ప్రధాన మంత్రి కార్యాలయం
పంట బీమా పథకం అంశం పై ఒక రైతు కు లేఖ రాసిన ప్రధాన మంత్రి
విత్తనం మొదలుకొని బజారు వరకు రైతు కు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య ను పరిష్కరించడాని కి నిరంతరం గా ప్రయత్నాలు జరుగుతున్నాయి: ప్రధాన మంత్రి
Posted On:
18 MAR 2021 7:01PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఆయన దిన చర్య లో తీరిక దొరకడమనేది చాలా తక్కువే అయినప్పటికీ, ఆయన తనకు ప్రజల నుంచి వచ్చే ఉత్తరాలను, వారు పంపే సందేశాలను వీలు చిక్కినప్పుడల్లా చదివి, వాటికి ప్రత్యుత్తరమిచ్చే అవకాశాలను వదలి పెట్టరు అనే సంగతి ని చాలా తక్కువ మంది మాత్రమే ఎరుగుదురు. అలాంటి ఒక లేఖ ను ఉత్తరాఖండ్ లోని నైనీతాల్ కు చెందిన శ్రీ ఖీమానంద్ అందుకొన్నారు. ఆయన ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ విజయవంతం గా అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల, ప్రభుత్వ ఇతర ప్రయాసల పట్ల నరేంద్ర మోదీ యాప్ (Namo app) ద్వారా ప్రధాన మంత్రి కి అభినందనల ను తెలియజేశారు. ఆయన తన విలువైన అభిప్రాయాల ను వెల్లడి చేసినందుకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ ఖీమానంద్ కు ఒక లేఖ ను రాశారు.
‘‘వ్యవసాయం తో సహా వివిధ రంగాల ను మెరుగుపరచడం కోసం, దేశాన్ని అభివృద్ధి తాలూకు కొత్త శిఖరాలకు చేర్చడం కోసం ప్రభుత్వం అదే పని గా చేస్తున్నటువంటి కృషి పట్ల మీరు మీ విలువైన అభిప్రాయాల ను వెల్లడి చేసినందుకు మీకు ఇవే ధన్యవాదాలు’’ అంటూ ప్రధాన మంత్రి ఆ లేఖ లో రాశారు. ‘‘అలాంటి సందేశాలు దేశానికి సేవ చేసేందుకు నన్ను నేను మరింత గా అర్పించుకోవడానికి నాకు కొత్త శక్తి ని ఇస్తాయి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సాఫల్యాన్ని గురించి ప్రధాన మంత్రి ఏమన్నారంటే, ‘‘వాతావరణ పరమైన అనిశ్చితుల తో ముడిపడిన నష్ట భయాన్ని తగ్గించడం ద్వారా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కష్టపడి పని చేసే రైతుల ఆర్థిక ప్రయోజనాల ను పరిరక్షించడం లో ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తూ వస్తోంది. రైతుల కు అనుకూలంగా ఉన్న ఈ బీమా పథకం తాలూకు లాభాల ను ప్రస్తుతం కోట్ల కొద్దీ రైతులు అందుకొంటున్నారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
వ్యసాయం, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం దీక్షబద్ధురాలు గా చేస్తున్నటువంటి కృషి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ తన లేఖ లో ఇంకా ఇలా రాశారు.. ‘‘గడచిన అయిదు సంవత్సరాల కాలం లో సంపూర్ణ రక్షణ కవచాన్ని అందిస్తూ, క్లెయిముల ను పరిష్కరించే ప్రక్రియ లో పారదర్శకత్వానికి పీట వేయడం ద్వారా ఈ ‘ఫసల్ బీమా’ (పంట బీమా) పథకం రైతుల సంక్షేమం విషయం లో మా సంకల్పాన్ని చాటి చెప్పినటువంటి ఒక ఉదాహరణ గా నిలచింది. ప్రస్తుతం విత్తనం మొదలుకొని బజారు వరకు రైతులు సాగే మార్గం లో ఎదురయ్యే ప్రతి చిన్న, పెద్ద ఇబ్బందుల ను తొలగించడానికి, మరి అలాగే వారి సమృద్ధి కి, వ్యవసాయ ప్రగతి కి పూచీ పడడానికి నిలకడతనం తో కూడిన కృషి జరుగుతోంది.’’
‘‘దేశ ప్రగతి లో ప్రజలు అందిస్తున్న తోడ్పాటు ను, వారు పోషిస్తున్న పాత్ర ను కూడా ప్రధాన మంత్రి తన ఉత్తరం లో ప్రశంసిస్తూ ఇంకా ఇలా రాశారు. ‘‘ఒక బలమైన, సమృద్ధమైన స్వావలంబనయుతమైన భారతదేశాన్ని ఒక సర్వతోముఖ అభివృద్ధి తాలూకు దార్శనికత తో నిర్మించే దిశ గా శర వేగం గా దేశం ప్రస్తుతం పురోగమిస్తోంది. పౌరులందరి విశ్వాసం ద్వారా శక్తిమంతమై దేశం జాతీయ లక్ష్యాల ను సాధించడానికి కంకణం కట్టుకొంది. దేశాన్ని ప్రపంచ రంగస్థలం మీద కొత్త శిఖరాల కు చేర్చడం లో మన ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతాయనే అంశం లో నాకు సంశయం లేనేలేదు’’ అని ప్రధాన మంత్రి తన లేఖ లో రాశారు.
అంతక్రితం, శ్రీ ఖీమానంద్ తాను పంపించిన సందేశం లో పంట బీమా పథకం అయిదేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వం వేరు వేరు సంక్షేమ పథకాల ద్వారా పౌరుల పురోగమనాని కి, అలాగే దేశం పురోగతి కి నిరంతరం పాటుపడుతోందని కూడా శ్రీ ఖీమానంద్ ప్రస్తావించారు.
*****
(Release ID: 1706054)
Visitor Counter : 200
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam