విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ధృవీకృత ఈ-టెండర్ పోర్టల్ 'ప్రణిత్'ను ప్రారంభించిన పవర్‌గ్రిడ్
Posted On:
23 MAR 2021 1:02PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్‌గ్రిడ్), 'ప్రణిత్' పేరిట ఈ-టెండర్ల పోర్టల్‌ను ఆవిష్కరించింది. దీని వల్ల భౌతిక దస్త్రాల వినియోగం తగ్గడంతోపాటు, కార్యకలాపాలు సులభతరంగా ఉంటాయి. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా మారుతుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖకు చెందిన 'స్టాండర్డైజేషన్, టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్' (ఎస్‌టీక్యూసీ) ఈ పోర్టల్ వినియోగానికి ఆమోదముద్ర వేసింది.
దీనిద్వారా, భారత్‌లో, ఎస్‌టీక్యూసీ సూచించిన భద్రత, పారదర్శకత నిబంధనలన్నీ పాటించి, ఎస్‌ఏపీ పంపిణీదారు సంబంధాల నిర్వహణకు (ఎస్‌ఆర్‌ఎం) సంబంధించిన ఎలక్ట్రానిక్ సేకరణను తీసుకొచ్చిన తొలి సంస్థగా పవర్‌గ్రిడ్ అవతరించింది. ఎస్‌ఏపీ ఎస్‌ఆర్‌ఎం విధానంలో, డిజిటలీకరణ ద్వారా అనేక సృజనాత్మక ఆధునీకరణలను పవర్‌గ్రిడ్ చేపడుతోంది.
***
(Release ID: 1706917)
Visitor Counter : 219