వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్- అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి అంగీకారం
प्रविष्टि तिथि:
26 MAR 2021 4:16PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వేలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి పియూష్ గోయల్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యుఎస్‌టీఆర్) రాయబారి కేథరీన్ థాయ్‌తో సమావేశమయ్యారు. 25 మార్చి 2021న వీడియో కాల్ ద్వారా జరిగి ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగింది. యుఎస్‌టీఆర్‌గా నియమితులైన ఎంఎస్ కేథరీన్ థాయ్‌ని శ్రీ పియూష్ గోయల్ ఈ సందర్భంగా అభినందించారు. అనేక సమస్యలపై చర్చించారు. భారతదేశం-యు.ఎస్. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతానికి ఇరువురు సమ్మతించారు. ఒకే రకమైన ఆలోచనాత్మకత కలిగిన ప్రజాస్వామ్యపు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం. విధానాల బహిరంగతం, పారదర్శకత, సరసమైన వాణిజ్యం సూత్రాలను సమర్థిస్తూ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేకునే దిశగా ఈ చర్చలు ముందుకు సాగాయి. భాగస్వామ్య లక్ష్యాల ఆధారంగా భారతదేశం -అమెరికా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు పరస్పర సంభాషణ, చర్చల ద్వారా పెండింగ్‌లో ఉన్న వివిధ దీర్ఘాకలిక సమస్యల పరిష్కరానికి ఇరుపక్షాల వారు అంగీకరించారు. భారత్- అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరంను(టీపీఎఫ్) బలోపేతం చేయడానికి.. 2021లో ఫోరమ్ యొక్క తదుపరి మంత్రుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు వర్గాల వారు అంగీకరించారు.
****
(रिलीज़ आईडी: 1708047)
आगंतुक पटल : 226