రైల్వే మంత్రిత్వ శాఖ
2020-21 ఆర్థిక సంవత్సరానికి సరకు రవాణా రంగంలో గరిష్ఠ లోడింగ్, రాబడి సాధించిన భారతీయ రైల్వే.
Posted On:
01 APR 2021 4:52PM by PIB Hyderabad
2020-21 ఆర్ధికసంవత్సరంలో భారతీయ రైల్వే మొత్తం 1232.63 మిలియన్‌టన్నుల లోడింగ్ చేసింది. ఇది అంతకు ముంఉ సంవత్సరం ఇదే కాలంలో లోడింగ్ (1209.32 మిలియన్ టన్నులు) కన్న 1.93 శాతం అధికం
2020-21 ఆర్థఙక సంవత్సరంలో భారతీయ రైల్వే 117386.0 కోట్ల రూపాయలను సరకు లోడింగ్ పై ఆర్జించింది.
ఇది గత సంవత్సరం ఆర్జించిన రూ 113897.20 కోట్ల రూపాయల కన్న 3 శాతం ఎక్కువ
సెప్టెంబర్ 20 నుంచి మార్చి 21 వరకు వరుసగా 7 నెలలలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్తాయిలో లోడింగ్.
2021 మార్చిలో భారతీయ రైల్వే ల లోడింగ్ 130.38 మిలియన్ టన్నులు. ఇది 27.33 శాతం వృద్ధిని సాధించింది.
2021 మార్చిలో భారతీయ రైల్వే 12887.71 కోట్ల రూపాయలను సరకు రవాణా లోడింగ్‌పై ఆర్జించింది. ఇది కూడా గత సంవత్సరం ఇదే కాలం రాబడితో పోల్చిచూసినపుడు 26.16 శాతం ఎక్కువ.
కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ, భారతీయ ర ఐల్వే 2020-21 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్తాయిలో సరకు లోడింగ్‌ను నమోదు చేసింది.
2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపు నెలలో భారతీయ రైల్వే గత సంవత్సరం లోడింగ్ అంటే 1232.63 మిలియన్‌టన్నులు సాధించింది. అంతకు ముందు సంవత్సరం ఇది 1209.32 మిలియన్ టన్నులు. ఇది 1.93 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఇదే కాలంలో భారతీయ రైల్వే రాబడి 117386.0 కోట్లు సరకు రవాణా లోడింగ్‌నుంచి ఆర్జించింది. ఇది ఇంతకు ముందు సంవత్సరం సాధించిన సరకు రవాణా రాబడి కన్న 113897.20 కోట్ల రూపాయల కంటె 3 శాతం అధికం.
భారతీయ రైల్వే సెస్టెంబర్ 2020 నుంచి మార్చి 2021 వరకు వరుసగా 7 నెలలు మున్నెన్నడూ లేని రీతిలో గరిష్ఠంగా లోడింగ్‌ను జరిపింది.
2021 మార్చిలో భారతీయ రైల్వే సరకు రవాణా లోడింగ్ , రాబడి అంతకు ముందు సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే దాటిపోయాయి.
2021 మార్చిలో భారతీయ రైల్వే లోడింగ్ 130.38 మిలియన్ టన్నులు. ఇది అంతకు ముందు సంవత్సరం లోడింగ్‌తో పొల్చినపుడు 27.33 శాతం ఎక్కువ. అంతకు ముందు సంవత్సరం ఇది 103.05 మిలియన్ టన్నులు.
భారతీయ రైల్వే లోడింగ్ 130.38 మిలియన్ టన్నులు . ఇందులో 58.57 మిలియన్ టన్నుల బొగ్గు, 16.78 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 3.67 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 2.57 మిలియన్ టన్నుల ఎరువులు, 3.97 మిలియన్‌టన్నుల మినరల్ ఆయిల్,9.56 మిలియన్ టన్నుల సిమెంటు (క్లింకర్ మినహా) ఉన్నాయి. 2021 మార్చిలో భారతీయ రైల్వే 12887.71 కోట్ల రూపాయలు సరకు రవాణా లోడింగ్‌నుంచి ఆర్జించింది. ఇది గత సంవత్సరం అదే నెల రాబడి అంటే రూ 10215.08 కోట్ల రూపాయలతో పోలి5స్తే 26.16 శాతం ఎక్కువ.
రైల్వే సరకురవాణాను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో కన్సెషన్లు, డిస్కౌంట్‌లు కూడా ఇస్తుండడం చెప్పుకోవలసిన అంశం.
అలాగే సరకు రవాణా రైళ్ల వేగాన్ని ప్రస్తుత నెట్‌వర్కులో గణనీయంగా పెంచడం జరిగింది. 2021 మార్చిలో సరకు రవాణా రైళ్ల సగటు వేగం గంటలకు 45.6 కిలోమీటర్లు గా ఉంది. ఇంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో సగటు వేగం గంటలకు 24.03 కిలోమీటర్లు. అంటే వేగం 83 శాతం పెరుగుదల సాధించింది.
సరకు రవాణాలో మెరుగుదలను సంస్థాగతం చేయడం జరుగుతుంది . అలాగే రానున్న జీరో బేస్‌డ్ టైమ్ టేబుల్‌లో దీనిని చేర్చడం జరుగుతుంది.
సమర్థతను, పనితీరును అన్నిరకాలుగా మెరుగు పరచుకునేందుకు కోవిడ్ -19ను భారతీయ రైల్వే సమర్ధంగా ఉపయోగించుకుంది.
***
(Release ID: 1709194)
Visitor Counter : 243