మంత్రిమండలి
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాన్ని ఆమోదించిన కేబినెట్
Posted On:
31 MAR 2021 3:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, కేంద్ర ప్రభుత్వ రంగ పథకమైన , ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాన్ని ఆమోదించింది. భారతదేశపు సహజ వనరులకు అనుగుణంగా అంతర్జాతీయ తయీరీ ఛాంపియన్ల సృష్టికి మద్దతు ఇచ్చేందుకు అనుగుణంగా ఇది ఉంటుంది. అలాగే రూ 10,900 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆహార ఉత్పత్తులకు సంబంధించి భారతీయ బ్రాండులకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది.
ఈ పథకం లక్ష్యాలు:
అంతర్జాతీయ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ ఛాంపియన్లకు మద్దతు నివ్వడం.
ఎంపిక చేసిన భారతీయ బ్రాండుల ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రాచుర్యంపొందేలా బలోపేతం చేయడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి మంచి ఆదరణ ఉండేట్టు చూడడం.
వ్యవసాయేతర రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం.
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేట్టు చూడడం, రైతులకు ఎక్కువ రాబడి వచ్చేలా చేయడం.
ముఖ్యాంశాలు.
ఈ పథకం లక్ష్యాల ప్రకారం కనీస నిర్దేశిత అమ్మకాలు కలిగి , ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కనీస పెట్టుబడి పెట్టగలిగిన ఆహార తయారీసంస్థలకు మద్దతునివ్వడం, అలాగే బలమైన భారతీయ బ్రాండ్‌లు విదేశాలలో వెలుగొందడానికి ప్రోత్సాహకం అందింవ్వడం. ఇందుకు
ఇందులో మొదటి కాంపొనెంట్, నాలుగు ప్రధాన ఆహార ఉత్పత్తుల సెగ్మెంట్‌కు ప్రోత్సాహకం అందించడానికి సంబంధించినది. ఉదాహరణకు రెడీటు కుక్, రెడీటు ఈట్ ఫుడ్‌లు, ప్రాసెస్‌డ్ పండ్లు, కూరగాయలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, మొజరెల్లా వెన్న వంటివి ఇందులో ఉన్నాయి. సూక్ష్మ మధ్యతరహా ఎంటర్ ప్రైజ్‌లకు చెందిన వినూత్న ఆర్గానిక్ ఉత్పత్తులైన ఫ్రీ రేంజ్ ఎగ్‌లు, పౌల్ట్రీ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తులు పై కాంపొనెంట్లో చేరుతాయి.
ఎంపిక చేసిన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులో పేర్కొన్నట్టు మొదటి రెండు సంవత్సరాలు అంటే 2021-22, 2022-23 లలో ప్లాంటు, యంత్రాలపై ( పేర్కొన్న కనీస మొత్తానికి లోబడి) పెట్టుబడి పెట్టనున్నట్టు అండర్‌టేకింగ్ ఇవ్వాలి.
2020-21లో పెట్టిన పెట్టుబడి కూడా నిర్దేశిత పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడంలో లెక్కిస్తారు.
వినూత్న , ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీ కి సంబంధించి ఎంపిక చేసిన సంస్థలకు కనీస నిర్దేశిత అమ్మకాలు, నిర్దేశి పెట్టుబడి షరతులు వర్తించవు.
రెండో కాంపొనెంట్ విదేశాలలో బ్రాండింగ్, మార్కెటింగ్ కు సంబంధించినది. విదేశాలలో బలమైన భారతీయ బ్రాండ్‌లుగా ఎదిగేందుకు ప్రోత్సాహకానికి సంబంధించినది.
విదేశాలలో భారతీయ బ్రాండ్‌ల ప్రోత్సాహానికి ఈ పథకం , దరఖాస్తుచేసుకున్న సంస్థలకు ఇన్ స్టోర్ బ్రాండింగ్, షెల్ఫ్ స్పేస్ అద్దె, మార్కెటింగ్‌కు గ్రాంట్‌కు వీలు కల్పిస్తుంది.
ఈ పథకాన్ని ఆరేళ్ల కాలం 2021-22 నుంచి 2026-27 వరకు అమలు చేస్తారు.
ఉపాధి కల్పన సామర్ధ్య ప్రభావం:
ఈ పథకం అమలు వల్ల ప్రాసెస్ చేసిన ఆహారం ఉత్పత్తిని 33,494 కోట్ల రూపాయల మేరకు విస్తరింపచేయడానికి వీలు కలుగుతుంది.
ఇది 2026-27 నాటికి సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది.
***(Table)**
ఆర్థికతతో ముడిపడిన అంశాలు:
|
సెగ్మెంట్ వారీగ, సంవత్సరం వారీగా ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహక పథకం కింద కేటాయింపులు. ( రూ. కోట్లలో)
|
|
|
|
|
|
|
|
|
|
|
ఆర్‌టిసి, ఆర్‌టిఇ
ఫుడ్స్
|
ప్రాసెస్డ్ ఎఫ్ అండ్ వి
|
మెరైన్ ఉత్పత్తులు
|
మొజారెల్లా వెన్న
|
అమ్మకాలపై ప్రోత్సాహకం
|
విదేశాలలో బ్రాండింగ్
మార్కెటింగ్
|
పరిపాలనా ఖర్చులు
|
మొత్తం
|
|
|
|
|
|
|
|
|
|
2021-22
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
10
|
10
|
2022-23
|
280
|
272
|
58
|
20
|
630
|
375
|
17
|
1,022
|
2023-24
|
515
|
468
|
122
|
40
|
1145
|
375
|
17
|
1,537
|
2024-25
|
745
|
669
|
185
|
63
|
1662
|
275
|
17
|
1,954
|
2025-26
|
981
|
872
|
246
|
70
|
2169
|
250
|
17
|
2,436
|
2026-27
|
867
|
701
|
212
|
54
|
1833
|
125
|
17
|
1,975
|
2027-28
|
794
|
601
|
170
|
36
|
1601
|
100
|
15
|
1,716
|
Total
|
4181
|
3582
|
993
|
283
|
9040
|
1500
|
110
|
10,900*
|
**రూ 250 కోట్ల (సుమారు 2 శాతం కేటాయింపులు) ను ఎస్.ఎం.ఇ రంగంలోని వినూత్న , ఆర్గానిక్ రంగం, ఫ్రీరేంజ్ గుడ్లు, పౌల్ట్రీ మాంసం, గుడ్ల ఉత్పత్తులు, ఏదైనా లేదా అన్ని సెగ్మెంట్లకు సంబంధించినది ఇందులో కలిసి ఉంది.
|
అమలు వ్యూహం, లక్ష్యాలు:
ఈ పథకాన్ని అఖిలభారత స్థాయిలో అమలు చేస్తారు.
ఈ పథకాన్ని ఒక ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (పిఎంఎ)ద్వారా అమలు చేస్తారు.
ఈ పిఎంఎ దరఖాస్తులు , ప్రతిపాదనలు, ప్రోత్సాహకానికి అర్హతా పరిశీలన , ప్రోత్సాహకంం అందించేందుకు క్లెయిమ్‌లకు గల అర్హతా పరిశీలన వంటి వాటికన్నింటికీ పిఎంఎ బాధ్యత వహించవలసి ఉంటుంది.
ఈ పథకం కింద ప్రోత్సాహకాలను 2026-27 తో అంతమయ్యే సంవత్సరం వరకు చెల్లిస్తారు. ఒక నిర్దేశిత సంవత్సరానికి ఉద్దేశించిన ప్రోత్సాహక మొత్తం , ఆ మరుసటి సంవత్సరానికి చెల్లింపు చేయాల్సిన మొత్తం అవుతుంది. ఈ పథకం కాలపరిమితి ఆరు సంవత్సరాలుగా అంటే 2021-22 నుంచి 2026 -27 వరకు ఉంటుంది.
ఈ పథకం పరిమితి నిధులు కలిగినది. అంటే ఖర్చు ఆమోదిత మొత్తానికే ఉంటుంది. ప్రతి లబ్ధిదారుకు చెల్లించే గరిష్ఠ ప్రోత్సాహకాన్ని ముందే అంటే లబ్ధి దారుని ఎంపిక చేసేటపుడే నిర్ణయిస్తారు. పనితీరు, సాధించిన దానితో సంబంధం లేకుండా ఈ గరిష్ఠ మొత్తాన్ని ఏమాత్రం మించరాదు.
ఈ పథకం అమలు తో ప్రాసెసింగ్ సామర్ధ్యం విస్తరణకు వీలు కల్పిస్తుంది. ఇది ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తి ని రూ 33,493 కోట్ల రూపాయలకు తీసుకెళుతుంది. అలాగే సుమారు 2.5 లక్షల మందికి 2025-27 నాటికి ఉపాధిని కల్పిస్తుంది.
పథకం అమలు:
ఈ పథకాన్ని కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన గల సాధికారతా గ్రూప్ కార్యదర్శులు పర్యవేక్షిస్తారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ పథకం కింద దరఖాస్తుల ఎంపికను, మంజూరు, నిధుల విడుదలను ఆమోదిస్తుంది.
మంత్రిత్వశాఖ ఈ పథకం అమలుకు సంబంధించిన వివిధ కార్యకలాపాల విషయమై కార్యాచరణను రూపొందిస్తుంది. థర్డ్ పార్టీ పరిశీలన, మధ్యంతర సమీక్షా యంత్రాంగం వంటి వాటిని ఈ కార్యక్రమంలో అంతర్గతంగా ఉంచడం జరుగుతుంది.
నేషనల్ పోర్టల్, ఎం.ఐ.ఎస్:
ఈ పథకానికి సంబంధించి నేషనల్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో దరఖాస్తుదారులైన ఎంటర్ ప్రైజ్ సంస్థలు ఈ పథకంలో పాల్గొనేందుకు దరఖాస్తుచేసుకోవలసి ఉంటుంది.
అన్ని స్కీమ్ కార్యకలాపాలను నేషనల పోర్టల్ కింద చేపట్టడం జరుగుతుంది.
కన్వర్జెన్స్ ఫ్రేమ్ వర్క్:
ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ కింద అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ( పిఎంకెఎస్‌వై)కింద చిన్న మధ్యతరహా ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజ్‌లకు సరఫరా చెయిన్ మౌలికసదుపాయాల విషయంలో బలోపేతం చేసేందుకు, ప్రాసెసింగ్ సామర్ధ్యాల విస్తరణ, పారిశ్రామిక ప్లాట్ల అందుబాటును పెంచడం, నైపుణ్యాభివృద్ధికి వీలు కల్పించడం, పరిశోధన అభివృద్ధి, ప్రయోగ సదుపాయాలు కల్పించడం వంటి వాటికి మద్దతు నిస్తారు.
కన్వర్జెన్స్ ఫ్రేమ్ వర్క్
భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకింద అన్ని రంగాలకు సంబంధించిన అంటే సూక్ష్మ నుంచి భారీ పరిశ్రమల వరకు ఉన్నాయి.
వనరుల విషయంలొ ఇండియా పోటీ ని తట్టుకోగల స్థితిలో సానుకూలంగా ఉంది. దేశీయంగా భారీ మార్కెట్, విలువ జోడింపు కలిగిన ఉత్పత్తుల ప్రోత్సాహానికి అవకాశం ఉంది.
ఈ రంగం పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని అందిపుచ్చుకోవడానికి భారతీయ కంపెనీలు తమ పోటీ సామర్ద్యాన్ని , ఇదే తరహా అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తి, ఉత్పాదకత, విలువ జోడింపు , ఇతర అంతర్జాతీయ వాల్యూ చెయిన్‌తో అనుసంధానం విషయంలో పోటీనిచ్చే బలాన్ని మరింత మెరుగు పరచుకోవాలి.
నీతి ఆయోగ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఇండియా తయారీ సామర్ధ్యాలు, ఎగుమతుల పెంపునకు రూపొందించిన ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం ఆధారంగా , ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రతిపాదిత ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని రూపొందిచడం జరిగింది.
***
(Release ID: 1708816)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam