ప్రధాన మంత్రి కార్యాలయం

గీతా ప్రెస్ అధ్య‌క్షుడు శ్రీ రాధేశ్యామ్ ఖేమ్ కా మృతి పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 04 APR 2021 2:07PM by PIB Hyderabad

గీతా ప్రెస్ అధ్య‌క్షుడు రాధేశ్యామ్ ఖేమ్ కా గారి మృతి పట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
 

‘‘గీతా ప్రెస్ అధ్య‌క్షుడు, స‌నాత‌న సాహిత్యాన్ని ప్ర‌జ‌ల‌ వద్ద‌కు చేరుస్తున్న రాధేశ్యామ్ ఖేమ్ కా గారు మ‌ర‌ణించార‌ని తెలిసి అత్యంత దుఃఖం క‌లిగింది. ఖేమ్‌ కా గారు తన జీవన ప‌ర్యంతం విభిన్న సామాజిక కార్య‌క్ర‌మాల‌ లో చురుకు గా పాలుపంచుకొంటూ వ‌చ్చారు.  ఈ దుఃఖ‌ ఘడియ లో ఆయన కుటుంబానికి, ఆయన అభిమానుల‌కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 1709536)