ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో, ‘న్యూ ఇండియా’కు పునాది చిన్న పట్టణాలు అని స్పష్టీకరణ
2024వ సంవత్సరం కల్లా మరో 100 విమానాశ్రయాల ను అభివృద్ధి చేస్తామని వెల్లడించిన ప్రధాన మంత్రి
Posted On:
06 FEB 2020 7:10PM by PIB Hyderabad
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న ప్రసంగించారు. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న లక్ష్యం ఆకాంక్షాసూచకమైందే అని, అయితే మనం తప్పక పెద్ద ఆలోచనలు చేస్తూ ముందుకు సాగాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలం గా ఉందని మీకు మరొక్కమారు భరోసా ను కల్పించే అవకాశాన్ని నాకు ఇవ్వండి. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ తాలూకు కల ను పండించడం కోసం భారతదేశం పూర్తి సామర్థ్యం తోను, అత్యంత వేగం తోను పయనిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
5 ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ప్రభుత్వం గ్రామీణ మరియు నగర సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన, ఎంఎస్ఎంఇ స్, వస్త్ర పరిశ్రమ, సాంకేతిక విజ్ఞానం మరియు పర్యటన రంగాల పై శ్రద్ధ వహిస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగాలు అన్నిటి ని ముందుకు తీసుకు పోవడం కోసం అనేక చర్యల ను చేపట్టడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా కు వేగాన్ని సంతరించడానికి పన్ను ల స్వరూపం సహా అన్ని ప్రక్రియల ను సరళతరం చేయడమైంది. ఈ నిర్ణయాలు దేశం లో తయారీ కి సంబంధించి క్రొత్త ఉత్సాహం జనించేటట్టు చూస్తాయి. బ్యాంకింగ్ రంగం లో విలీనం విధానం అర్థవంతమైన ఫలితాల ను ఇవ్వడాన్ని ఈ సరికే మొదలుపెట్టింది.
చిన్న పట్టణాలు ‘న్యూ ఇండియా’ కు పునాది
దేశం లో అత్యంత మహత్వాకాంక్ష కలిగిన యువతీ యువకులు నివసిస్తోంది చిన్న పట్టణాల లోనే, అంతేకాదు ‘న్యూ ఇండియా’కు పునాది సైతం ఈ చిన్న పట్టణాలే అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో సగాని పైగా దేశం లోని చిన్న నగరాల లో చోటు చేసుకొంటున్నాయి. దేశం లోని నమోదు అవుతున్న స్టార్ట్-అప్స్ లో సగ భాగం రెండో అంచె నగరాలలో, మూడో అంచె నగరాల లో ఉంటున్నాయి. ఈ కారణం గా మేము రెండో అంచె నగరాల లో, మూడో అంచె నగరాల లో ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని శరవేగం గా పూర్తి చేయడం పట్ల శ్రద్ధ వహిస్తున్నాము. హైవే కనెక్టివిటీ ని, ఇంకా రైల్ కనెక్టివిటీ ని శీఘ్రగతి న మెరుగుపరచడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
2024వ సంవత్సరం కల్లా మరో 100 విమానాశ్రయాలు
ఉడాన్ (UDAN) పథకం లో భాగం గా 250వ మార్గాన్ని ఇటీవలే ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఈ పథకం భారతదేశం లోని 250 చిన్న నగరాల లో వాయు సంధానాన్ని అందుబాటు లోకి తెచ్చి, తత్సంబంధిత ఖర్చు ను తగ్గించింది. ‘‘స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి 2014వ సంవత్సరం వరకు దేశం లో కేవలం 65 విమానాశ్రయాలు క్రియాశీలం గా ఉన్నాయి. అవి గడచిన 5 సంవత్సరాల లో 100 కు పైనే అయ్యాయి. 2024వ సంవత్సరానికల్లా మరో 100 విమానాశ్రయాల ను అభివృద్ధిపరచాలని, మళ్ళీ వీటి లో కూడా ఎక్కువ గా రెండో అంచె నగరాల లోను, మూడో అంచె నగరాల లోను అభివృద్ధిపరచాలనేది లక్ష్యం’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
***
(Release ID: 1708293)
Visitor Counter : 198