కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ప్రధాని చేపట్టిన ‘డిజిటల్ సాధికారిక భారతదేశం’ సాకారంలో భాగంగా డిజిటల్ పరిష్కారాలను ప్రోత్సహించడానికి ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ మరియు ఐఇపిఎఫ్ఎకు సంబంధించిన మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.

Posted On: 25 MAR 2021 3:11PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రెండు టెక్-ఎనేబుల్డ్ కార్యక్రమాలైన సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ (సిఎస్సి) మరియు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఇపిఎఫ్ఎ) మొబైల్ యాప్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రధాని చేపట్టిన ‘డిజిటల్ సాధికారిక భారతదేశం’ కల సాకారానికి  ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. వర్చువల్ లాంచ్ కార్యక్రమానికి ఎంసిఎ కార్యదర్శి శ్రీ రాజేష్ వర్మ మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కొత్త కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ, “ సాంకేతిక రంగంలో డిజిటల్ సాధికారత పొందడం ద్వారా ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పౌరులకు అందుబాటులో ఉండేలా భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం డిజిటల్ ఇండియా. ఈ రెండు కార్యక్రమాలు కొత్త కార్పొరేట్ మరియు పెట్టుబడిదారుల స్నేహపూర్వక వ్యవస్థను సృష్టిస్తాయి. వ్యాపారం చేయడం మరియు ప్రజల జీవన సౌలభ్యం కోసం మరిన్ని సాంకేతిక  సేవలను ఎంసిఎ తీసుకువస్తుంది. ”అని చెప్పారు.

సమాజంతో పాటు కార్పొరేట్లు, ఆర్థిక వ్యవస్థ మరియు శ్రేయస్సు కోసం డిజిటలైజేషన్, ఆటోమేషన్ మరియు మెరుగైన సేవలను అందించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు. భారతదేశంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడిబి) ను ప్రోత్సహించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంసిఎ  పలు కార్యక్రమాలను చేపట్టిందని శ్రీమతి  సీతారామన్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫారం SPICe+ & Agile Pro వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం వల్ల కొవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా భారతదేశంలో కంపెనీల సంఖ్య లోపెరుగుదల కనిపించిందని చెప్పారు. భారతదేశంలో కంపెనీల విలీనంతో పాటు వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ప్రమోటర్లకు ఇది వన్‌ స్టాప్ పరిష్కారాలను అందించిందని వివరించారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021 వరకు సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్‌లో సుమారు 1.38 లక్షల కంపెనీలు విలీయం చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలంలో సుమారు 1.16 లక్షల కంపెనీలతో పోలిస్తే ఇది 17% పైగా పెరిగిందని శ్రీమతి సీతారామన్ తెలిపారు.


ఎంసిఎ 21 రిజిస్ట్రీపై కార్పొరేట్‌లు దాఖలు చేసిన కొన్ని స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ (ఎస్‌టిపి) ఫారాలను సెంట్రల్ స్క్రూటినీ సెంటర్‌ పరిశీలిస్తుందని మరింత లోతైన పరిశీలన కోసం కంపెనీలను ఫ్లాగ్ చేస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు.


కార్పొరేట్ డేటా యొక్క ముఖ్య ప్రాధమిక వనరులలో ఎంసీఏ ఒకటి కావడంతో డేటా నాణ్యతలో రాజీపడదని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సెంట్రల్ స్క్రూటిని పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది ప్రధానంగా వినియోగదారులు చేసిన ఫైలింగ్‌లను ప్రక్రియలను పరిశీలిస్తుంది. తద్వారా డేటా నాణ్యత సమస్యలు మరియు అవకతవకలను గుర్తించి సంబంధిత కంపెనీల రిజిస్ట్రార్‌కు తెలియజేస్తుంది. అందువల్ల డేటా యొక్క ప్రామాణికత మరియు ఖచ్చితత్వాన్ని పునరుద్ధరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే  ఇతర చర్యలను కూడా తీసుకోవచ్చు.


ఐఇపిఎఫ్ఎ మొబైల్ యాప్‌ను కూడా ఆర్థిక మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, “ ఆర్థిక అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడంతో పాటు పెట్టుబడిదారులకు అవగాహన పెంచడం, మరియు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం. తద్వారా ఈజీ ఆఫ్ లివింగ్‌ను పెంపొందించడమే తమ ధ్యేయమని" చెప్పారు.


పెట్టుబడిదారులలో అవగాహన పెంచడానికి పౌరులకు సమాచార వ్యాప్తి కోసం మొబైల్ యాప్ అభివృద్ధి చేయబడిందని శ్రీమతి సీతారామన్ తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల అవగాహన, విద్య మరియు రక్షణను గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పెట్టుబడిదారులలో వ్యాప్తి చేయడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పారు.

కార్పొరేట్ మరియు నియంత్రణ వ్యవస్థ యొక్క స్వభావాన్ని పరిశీలిస్తే, వాటాదారుల అవసరాలను తీర్చడానికి మరియు భారతదేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి  నమూనా విధానం, ప్రాసెస్ వర్క్ఫ్లో మరియు టెక్నాలజీని ఎంసిఏ అభివృద్ధి చేస్తూనే ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.


ఐఈపిఎఫ్‌ క్లెయిమ్‌ల రిఫండ్‌ పురోగతిని తెలుసుకునే సదుపాయం ఐఈపిఎఫ్‌ఏ యాప్‌లో ఉంటుంది. అంతేకాకుండా, పెట్టుబడిదారులకు మరియు సాధారణ పౌరులకు అనుమానాస్పద మోసపూరిత పథకాలపై నివేదించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ప్రస్తుతం, ఈ యాప్‌ ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లలో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్ నుండి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

***



(Release ID: 1707644) Visitor Counter : 164