మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రిజిస్ట్రేషన్ రుసుము లేకుండా డీజీ లాకర్ తో ఓటిపిఆర్‌ఎంఎస్ సర్టిఫికెట్ల అనుసంధానం :కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడి
Posted On:
14 MAR 2021 12:29PM by PIB Hyderabad
ధృవీకరించబడిన ఆన్‌లైన్ టీచర్ పపిల్ రిజిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఒటిపిఆర్‌ఎంఎస్) సర్టిఫికెట్‌లకు ఇబ్బంది లేకుండా పొందడానికి సర్టిఫికెట్లను డిజిలాకర్‌తో అనుసంధానము చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ప్రకటించారు. జారీచేయబడిన ఒటిపిఆర్‌ఎంఎస్ సర్టిఫికేట్లు డిజిలాకర్ కు బదిలీ అవుతాయని వీటిని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిటిఇ) వెబ్‌సైట్ https://ncte.gov.in/website/DigiLocker.aspx మరియు digilocker.gov.in/.లలో చూసుకోవచ్చునని మంత్రి తెలిపారు.డిజిలాకర్ యాప్ ను ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఒటిపిఆర్‌ఎంఎస్ సర్టిఫికెట్లను పొందటానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తున్న 200 రూపాయలను రద్దు చేస్తునట్టు మంత్రి ప్రకటించారు. వ్యాపార లావాదేవీలను సులభంగా డిజిటల్ విధానంలో నిర్వహించడానికి సంబంధిత వర్గాలకు ఇది సాధికారత కల్పిస్తుంది.
***
(Release ID: 1704737)
Visitor Counter : 180