సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి ప్రకటించారు

Posted On: 22 MAR 2021 3:05PM by PIB Hyderabad

2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి బంగాబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ కు ప్రదానం చేయబడుతుంది. మహాత్మా గాంధీ 125 వ జయంతి  సందర్భంగా గాంధీ శాంతి బహుమతి వార్షిక పురస్కారాన్ని 1995 నుండి భారత ప్రభుత్వం అందిస్తోంది.  ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రదానం చేయబడుతుంది.

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గాంధీ శాంతి బహుమతి జ్యూరీ పనిచేస్తుంది.  అలాగే ఇందులో ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉంటారు. వారిలో ఒకరు భారత ప్రధాన న్యాయమూర్తి కాగా మరొకరు లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకులు. ఇద్దరు ప్రముఖ సభ్యులు కూడా జ్యూరీలో ఉన్నారు. వారు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మరియు సులాబ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ బిందేశ్వర్ పాథక్.

2021 మార్చి 19 న జ్యూరీ  సమావేశమైంది. తగిన చర్చల తరువాత 2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి గ్రహీతగా బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. అహింసాత్మక మరియు ఇతర గాంధేయ పద్ధతులు, విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరివర్తనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించనున్నారు.

గత అవార్డు గ్రహీతలలో టాంజానియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జూలియస్ నైరెరే వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు; డాక్టర్ గెర్హార్డ్ ఫిషర్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ; రామకృష్ణ మిషన్; బాబా అమ్టే (శ్రీ ముర్లిధర్ దేవిదాస్ అమ్టే); దివంగత డాక్టర్ నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు; గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్; దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు; శ్రీ చండి ప్రసాద్ భట్ & ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే ఇటీవలి అవార్డు గ్రహీతలలో వివేకానంద కేంద్రం, ఇండియా (2015); అక్షయ పాత్రా ఫౌండేషన్, ఇండియా మరియు సులాబ్ ఇంటర్నేషనల్ (సంయుక్తంగా, 2016 కోసం); ఏకల్ అభియాన్ ట్రస్ట్, ఇండియా (2017) మరియు శ్రీ యోహీ ససకావా, జపాన్ (2018).

1 కోటి రూపాయల నగదు బహుమతితో పాటు ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు సాంప్రదాయ హస్తకళ / చేనేత వస్తువును అందిస్తారు.

బంగాబంధు మానవ హక్కులు మరియు స్వేచ్ఛ యొక్క విజేత అని భారతీయులకు కూడా ఒక హీరో అని ప్రధాని మోదీ అన్నారు. బంగాబంధు యొక్క వారసత్వం మరియు ప్రేరణ రెండు దేశాల వారసత్వాన్ని మరింత సమగ్రంగా మరియు లోతుగా తీసుకువెళ్లిందని గత దశాబ్దంలో ఇరు దేశాల భాగస్వామ్యం, పురోగతి మరియు శ్రేయస్సు కోసం బంగబంధు చూపిన మార్గం బలమైన పునాది వేసిందని ప్రధాని అన్నారు.

ముజిబ్ బోర్షోను బంగ్లాదేశ్  జరుపుకుంటున్న నేపథ్యంలో అతని వారసత్వాన్ని స్మరించుకునేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరియు ఆ దేశ ప్రజలు సంయుక్తంగా భారతదేశాన్ని గౌరవించారు.

బంగ్లాదేశ్ విముక్తిని ప్రేరేపించడంలో, కలహాల నుండి పుట్టిన దేశానికి స్థిరత్వాన్ని తీసుకురావడంలో, భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత మరియు సోదర సంబంధాలకు పునాది వేయడంలో మరియు భారత ఉపఖండంలో అహింసను శాంతిని ప్రోత్సహించడంలో బంగాబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ చేసిన అపారమైన మరియు అసమానమైన సేవలను గాంధీ శాంతి బహుమతి  గుర్తించింది.


 

******** 


(Release ID: 1706686) Visitor Counter : 470