రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
పీడీఐఎల్ నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.9.55 కోట్ల డివిడెండ్, 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.6.93 కోట్ల మధ్యంతర డివిడెండ్ స్వీకరించిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి
Posted On:
30 MAR 2021 3:45PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.9.55 కోట్ల డివిడెండ్‌ను, 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.6.93 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను 'ప్రాజెక్ట్స్ & డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్' (పీడీఐఎల్) నుంచి స్వీకరించారు. పీడీఐఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ డి.ఎస్. సుధాకర్ రామయ్య డివిడెండ్ మొత్తాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. మంత్రిత్వ శాఖ, పీడీఐఎల్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పీడీఐఎల్, సంస్థ చరిత్రలోనే 2019-20లో అత్యధికంగా ఆర్జించింది. తన కార్యకలాపాల నుంచి రూ.133.01 కోట్లు సహా మొత్తంగా 142.16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో పన్నుకు ముందు లాభం రూ.45.86 కోట్లు కాగా, పన్ను తర్వాత లాభం రూ.31.83 కోట్లు.
హెచ్‌ఆర్‌ఎల్, తాల్చర్‌కు చెందిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు పీఎంసీ సేవలను పీడీఐఎల్ అందిస్తోంది. చమురు, గ్యాస్ రంగాల్లోనూ అనేక వర్క్ ఆర్డర్లను అమలు చేస్తోంది.
పీడీఐఎల్, కేటగిరీ-1కు చెందిన మినీ రత్న హోదా సంస్థ. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు చేపట్టే కార్యకలాపాలు, ప్రాజెక్టు నిర్వహణ సంప్రదింపులు, ఆకృతి &నిర్మాణం, నాణ్యత హామీ వంటి సేవలను అందించే ఇంజినీరింగ్, సంప్రదింపుల సంస్థ ఇది.
***
(Release ID: 1708509)
Visitor Counter : 171