ఆయుష్

అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) 2021 న ప్రధానమంత్రి యోగా అవార్డులు

Posted On: 31 MAR 2021 2:12PM by PIB Hyderabad

నవంబర్ 9, 2014న ప్రారంభమైనప్పటి నుండి ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఎంవోఏ), భారత ప్రభుత్వం (జివోఐ) ప్రపంచవ్యాప్తంగా యోగా సాధనకు ప్రాముఖ్యం కల్పించేందుకు విశేషంగా కృషిచేస్తున్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఎంవోఏ)ముఖ్య కార్యక్రమాలలో ఒకటైన అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) అంతర్జాతీయ గుర్తింపు పొందింది. యోగా యొక్క ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడం మరియు యోగా ద్వారా ఆరోగ్యం ఆరోగ్యంపై ప్రజల ఆసక్తిని పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై) పాటించడం యొక్క లక్ష్యం.


గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) 2016 న, రెండు రకాల యోగా అవార్డులను ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(ఐడివై) సందర్భంగా అంతర్జాతీయం మరియు జాతీయ అవార్డులు ప్రకటించబడతాయి. యోగా యొక్క ప్రమోషన్ మరియు అభివృద్ధికి నిరంతర కృషి చేయడం ద్వారా సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వ్యక్తి (లు) / సంస్థ(ల)ను గుర్తించడం మరియు సత్కరించడం ఈ అవార్డుల యొక్క ఉద్దేశ్యం.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ అవార్డు కోసం 2020లో దరఖాస్తులు ఆహ్వానించలేదు. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగానే ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఎంఓఏ), భారత ప్రభుత్వం (జీవోఐ) ప్రధాన మంత్రి యోగా అవార్డులతో (పిఎంవైఎ) దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా గతంలో గుర్తింపునకు నోచుకోని హీరోలను మరియు సంస్థలను సత్కరిస్తుంది. ఈ అవార్డును MY GOV  ప్లాట్‌ఫామ్‌లో నిర్వహిస్తారు. భారతీయ మూలం కలిగిన సంస్థలకు రెండు జాతీయ వర్గాలు మరియు భారతీయ లేదా విదేశీ మూలానికి చెందిన సంస్థలకు రెండు అంతర్జాతీయ వర్గాలు ఉంటాయి. ఈ అవార్డుల కోసం దరఖాస్తుదారులు / నామినీలు యోగాలో గొప్ప అనుభవం కలిగి ఉండాలి. మరియు యోగాపై లోతైన అవగాహన కలిగి ఉండాలి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును దరఖాస్తుదారు నేరుగా పంపించవచ్చు . లేదా వారు పనిచేసే ప్రముఖ వ్యక్తి లేదా సంస్థ నామినేట్ చేయవచ్చు. ఒక నిర్దిష్ట సంవత్సరంలో జాతీయ అవార్డు లేదా అంతర్జాతీయ అవార్డుకు ఒక దరఖాస్తుదారుడు ఒక అవార్డు విభాగానికి మాత్రమే నామినేట్ చేయవచ్చు / నామినేట్ కాబడవచ్చు.

ఈ సంవత్సరానికి నామినేషన్ ప్రక్రియ 30/03/2021 నుండి ప్రారంభమయింది. ఎంట్రీలు సమర్పించడానికి చివరి తేదీ 30/04/2021. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుంది. దీని కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఎంవోఏ), భారత ప్రభుత్వం (జివోఐ), స్క్రీనింగ్ కమిటీ మరియు మూల్యాంకన కమిటీ (జ్యూరీ) చేత రెండు కమిటీలను ఏర్పాటు చేస్తాయి. అవార్డుల గ్రహీతలను ఖరారు చేసేందుకు ఇవి ఎంపిక మరియు మూల్యాంకన ప్రమాణాలను నిర్ణయిస్తాయి.  ఆసక్తిగల దరఖాస్తుదారులు నామినేషన్ల ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మరియు పాల్గొనడానికి https://innovateindia.mygov.in/pm-yoga-awards/ వద్ద పిఎంవైఎ పేజీని దర్శించవచ్చు.


విజేతలను ట్రోఫీ, సర్టిఫికేట్ మరియు 25 లక్షల రూపాయల నగదు పురస్కారం ద్వారా సత్కరిస్తారు. ఇది 2021 జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకటించబడుతుంది. ఉమ్మడి విజేతల విషయంలో అవార్డులు విభజించబడతాయి.


 

****



(Release ID: 1708699) Visitor Counter : 196