంత విస్తృతంగా పెరగడానికి కోవిడ్ అనుగుణ ప్రవర్తన అనుసరణ లో తీవ్ర నిర్లక్ష్యమే కారణమని సమావేశం స్పష్టం గా అభిప్రాయపడింది.  ఆ మేరకు మాస్కు ను ధరించడం, 2 గజాల సురక్షిత  దూరం నియమ పాలన ను పట్టించుకోకపోవడం, మహమ్మారి విషయం లో  ఉదాసీనం గా ఉండడం, క్షేత్ర స్థాయి లో కట్టడి చర్యల ను సమర్థంగా అమలు చేయడం లో లోపం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది.
వైరస్ రూపు ను మార్చుకొన్న  కారణం గా కొన్ని రాష్ట్రాల లో కేసులు పెరిగినట్లు అంచనాలు ఉన్నప్పటికీ మహమ్మారి నియంత్రణ చర్యలలో ఎలాంటి వ్యత్యాసం లేదు.  కాబట్టి కేసు లు పెరుగుతున్న ప్రాంతాల లో కోవిడ్-19 నిర్వహణ కు, సంక్రమణ నియంత్రణ కు సంబంధించిన అనేక విధివిధానాలను కచ్చితం గా అమలు చేయడానికి అధిక ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసివుంది.

కోవిడ్-19 టీకా కార్యక్రమం పనితీరు పైనా అధికారులు సోదాహరణం గా సంక్షిప్త వివరణ ఇచ్చారు.  ఈ సందర్భం లో వివిధ సముదాయాలకు టీకాకరణ, ఇతర దేశాల తో పోలిస్తే జాతీయం గా టీకాకరణ అమలు తీరు, రాష్ట్రాల పనితీరు పై విశ్లేషణ తదితరాలకు సంబంధించి అందిన వివరాలపై సమావేశం చర్చించింది.  అవసరమైన చోట దిద్దుబాటు చర్యల కు వీలు గా పనితీరు పై రోజువారీ విశ్లేషణల ను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాల తో పంచుకోవాలని సూచించింది.

మరో వైపు టీకాల పై పరిశోధన-అభివృద్ధి తో పాటు ప్రస్తుత తయారీదారుల ఉత్పాదక సామర్థ్యం, ప్రయోగ పరీక్ష ల దశలో గల టీకా ల సామర్థ్యం తదితరాలపై సమావేశం చర్చించింది.  కాగా, తయారీదారులు టీకా ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారని, దీంతో పాటు దేశ విదేశాల లోని ఇతర సంస్థల తో ఈ అంశం పై చర్చిస్తున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు.  దేశీయం గా పెరుగుతున్న అవసరాలకు అనుగుణం గా టీకా ల ఉత్పత్తి కి, సేకరణ కు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.  అంతేకాకుండా ‘‘వసుధైవ కుటుంబకమ్’’ భావన తో ఇతర దేశాల వాస్తవిక అవసరాలను తీర్చే దిశలో అన్ని ప్రయాసలు సాగుతున్నాయని వివరించారు.

ఎక్కువ కేసు లు నమోదు అవుతున్న రాష్ట్రాలలో, జిల్లాల లో మిశన్ మోడ్  విధానం లో కార్యాలను కొనసాగించాలి అంటూ ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు.  ఆ మేరకు గడచిన 15 నెలలు గా కోవిడ్-19 నిర్వహణ లో సాధించిన సమష్టి విజయం నీరుగారిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

ప్రధాన మంత్రి కి ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, టీకాకరణ కార్యక్రమ సంబంధి అధికారాలు దక్కిన సమూహం అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఔషధ నిర్మాణ శాఖ కార్యదర్శి, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి, ఆయుష్ కార్యదర్శి, ఐసిఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్, భారత ప్రభుత్వానికి ముఖ్య విజ్ఞాన‌శాస్త్ర సలహాదారు, నీతి ఆయోగ్ సభ్యుడు సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు.



 

***


 



(Release ID: 1709553) Visitor Counter : 291