ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ది ఎకనమిక్ టైమ్స్ వారి రీషేప్ టుమారో సమ్మేళనంలో కీలకోపన్యాసం చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.
ప్రజలు మన మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్‌ను ఆదరించారు. ఈ ఉత్సాహం, నమ్మకంవల్లే చివరి కోటి వాక్సిన్‌లు నాలుగు రోజుల వ్యవధిలోపల దాటగలిగాం.
వాక్సినేషన్ కార్యక్రమం ఒక జన భాగిదారి ఆందోళన్ : డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
26 MAR 2021 12:32PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ది ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన రీషేప్ టుమారో సమ్మేళనంలో వర్చువల్ విధానంలో కీలకోపన్యాసం చేశారు.
గత ఏడాది రోజులుగా ప్రపంచం అనుభవించిన సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ ఆయన , ఈ సంక్షొభం ఇండియాను ఎలా మరింత ఐక్యంగా, బలంగా ఉంచేందుకు దోహదపడిందో వివరించారు. “2020ని సైన్స్ సంవత్సరంగా నేను పిలుస్తాను . వాక్సిన్ తయారీ మామూలుగా ఏళ్లతరబడి సాగే ప్రక్రియ . కొన్ని సందర్భాలలో ఇది దశాబ్దాలు కూడా కావచ్చు. కానీ ఇది పట్టుమని 11 నెలల్లో సాధ్యమైంది. కేవలం గత జ నవరిలో పరిశోధన మొదలైంది, అది కూడా ఇంతకుముందెన్నడూ తెలియని వైరస్ పై పరిశోధన మొదలైంది. కానీ ఇప్పుడు మనకు ఒక వాక్సిన్ కాదు ఎన్నో వాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి . వీటిని లక్షలాది మందికి వేస్తున్నాం.ఈ ఏడాది చివరినాటికి ఇంకా ఎన్నో రకాల కోవిడ్ -19 వాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి.” అని ఆయన అన్నారు. రెండు వాక్సిన్‌లు భారత్‌లోనే తయారైనప్పటికీ భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్ ఆత్మనిర్భర భారత్ కింద ఇండియాలో అభివృద్ధి చేసినది. ఇది భారతదేశానికి గల వాక్సిన్ తయారీ సామర్ధ్యాన్ని , దానికి గల అపూర్వ శాస్త్రవిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజెప్పిందని ఆయన అన్నారు. ప్రజలు మన మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్‌ను ఆదరించారని, ఈ ఉత్సాహం వల్లే పట్టుమని నాలుగు రోజుల వ్యవధిలో కోటి వాక్సినేషన్లు దాటినట్టు ఆయన తెలిపారు.
ఇండియా , టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యూహాన్ని ఎలా అనుసరించినదీ డాక్టర్ హర్షవర్ధన్ తెలియజేశారు. అలాగే ప్రజల ప్రవర్తనలో మార్పుతీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు సాధించిన విజయాన్ని ఆయన వివరించారు. దీని వల్ల ఇండియాలో గరిష్ఠ స్థాయిలో రికవరీ రేటు ఉండి అత్యల్ప స్థాయిలో మరణాలు ఉన్నట్టు ఆయన తెలిపరాఉ. 2021-22 బడ్జెట్‌లో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమానికి బడ్జెట్‌లో రూ 35000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాక్సిన్ లబ్ధిదారులకు సంబంధించి వివిధ ప్రాధాన్యతాగ్రూప్‌లను నిర్ణయిస్తూ నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, (ఎన్‌టిఎజిఐ), నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ -19 ( ఎన్ఇజివిఎసి)లు తీసుకున్న నిర్ణయం వెనుకగల కారణాలను ఆయన కొనియాడారు.
కోవిడ్ -19 వాక్సినేషన్‌తో ఇండియా ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, 2021 జనవరి 16 న ఇండియా జాతీయ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరోజు తొలిరోజే ప్రపంచంలో మరెక్కడా లేనంతగా ఇండియాలో పెద్దసంఖ్యలో ప్రజలకు వాక్సిన్ వేయడం జరిగింది. ఇక అక్కడ నుంచి కోవిడ్ వాక్సిన్‌ను ముందుగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇచ్చి వారికి రక్షణ కల్పించడం ప్రాధాన్యతగా చేపట్టాం. తొలి 34 రోజులలో మనం కోటిమందికి వాక్సిన్ వేయగలిగాం. ఆతర్వాత వారాలలో మనం వాక్సినేషన్‌ను ఇతర ప్రాధాన్యతా వర్గాలకు విస్తరింప చేశాం. వాక్సినేషన్ కార్యక్రమం అంతటా మనం పౌరులకు వీలైనంత స్నేహపూర్వకంగా ఉండే లా చూశాం.2021 మార్చి 1 నుంచి ప్రైవేటు ఆస్పత్రులను కూడా కోవిడ్ -19 వాక్సినేషన్ కేంద్రాలుగా అనుమతించడం జరిగింది. వారు ఇందుకు గరిష్ఠంగా 250 రూపాయలు వసూలు చేసేందుకు అనుమతించడం జరిగింది. వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కాలపరిమితికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ప్రజలు దేశవ్యాప్తంగా తమకు తోచిన సమయంలో 24గంటలలో ఎప్పుడైనా వాక్సిన్ వేయించుకోవచ్చు. కేవలం కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు దాటిన పౌరులందరికీ, వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా దేశవ్యాప్తంగా ఎవరైనా వాక్సిన్ వేయించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించిందని ఆయన తెలిపారు. కోవిడ్ -19 వాక్సిన్ ఛత్రాన్ని మరింత విస్తరింప చేసి మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు దీనిని చేరేలా చేసేందుకు విస్తృత ప్రణాళికను రూపొందించినట్టు ఆయన తెలిపారు.
ఒక కార్యక్రమం వీలైనంత ఎక్కువమందికి చేరడానికి ఫెడరల్ వ్యవస్థ ఎలా కలసి కట్టుగా పనిచేస్తుందో ఇండియా అనుసరించిన వాక్సినేషన్ కార్యక్రమం ప్రణాళిక, అమలుకు సంబంధించి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.
వాక్సినేషన్ కార్యక్రమం ఒక జన భాగీదారి ఆందోళన్ అని ఇందులో ఎంతోమంది, ఎన్నో మంత్రిత్వశాఖలు, విభాగాలు, ప్రొఫెషనల్ సంస్థలు , మెడికల్ కళాశాలు, ఎన్.జి.ఒలు, సిఎస్ ఒలు , మీడియా సంస్థలు, ప్రైవేటు రంగం, యువకులు, మహిళా వలంటీర్ సంస్థలు కలసి కట్టుగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.
వాక్సిన్ మైత్రి చొరవ ద్వారా అంతర్జాతీయ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమానికి ఇండియా ఏమేరకు కంట్రిబ్యూట్ చేసిందన్నదని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. ఇది కోవిడ్ అనంతర పరిస్థితులకు పునర్ రూపకల్పన చేస్తున్నదని, ఇందులో ఇండియా ముద్ర కనిపిస్తున్నదని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితులలో వాక్సిన్ నేషనలిజం పెరుగుతున్నది. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ అంతర్జాతీయ సహకారానికి, మానవతకు పేరెన్నికగన్నవారు. ఆయన ఇందుకు ఒక ఉదాహరణగా నిలిచారు. మన ప్రపంచదేశాలకు సాయం అందించేందుకు వారు తీసుకున్న నిర్ణయం మనం తరతరాలుగా అనుసరిస్తూ వస్తునన వసుదైవ కుటుంబకం , ప్రపంచం మొత్తం ఒక కుటుంబం అన్న భావనకు అద్దం పడుతుంది. అలాగే కమిటీ ఆఫ్ నేషన్స్‌లో ఇండియా నిజమైన నాయకత్వ స్థానంలో ఉందన్నది మరింత బలపడింది అని ఆయన అన్నారు.
***
(Release ID: 1707895)
Visitor Counter : 147