ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ మీద పోరులో మరో మైలురాయి దాటిన భారత్ 6 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 24 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, గుజరాత్,
మధ్యప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు
కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కఠిన చర్యలకు కేంద్రం సూచన
Posted On:
28 MAR 2021 11:24AM by PIB Hyderabad
భారత దేశం కోవిడ్ మీద పోరులో మరో కీలకమైన మైలురాయి దాటింది. దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 6 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 985018 శిబిరాల ద్వారా 6,02, 69, 782 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోస్ తీసుకున్న 81,52,808 మంది ఆరోగ్య సిబ్బంది, 51,75,597 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 88,90,046 మంది మొదటొ డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, 36,52,749 మంది రెండవ డోస్ తీసుకున్న కోవిడ్ యోధులు, 66,73,662 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘ కాల వ్యాధి గ్రస్తులు, 2,77,24,920 మంది 60 ఏళ్ళు పైబడ్డ వారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళమధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్దవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
81,52,808
|
51,75,597
|
88,90,046
|
36,52,749
|
66,73,662
|
2,77,24,920
|
6,02,69,782
|
మొత్తం డోసులలో ఎనిమిది రాష్టాలలో 60% వరకు పంపిణీ జరిగింది. ఆ ఎనిమిది రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో 40 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు.
టీకాల కార్యక్రమం మొదలైన 71 వ రోజైన మార్చి 27 నాడు 21,54,170 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో
20,09,805 మంది లబ్ధిదారులు 39,778 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంస్ది, కోవిడ్ యోధులు ఉండగా 1,44,365 మంది కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నవారున్నారు.
తేదీ: మార్చి 27, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళమధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్దవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
56,039
|
31,279
|
1,37,107
|
1,13,086
|
5,00,021
|
13,16,638
|
20,09,805
|
1,44,365
|
ఏడు రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడులో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో కొత్తగా 62,714 కేసులు రాగా ఈ ఏడు రాష్ట్రాల లోనే 81.46% నమోదు కావటం గమనార్హం. కొత్తకేసులలో 8 రాష్ట్రాల వాటా84.74% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 35,726 కేసులు రాగా చత్తీస్ గఢ్ లో 3,162, కర్నాటకలో 2,886 నమోదయ్యాయి.
రోజువారీ కొత్త కేసుల పెరుగుదల పది రాష్టాలలో నమోదవుతూ ఉంది.
దేశవ్యాప్తంగా రోజువారీ పెరుగుతున్న కేసులను ఈ క్రించి చిత్రపటం చూపుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించగా పన్నెండు రాష్ట్రాలకు చెందిన అదనపు కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, తీవ్రంగా ప్రభావితమైన 46 జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలను, ఐదంచెల వ్యూహాన్ని ఇందులో సూచించారు. ఈ రాష్ట్రాలలో మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిలీ, జమ్మూ-కశ్మీర్, కర్నాటక, పంజాబ్, బీహార్ ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 24 కోట్లకు పైబడటం మరో గమనార్హమైన అంశం. మొత్తం పాజిటివ్ శాతం 5 లోపే ఉంది.
ప్రతి పది లక్షల జనాభాలో జరిగిన పరీక్షల సంఖ్య పది హేను రాష్ట్రాలలో జాతీయ సగటు అయిన 1,74,602 కంటే తక్కువ ఉన్నాయి.
రోజువారీ పాజిటివ్ శాతం 5 కంటే స్వల్పంగా పెరిగి 5.04% అయింది.
జాతీయ సగటు అయిన 5.04% కంటే ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పాజిటివిటీ ఎక్కువగా నమోదైంది. మహారాష్టలో అత్యధికంగా వారపు పాజిటివ్ శాతం 22.78% గా నమోదైంది..
భారత్ లో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 4,86,310 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 4.06%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి పెరుగుదల 33,663 కేసులుగా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,13,23,762 కాగా, జాతీయంగా కోలుకున్న శాతం 94.59%.
గత 24 గంటలలో 28,739 మంది కోలుకోగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 14,523 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలొ కోవిడ్ వల్ల 312 మంది చనిపొయారు. వారిలో ఆరు రాష్ట్రాలవారే 82.69% మంది ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 166 మంది చనిపోగా పంజాబ్ లో 45 మంది, కేరళలో 14 మంది చనిపోయారు.
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పద్నాలుగు ఉన్నాయి. అవి: రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, లక్షదీవులు, లద్దాఖ్, డామన్-దయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1708222)
Visitor Counter : 238