సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వెదురు పరిశ్రమ విలువ రూ .30 వేల కోట్లు:నితిన్ గడ్కరీ


వెదురును పలు విధాలుగా ఉపయోగించడం ద్వారా దాని డిమాండ్‌తో పాటు తోటల పెంపకాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని పిలుపు

Posted On: 23 MAR 2021 1:53PM by PIB Hyderabad

రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ( ఐఎఫ్‌జిఈ) నిర్వహించింది.


శ్రీ గడ్కరీ తన ప్రసంగంలో  వెదురుకు డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగించుకునే అవకాశం ఉందని, నిర్మాణంలో కూడా ఉపయోగించవచ్చని  అన్నారు. అన్ని ఎన్‌హెచ్‌ఏఐ రహదారులకు త్వరలో జనపనార, కాయిర్ వాడకం తప్పనిసరి చేయనున్నట్లు శ్రీ గడ్కరీ తెలిపారు. సాంప్రదాయ ఉత్పత్తులైన జనపనార, కాయిర్ మరియు వెదురు వంటి వాటిని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఉపయోగించాలని ఆయన సూచించారు. వివిధ వర్గాల కృషి కారణంగా భారతదేశంలో వెదురు పరిశ్రమ విలువ 25-30 వేల కోట్ల రూపాయలు అవుతుందని శ్రీ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చు మరియు ఆకర్షణీయమైన ఉత్పత్తి రూపకల్పన వెదురు వాడకం మరియు డిమాండ్‌ను ప్రోత్సహించగలదని అది సాంకేతికంగా నిరూపితమయిందని చెప్పారు. తద్వారా ప్రజలు వెదురు వినియోగం వైపు మళ్లుతారని అది వెదురు పెంపకాన్ని ప్రొత్సహిస్తుందని తెలిపారు. వెదురు ప్రమోషన్‌కు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలకు ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖ నుండి అన్ని విధాలా సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మనకు ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు, ఉత్పత్తి అభివృద్ధికి మరింత సరైన విధానం, మార్కెట్ మద్దతు అవసరం అని మంత్రి అన్నారు. వెదురు, వెదురు కర్రల కోసం రైల్వే నుంచి 50 శాతం సబ్సిడీ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వెదురు వాడకం మరియు అవసరాన్ని పెంచడం ద్వారా దాని తోటల పెంపు పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బయో సిఎన్‌జి మరియు బొగ్గు తయారీకి కూడా వెదురును ఉపయోగించవచ్చని, వెదురు మిషన్ నుండి ప్రత్యేక నిధుల సహాయంతో ఐఐటిలను దీనిపై మరింత పరిశోధనలు చేయవచ్చని ఆయన అన్నారు.


పూర్తి ప్రసంగం: https://www.youtube.com/watch?v=IfZBPjgcDE0


(Release ID: 1706927) Visitor Counter : 204