ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా ఏక్శన్ ప్లాన్ 2020 సమిట్ లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి
గడచిన 8 నెలల్లో నిర్ణయాలు తీసుకోవడం లో ప్రభుత్వం సెంచురి ని సాధించిందంలటూ ఉద్ఘాటన
ప్రక్రియ ప్రధానమైన పన్నుల వ్యవస్థ స్థానం లో పౌర ప్రధానమైన పన్నుల వ్యవస్థ ను తీసుకురావడమైందని వెల్లడి
‘న్యూ ఇండియా’ నిర్మాణం లో ప్రసార మాధ్యమాలు ఒక ప్రధానమైన నిర్మాణాత్మక పాత్ర ను పోషించాలంవటూ సూచన చేశారు
భారతదేశం నూతన శిఖరాల ను చేరుకొనేందుకు ప్రతి ఒక్క పౌరుడు/పౌరురాలు వారి యొక్క విధుల ను నెరవేర్చాలని స్పష్టీకరణ
Posted On:
12 FEB 2020 9:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ టివి ఛానల్ టైమ్స్ నౌ ఏర్పాటు చేసిన ఇండియా ఏక్శన్ ప్లాన్ 2020 సమిట్ లో ప్రధానోపన్యాసమిచ్చారు.
ప్రపంచం లో అత్యంత యువ దేశమైన భారతదేశం నూతన దశాబ్ది కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించుకొంటున్నదని, యువ భారతదేశం మందగతి న సాగాలన్న భావన లో లేదని శ్రీ మోదీ అన్నారు.
ప్రభుత్వం ఈ స్ఫూర్తి ని అవలంబించి, గత కొన్ని మాసాలు గా నిర్ణయాల ను తీసుకోవడం లో ఒక సెంచురి ని సాధించింది అని ప్రధాన మంత్రి వివరించారు.
ఈ మార్పు లు సమాజం లో ప్రతి ఒక్క స్థాయి లో క్రొత్త శక్తి ని చొప్పించి, సమాజం లో విశ్వాసాన్ని నింపాయి అని కూడా ఆయన అన్నారు.
ఈ రోజు న దేశం లోని పేదలు వారి యొక్క జీవన ప్రమాణాల ను మెరుగు పరచుకొని, పేదరికం లో నుండి బయట కు రాగలుగుతాము అనేటటువంటి విశ్వాస భావన ను అలవరచుకొన్నారని, అలాగే రైతులు వారి యొక్క వ్యావసాయిక ఆదాయాన్ని పెంచుకోగలమన్న నమ్మకం తో ఉన్నారని ప్రధాన మంత్రి చెప్పారు.
5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ - చిన్న పట్టణాలు మరియు నగరాల పై శ్రద్ధ:
“భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ ను రాబోయే 5 సంవత్సరాల కాలం లో 5 ట్రిలియన్ డాలర్స్ విలువైంది గా విస్తరించుకొనే ధ్యేయం తో ఉంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఆ దిశ గా పాటుపడడం అనేది ఉత్తమమైనటువంటి కార్యం. ఈ లక్ష్యం సులభమైందేమీ కాదు అయితే సాధించడాని కి అసాధ్యమైంది మాత్రం కాదని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ లక్ష్యాన్ని సాధించాలంటే దేశం లో ఎగుమతుల ను పెంచుకోవడం తో పాటు తయారీ రంగాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఈ దిశ గా అనేక కార్యక్రమాల ను చేపట్టింది అని ఆయన వివరించారు.
ఈ ప్రయత్నాలన్నింటి నడుమ భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో హెచ్చు తగ్గు లతో పాటు ఒక ప్రవర్ధమాన ఆర్థిక వ్యవస్థ గా మరిన్ని సవాళ్ళ ను కూడా ఎదుర్కొంటున్నదని ప్రధాన మంత్రి చెప్పారు.
మొట్టమొదటి సారిగా, ప్రభుత్వం చిన్న నగరాల ఆర్థిక వృద్ధి పైన వాటి ని వృద్ధి తాలూకు నూతన కేంద్రాలు గా తయారు చేయడం పైన శ్రద్ధ వహిస్తోందని ఆయన నొక్కి పలికారు.
పన్నుల వ్యవస్థ ను మెరుగు పరచడం:
- పన్నుల వ్యవస్థ ను మెరుగు పరచడాని కి ప్రతి ప్రభుత్వం ఎంతో తటపటాయించిది. సంవత్సరాల తరబడి దీని లో ఎటువంటి మార్పు లేకపోయింది. ప్రస్తుతం మనం ఒక ప్రక్రియ కేంద్రిత పన్నుల వ్యవస్థ నుండి ఒక పౌర కేంద్రిత పన్ను వ్యవస్థ కు మళ్ళుతున్నాము. టాక్స్ పేయర్స్ చార్టర్ అమలవుతున్న కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన భారతదేశం స్థానాన్ని సంపాదించుకోనున్నది. ఈ నియమావళి పన్ను చెల్లింపుదారుల హక్కులు ఏమేమిటి అన్న దాని ని స్పష్టం గా నిర్వచించనున్నది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.
ప్రజలు పన్నుల ను ఎగవేస్తున్న అంశాన్ని గురించి, ఇది చిత్తశుద్ధి తో పన్ను చెల్లించే వ్యక్తి కి రెండింతల భారాన్ని మోపుతున్నదన్న సంగతి ని గురించి భారతదేశం లో ప్రతి ఒక్కరు ఆత్మపరీక్ష చేసుకోవాలి అని ప్రధాన మంత్రి కోరారు. పౌరులంతా బాధ్యతాయుతమైన పౌరుల వలె మెలగాలని, వారు వారి యొక్క పన్నుల ను చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒక సమృద్ధమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడం లో నిర్మాణాత్మకమైన భూమిక ను పోషించవలసిందిగా ప్రసార మాధ్యమాల ను ఆయన కోరారు.
‘‘ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ వారి వారి విధుల ను నెరవేర్చుతారో, అటువంటప్పుడు పరిష్కరించడానికి ఏ సమస్య మిగలదు. అది జరిగినప్పుడు దేశం ఒక క్రొత్త బలాన్ని, నవీనమైన శక్తి ని అందిపుచ్చుకొంటుంది. ఇది భారతదేశాన్ని ఈ దశాబ్ది లో నూతన శిఖరాల కు తీసుకు పోతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1708298)
Visitor Counter : 81