భారత ఎన్నికల సంఘం

క‌రీంగంజ్ ఇవిఎంతో ముడిప‌డిన సంఘ‌ట‌న‌కు సంబంధించి వాస్త‌వ నివేదిక‌


ప్రిసైడింగ్ అధికారిపై చ‌ర్య తీసుకోవ‌డం జ‌రిగింది. అస్సాంలోని పోలింగ్ కేంద్రం 149 ర‌తాబ‌రిలో రీపోల్‌కు ఆదేశం

Posted On: 02 APR 2021 12:44PM by PIB Hyderabad

1.  ఎల్‌.ఎ.సి -1 ర‌తాబ‌రి (ఎస్‌.సి) 149- ఇందిరా ఎం.వి.స్కూల్ పోలింగ్ పార్టీ 2021 ఏప్రిల్ 1  వ తేదీన దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనింది. ప్రిసెడింగ్ అధికారి, మ‌రో ముగ్గురు పోలింగ్ సిబ్బంది తోకూడిన పోలింగ్ పార్టీ అది. వీరివెంట పోలీస్ కానిస్టేబుల్‌, ఒక‌హోంగార్డు ఉన్నారు.‌

2. సాయంత్రం 6 గంట‌ల‌కు పోలింగ్ ముగిసిన అనంత‌రం పోలింగ్ పార్టీ, పోలీస్ ఎస్కార్ట్ ఆఫీస‌ర్ ఎబిఎస్ఐ లుహిత్ గొహాని నేతృత్వంలోని సాయుధ ఎస్కార్ట్ ర‌క్ష‌ణ‌లో తిరిగి వ‌స్తున్నారు. ఏప్రిల్ 01,2021 నాడు వాతావ‌ర‌ణం అననుకూలంగా ఉంది. ఆరోజు సాయంత్రం నుంచి వ‌ర్షంప‌డుతుండ‌డంతో రోడ్లు బుర‌ద‌మ‌య‌మ‌య్యాయి.
3.జిల్లాలోని మారుమూల‌ప్రాంతాల నుంచి క‌రీంగంజ్ చేరుకోవ‌డానికి ఎన్‌.హెచ్ 8 ఒక్క‌టే ప్ర‌ధాన ర‌హ‌దారి. ఆ రోజు పోలింగ్ రోజు కావ‌డం, పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల‌కు ముగియ‌డంతో , సుమారు 1300 వాహ‌నాలు ఆ సింగిల్ హైవేపై తిరిగివ‌స్తున్నాయి. పోలింగ్ పార్టీలు క‌రీంగంజ్‌కు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత రావ‌డం మొద‌లైంది.  వాతావ‌ర‌ణం కూడా స‌రిగా లేక‌పోవ‌డంతో హైవే మీద ట్రాఫిక్‌ర‌ద్దీ విప‌రీతంగా ఉండింది.
4. పైన పేర్కొన్న పోలింగ్ పార్టీ నీలం బ‌జార్ ను స‌మీపిస్తున్న ద‌శ‌లో , పోలింగ్ పార్టీని తీసుకువెళ్తున్న ట్రాన్సుపోర్టు వాహ‌నం 2021 ఏప్రిల్ 1 రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో చ‌డిపోయింది. ఈ వాహ‌నాన్ని డిసిఆఫీస్ లోని ఎల‌క్ష‌న్ బ్రాంచ్ ట్రాన్స్‌పోర్టు సెల్ వీరికి కేటాయించింది. ట్రాఫిక్ ర‌ద్దీ, వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డంతో పోలింగ్ పార్టీ కాన్వాయ్ నుంచి వేరుప‌డింది. పోలింగ్ పార్టీ వాహ‌నం నుంచి దిగి సెక్ట‌ర్ అధికారి శ్రీ అజ‌య్ సూత్ర‌ధార్‌కు ఆయ‌న మొబైల్‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించారు. సెక్ట‌ర్ అధికారి ప్ర‌త్యామ్నాయ వాహ‌నాన్ని ఏర్పాటు చేస్తుండ‌గా పోలింగ్ పార్టీ, త‌మ వ‌ద్ద పోలింగ్ పూర్తి అయిన ఇవిఎంలు ఉన్నందున వాటిని వెంట‌నే స‌మ‌ర్పించేందుకు  పోలింగ్ మెటిరీయ‌ల్ స‌మ‌ర్పించే కేంద్రానికి వీలైనంత త్వ‌ర‌గా చేరుకునేందుకు  స్వంతంగా ఒక వాహ‌నాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకునింది.

5. రాత్రి 9 గంట‌ల 20 నిమిషాల‌కు పోలింగ్ పార్టీ అటుగా వ‌స్తున్న వాహ‌నాన్ని ఆపి ఇవిఎంలు, ఇత‌ర సామ‌గ్రిని  తీసుకుని అందులో ఎక్కింది. అయితే ఆ వాహ‌నం య‌జమాని ఎవ‌ర‌న్న‌ది వారు ప‌రిశీలించ‌లేదు. ఆ వాహ‌నం నెంబ‌ర్ ఎ.ఎస్‌.10బి- 0022. పోలింగ్ పార్టీ తెలిపిన దాని ప్ర‌కారం వారు క‌రీంగంజ్ వైపుగా బ‌య‌లుదేరి క‌రీంగంజ్‌లోని క‌నాయిషిల్ స‌మీపించ‌గా సుమారు రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ట్రాఫిక్ కార‌ణంగా వారుతమ వాహ‌నాన్ని నెమ్మ‌దిగా పోనివ్వ‌వ‌ల‌సి వ‌చ్చింది. వాహ‌నం నెమ్మ‌దిగా వెళుతున్న ద‌శ‌లో సుమారు 50 మంది పోలింగ్ పార్టీని చుట్టుముట్టి రాళ్లురువ్వ‌డం మొద‌లుపెట్టారు. అలాగే దుర్భాష‌లాడ‌డం మొద‌లుపెట్టి వాహ‌నాన్ని ముందుకు క‌ద‌ల‌కుండా అడ్డుకున్నారు. ఇలా చుట్టుముట్టిన వారికి నాయ‌కుడైన వ్య‌క్తిని అడ‌గ‌గా, ఈ వాహ‌నం పొరుగున‌గ‌ల నియోజ‌క‌వ‌ర్గ‌మైన పాత‌ర్‌కండి ఎల్‌.ఎ.సి -2  నుంచి పోటీచేస్తున్న శ్రీ కృష్ణేందు పాల్ వాహ‌న‌మ‌ని చెప్పాడు. ఇవిఎంలు మార్చ‌డానికి తీసుకెళ్తున్నార‌ని అత‌ను ఆరోప‌ణ‌లు చేశాడు.
 అప్పుడు మాత్ర‌మే పోలింగ్ సిబ్బందికి ఏదో జ‌ర‌గ‌రాని ప‌రిస్థితి ఉంద‌ని గ్ర‌హించి వెంట‌నే సెక్ట‌ర్ అధికారిని అప్ర‌మత్తం చేశారు. అయితే అప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో జ‌నం గుమికూడారు. వారు దాడి చేసి ఇవిఎంల‌తో పాటు వారిని వాహ‌నంలోనే బందీలుఆ ఉంచారు. ఇవిఎంల‌ను ట్యాంప‌ర్‌చేసేందుకు తీసుకెళుతున్నార‌ని వారు ఆరోపించారు.‌

6.  ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారం అందుకున్న వెంట‌నే క‌రీంగంజ్ డిఇఒ‌, క‌రీంగంజ్ ఎస్‌.పి.తో క‌ల‌సి సంఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశానికి రాత్రి 10 గంట‌ల 20 నిమిషాల‌కు చేరుకున్నారు. ఈ లోగా ఆ వాహ‌నం ఎవ‌రిద‌ని వాక‌బు చేయ‌గా అది శ్రీ‌మ‌తి మ‌ధుమిత పాల్ పేరుతో రిజిస్ట‌ర్ అయిన‌ట్టు గుర్తించారు. ఆమె ప‌థ‌ర్‌కండి ఎల్‌.ఎ.సి నెంబ‌ర్ 2 నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థి భార్య పేరుగా గుర్తించారు. సంఘ‌ట‌న ప్ర‌దేశానికి చేరుకున్న త‌ర్వాత గ‌మ‌నించిన‌పుడు జ‌నం పోలింగ్ పార్టీని బ‌య‌ట‌కు లాగి వారిపై దాడికి ప్రయ‌త్నిస్తున్నారు.జ‌నం హింసాత్మ‌కంగా మారి వాహ‌నం అద్దాలపై రాళ్లు రువ్వారు. జ‌నం రాళ్లురువ్వ‌డంతో క‌రీంగంజ్ ఎస్‌.పి.కి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. ఆయ‌న కాల‌ర్ బోన్ కు గాయ‌మైంది. జ‌నాన్ని చెద‌ర‌గొట్టేందుకు బ్లాంక్ ఫైరింగ్ చేయాల్సి వ‌చ్చింది. మొద‌టి పోలింగ్ అధికారి ఈ గంద‌ర‌గోళంలో క‌నిపించ‌కుండా పోయారు. ఇవిఎంలు, మిగిలిన పోలింగ్ సిబ్బందిని సురక్షితంగా అక్క‌డినుంచి కంట్రోల్ రూమ్‌కు త‌ర‌లించారు. డిఇఒ  వీటిని రాత్రి 11 గంట‌ల 20 నిమిషాల‌కు త‌న అధీనంలోకి తీసుకున్నారు.

వీటినిప‌రిశీలించి చూసిన‌పుడు పోలింగ్ జ‌రిగిన ఇవిఎంలు బియు, సియు, వివిపాట్‌లు సీలు వేసిన‌వి వేసిన‌ట్టే చెక్కుచెద‌ర‌కుండా ఉన్నాయి. వాటికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేదు. అన్ని ఐటెమ్‌ల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో భ‌ద్ర‌ప‌రచ‌డం జ‌రిగింది.
 7. మొదటి పోలింగ్ అధికారి ఏప్రిల్ 2, 2021 వేకువ‌జాము వ‌ర‌కు క‌నిపించ‌లేదు. అత‌ను ప‌క్క‌న ఉన్న పొద‌ల్లో దాగుకున్నందువ‌ల్ల రాత్రంతాఆయ‌న కోసం గాలింపు చేప‌ట్ట‌వ‌ల‌సివ‌చ్చింది. అందువ‌ల్ల ఈ నివేదిక పంప‌డంలో కొద్ది గంట‌లు ఆల‌స్యం అయింది.

8. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి ట్రాన్స్‌పోర్టు ప్రొటోక‌ల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినందుకు  షోకాజ్ నోటీసు జారీచేయ‌డం జ‌రిగింది. పి.ఓ, ఇత‌ర ముగ్గురు అధికారుల‌ను స‌స్పెన్ష‌న్‌లో ఉంచారు. ఇవిఎం ల సీళ్ల‌లో ఎలాంటి మార్పులు లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టేఉన్న‌ప్ప‌టికీ,  ర‌తాబ‌రి (ఎస్‌.సి)ఎల్‌.ఎ.సి -1 నెంబ‌ర్ 149  ఇందిరా ఎం.వి.స్కూల్ పోలింగ్ బూత్‌లో  ముందుజాగ్ర‌త్త‌గా రీ పోల్ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌త్యేక ప‌రిశీల‌కుడిని ఈ విష‌య‌మై నివేదిక కోర‌డం జ‌రిగింది.

***


(Release ID: 1709224) Visitor Counter : 223