ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు

దేశంలో 3 కోట్లకు దగ్గరవుతున్న కోవిడ్ టీకాల పంపిణీ

Posted On: 15 MAR 2021 11:58AM by PIB Hyderabad

రోజువారీ కొత్త కోవిడ్ కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. గత 24 గంటలలో వచ్చిన 26,291 కేసులలో ఈ ఐదు రాష్ట్రాలవాటా 78.41% ఉంది.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో నమోదైన 16,620 కేసులు మొత్తంలో 63.21% వాటా ఉంది. ఆ తరువాత స్థానంలో  కేరళ 1,792, పంజాబ్1,492 కేసులు నమోదయ్యాయి.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001859I.jpg

 

మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అవి: మహారాష్ట్ర, తమిళనాడు. పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, హర్యానా. గత నెలరోజులలో కేరళలో కేసుల సంఖ్య తగ్గుదలబాటలో సాగుతోంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024LRB.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032RMG.jpg

 

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 2,19,262 కు చేరింది.  ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.93% . మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ మూడు రాష్ట్రాలు కలిసి మొత్తం చికిత్సలో ఉన్న వారిలో  77% వాటా చూపుతున్నాయి. ఒక్క  మహారాష్ట్రలోనే 58% కేసులున్నాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004R7LU.jpg

 

2021 జనవరి 18 నుంచి చికిత్సలో ఉన్న కేసులలో రోజువారీ మార్పులను ఈ క్రింది చిత్రపటం చూపుతోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QWJJ.jpg

 

మరోవైపు భారతదేశంలో కోవిడ్ టీకాల డోసుల సంఖ్య 3 కోట్లకు చేరువవుతోంది.  ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం ఇప్పటిదాకా 5,13,065 శిబిరాల ద్వారా 2,99,08,038 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో .

73,55,755 మొదటివిడత ఆరోగ్య సిబ్బంది డోసులు,   43,05,118 రెండో విడత ఆరోగ్య సిబ్బంది డోసులు,   73,40,423 మొదటి విడత  కోవిడ్ యోధుల డోసులు,   11,50,535 రెండో విడత కోవిడ్ యోధుల డోసులు, 14,64,014 మంది మొదటి విడత అందుకున్న 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు,   82,92,193 మంది 60 ఏళ్ళు పైబడ్డ లబ్ధిదారులు ఉన్నారు.   

 

ఆరోగ్య సిబ్బంది

 కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

73,55,755

43,05,118

73,40,423

11,50,535

14,64,014

82,92,193

2,99,08,038

 

 

టీకాల కార్యక్ర్సమం మొదలైన 58వ రోజైన మార్చి14న 1,40,880 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఆదివారం కావటంతో అనేక రాష్ట్రాలు నిన్న టీకా డోసుల పంపిణీ చేపట్టలేదు. ఈ మొత్తం డోసుల పంపిణీలో 2211 శిబిరాల ద్వారా 1,20,885 మంది ఆరోగ్య సిబ్బందికి, కొవిడ్ యోధులకు మొదటి డోస్ ఇవ్వగా 19,995 మంది ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు రెండో డోస్ ఇచ్చారు.

తేదీ: మార్చి 14, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

7,141

8,771

7,201

11,224

16,884

89,659

1,20,885

19,995

 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,10,07,352 మంది కోలుకోగా జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 96.68%. గత 24 గంటలలో

17,455 మంది కోలుకోగా, వారిలో  . 84.10% మంది 6 రాష్ట్రాలలొ కేంద్రీకృతమయ్యారు.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో

8,861 మంది కోలుకున్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006J3XU.jpg

 

గత 24 గంటలలో 118 మంది కోవిడ్ తో చనిపోయారు. వారిలో 82.20% మంది ఆరు రాష్ట్రాలవారు. మహారాష్ట్రలో అత్యధికంగా 50 మంది చనిపోగా పంజాబ్ లో 20 మంది, కేరళలో 15 మంది చనిపోయారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007O3DN.jpg

గత 24 గంటలలో 16 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: అస్సాం, చందీగఢ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, జార్ఖండ్, లక్షదీవులు, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

***



(Release ID: 1704843) Visitor Counter : 217